Raj Tarun- Lavanya Case : రాజ్ తరుణ్, లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన హీరో
తెలుగు సినీ పరిశ్రమలో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ముంబైలో ఒక ఇంట్లో కలిసి ఉండగా లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
తెలుగు హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదటి నుంచి లావణ్య ఆరోపణలు చేస్తున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్‌ని ముంబైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
తెలుగు సినీ పరిశ్రమలో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ముంబైలో ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారని లావణ్యకు సమాచారం అందింది. ఈ సమాచారంతో, లావణ్య అక్కడికి వెళ్లి వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన తరువాత లావణ్య ఆగ్రహంతో మాల్వితో దూషణకు దిగింది. రాజ్ తనను మోసం చేసి, మాల్వితో సహజీవనం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది. "నాకు నా రాజ్‌ను అప్పగించాలి" అంటూ మాల్వితో గొడవకు దిగింది.ఇప్పటికే ఈ కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్‌లో రాజ్ తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. పోలీసులు దీనిపై మరిన్ని విచారణలు జరుపుతున్నారు. ఈ కేసు ఎలా పరిణమిస్తుందో చూడాలి.