లేటెస్ట్ గా రాబోతున్న ఎపిసోడ్‌లో ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా పాల్గొంటున్నారు. మంగళవారం రాత్రి చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది. `ఆహా`, అన్‌స్టాపబుల్ విత్‌ఎన్బీకే టీమ్. చిన్న గ్లింప్స్ ని విడుదల చేశారు.
తెలుగు టాక్ షోస్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే`(Unstoppablewithnbk2). సీజన్ 2 షో రన్ అవుతుంది. రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో సందడి చేస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో ప్రారంభమైన ఈషోలో ఇప్పటి వరకు మరో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డితోపాటు విశ్వక్ సేన్, సిద్దు జొన్నగడ్డ, అల్లు అరవింద్, సురేష్‌బాబు, కె.రాఘవేంద్రరావు వంటి వారు పాల్గొన్నారు.
లేటెస్ట్ రాబోతున్న ఎపిసోడ్‌లో ప్రభాస్(Prabhas), గోపీచంద్(Gopichand) పాల్గొంటున్నారు. ఆదివారం వీరిపై షూటింగ్ జరిగింది. మంగళవారం రాత్రి చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది. `ఆహా`, అన్‌స్టాపబుల్ విత్‌ఎన్బీకే టీమ్. చిన్న గ్లింప్స్ ని విడుదల చేశారు. ప్రభాస్ ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్ వైరల్ అవుతుంది. ఇందులో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాక్ షోకి వస్తున్నారని గ్రాండ్‌గా స్వాగతం పలికారు. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయేలా ఉండటం విశేషం. ప్రభాస్ ని చూసి ఆడియెన్స్ హోరెత్తించారు. ఫ్లైయింగ్ కిస్సులతో ఫిదా చేశారు. వారికి డార్లింగ్ కూడా ఫ్లయింగ్ కిస్సులివ్వడం విశేషం.
వచ్చాక బాలకృష్ణ(Balakrishna) కాస్త సరదాగా సన్నివేశాలు చేశారు. కళ్లజోడు పైకి ఎగరేశాడు. ఆ తర్వాత `ఏయ్.. ఏం చెప్తున్నావ్ డార్లింగ్` అని ప్రభాస్ నవ్వుతూ చెప్పడం నవ్వులు పూయించింది. మరోవైపు ప్రభాస్‌ని రమ్మని అనగా, డార్లింగ్ వద్దు సర్ అన్నట్టుగా దూరం వెళ్లిపోవడం ఆకట్టుకుంటుంది. మరోవైపు ఓకే సోఫాలో కూర్చొన్న గోపీచంద్‌కి ప్రభాస్ పెద్ద దెండం పెట్టి మీరు గొప్ప అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం మరింత ఆకట్టుకుంటుంది. ప్రస్తుతంఈ ప్రోమో గ్లింప్స్ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతుంది. ఇక ప్రోమో వస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ఈ శుక్రవారం ఈ షో స్ట్రీమింగ్ కానుందని చెప్పొచ్చు. ఇందులో పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట.

