ఓటిటీలో #TheRailwayMen,కంటెంట్ ఏంటంటే
యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందించిన ‘‘ది రైల్వే మెన్’’(The Railway Men) వెబ్ సిరీస్ నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీనికోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వెబ్ సీరిస్ లు సినిమాలకన్నా బాగా వర్కవుట్ అవుతున్నాయి. దాంతో పెద్ద స్టార్స్ సైతం ఈ సీరిస్ లో చేస్తున్నారు. ఆ క్రమంలో మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చన ఓ వెబ్ సీరిస్ అంతటా హాట్ టాపిక్ గా మొదైంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా ఈ సీరిస్ రూపొందింది. 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్ భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్‌లో మిథైల్ ఐసోసనియేట్ రసాయనం లీకై వేలమంది చనిపోగా లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనపై యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందించిన ‘‘ది రైల్వే మెన్’’(The Railway Men) వెబ్ సిరీస్ నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీనికోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ద రైల్వే మెన్(The Railway men) టైటిల్ తో వస్తున్న ఈ సిరీస్ లో మాధవన్, దివ్యేందు, కేకే మీనన్, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాలుగు భాగాలుగా రానున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగినప్పుడు.. అక్కడి ప్రజలను కాపాడేందుకు రైల్వే ఉద్యోగులు సహాయం అందించారు, వందల మందిని కాపాడారు. వాటినే ఈ సిరీస్ లో చూపించబోతున్నామని దర్శకుడు శివ్ రావలి తెలిపారు.
ఇక ఇప్పటికే ఈ దుర్ఘటన జరిగినప్పటి పరిస్థితులను కళ్లముందుంచుతూ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. 1999లో ‘భోపాల్ ఎక్స్‌ప్రెస్’ అనే పేరుతో ఓ సినిమా విడుదలైంది. 1984లో జరిగిన భోపాల్ విపత్తు కారణంగా కొత్తగా పెళ్లైన జంట ఎన్ని ఇబ్బందులు పడింది? వారి జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయి? వాళ్లు ఎంత బాధ పడ్డారో చూపారు. ఆనందంగా ఉండాల్సిన వారి జీవితాలు ఈ దుర్ఘటన కారణంగా ఎలా మారిపోయాయో ఆ చిత్రంలో కళ్లకు కట్టారు. అలాగే ఆ ఘోరం జరిగిన 30 సంవత్సరాలకు అంటే 2014లో మరో సినిమా వచ్చింది. ‘భోపాల్- ఏ ప్రేయర్ ఫర్ రెయిన్’ పేరుతో ఇది రిలీజ్ అయింది. అప్పటి వరకు రిక్షా తొక్కుకునే యువకుడికి మంచి ఉద్యోగం వచ్చి జీవితం మారిపోయిందని కలలుకంటాడు. అయితే భోపాల్ దుర్ఘటన అతడి జీవితంలో ఎంతటి విషాదాన్ని నింపిందో ఈ చిత్రంలో చూపించారు.
ఇక ఈ రెండు చిత్రాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేశాయి. అయితే ఇవి ఇప్పటి వరకు ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేవు. దీంతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ దీనిపై వెబ్ సిరీస్‌ను తెరకెక్కించింది. ఆ సంస్థ నిర్మించిన తొలి వెబ్ సిరీస్ కావడం, 2014 తర్వాత ఇప్పటి వరకు దీనిపై సినిమాలు రాకపోవడంతో ఈ ‘ది రైల్వే మెన్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇందులో మాధవన్ (Madhavan), కేకే మేనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు.