ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప (Pushpa) క్రేజ్ కనిపిస్తోంది. పుష్పరాజ్ మేనరిజంకు.. అతని డ్యాన్స్‏కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో పుష్పరాజ్ ట్రెండ్ సెట్టర్‏గా మారాడు. నెట్టింట్లో ఇప్పుడు పుష్ప మేనియా నడుస్తోంది.

2021 డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో...అంతకు మించి అందులోని శ్రీవల్లి సాంగ్ సూపర్ హిట్టైంది. నార్త్ లో జనాలకీ ఈ పాట తెగ ఎక్కేసింది. ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. కానీ ఈ పాట జనాల బుర్రల్లోకి ఇంకేసింది. సినిమా స్టార్స్, క్రికెటర్స్ ఇలా చాలా మంది 'పుష్ప' సాంగ్స్ కి డాన్స్ చేస్తూ.. సినిమాలో డైలాగ్స్ చెబుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు. 'తగ్గేదేలే' అనే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక శ్రీవల్లి అనే సాంగ్ కి బన్నీ వేసిన స్టెప్స్ ను అందరూ ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటను యూపి ఎలక్షన్స్ లో ప్రచారానికి సైతం వాడేసారు.

ఈ పాటను ఎలక్షన్ క్యాంపైన్ కోసం రీమిక్స్ చేసారు. కాంగ్రేస్ పార్టీ వారు ఈ పాటను రీమిక్స్ చేసారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రేష్ సోషల్ మీడియా హ్యాండిల్ వారు ఈ రీమిక్స్ వీడియోని వదిలారు. ఇప్పుడీ రీమిక్స్ సాంగ్ కూడా వైరల్ అయ్యేటట్లు కనపడుతోంది. ఈ పాట ఓట్లు తెస్తుందో లేదో కానీ జనాల నాడిని మాత్రం పట్టుకోగలుగుతుంది. మీరు ఈ సాంగ్ ని చూడండి.

Scroll to load tweet…
Scroll to load tweet…

అయితే ఈ పాట క్రెడిట్ చివర్లో దేవిశ్రీ ప్రసాద్ అని వేసి ఉంటే బాగుండేది. దాంతో కాపీ రైట్స్ ఇష్యూ రాదా అంటున్నారు. అదే అధికార పార్టీ చేస్తే కాంగ్రేస్ రచ్చ రచ్చ చేసేదంటున్నారు.

ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా ఇంత పాపులారిటీ వస్తుంటే.. మరోపక్క కొందరు ప్రముఖులు ఈ సినిమాను తప్పుబడుతున్నారు. రీసెంట్ గా పద్మశ్రీ గరికిపాటి వారు ఈ సినిమాపై ఫైర్ అయ్యారు. ఆయన 'పుష్ప'లాంటి స్మగ్లర్ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పడం వలన సమాజం చెడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఇడియట్', 'రౌడీ' పేర్లతో సినిమాలను తెరకెక్కించడం వలన సమాజానికి ఏం సందేశం ఇస్తున్నామని ఆయన ప్రశ్నించారు. సినిమాలో హీరోతో పనికిమాలిన పనులు చేయించడం వలన సమాజం ఎఫెక్ట్ అవ్వదా అంటూ మండిపడ్డారు.