బిగ్ బాస్ హౌస్ లో అండర్ వాటర్ యాక్షన్.. తేజతో శోభా శెట్టి ఫస్ట్ నైట్ రొమాన్స్
బిగ్ బాస్ సీజన్ 7లో గురువారం ఎపిసోడ్ యాక్షన్ రొమాన్స్ అన్నట్లుగా సాగింది. ఇంటి సభ్యులు గులాబీ పురం, జిలేబి పురం అనే రెండు ఊళ్ళుగా విడిపోయి గేమ్స్ ఆడారు.

బిగ్ బాస్ సీజన్ 7లో గురువారం ఎపిసోడ్ యాక్షన్ రొమాన్స్ అన్నట్లుగా సాగింది. ఇంటి సభ్యులు గులాబీ పురం, జిలేబి పురం అనే రెండు ఊళ్ళుగా విడిపోయి గేమ్స్ ఆడారు. ముందుగా గ్రహాంతర వాసులని సంతోష పరిచేందుకు..అండర్ వాటర్ లో బాక్స్ లో ఉన్న వారి వస్తువు ఇచ్చేందుకు ఇంటి సభ్యులు టాస్క్ లో పోటీ పడ్డారు.
ఈ టాస్క్ లో గులాబీ పురం నుంచి ఇద్దరు.. జిలేబి పురం నుంచి ఇద్దరు పాల్గొనాలి. గులాబీ పురం నుంచి అమర్, తేజ పాల్గొనగా.. జిలేబీ పురం నుంచి ప్రియాంక సందీప్ ఆడారు. స్విమ్మింగ్ పూల్ లోపల ఆ బాక్స్ ఉంటుంది. ఒక సభ్యుడు తన పార్ట్నర్ కి సరైన కీ వెతికి పూల్ లో ఉన్న పార్ట్నర్ కి ఇవ్వాలి. ఎవరు ముందుగా బాక్స్ ఓపెన్ చేసి ఆ వస్తువు సాధిస్తే వారే విజేత. ఈ టాస్క్ లో అండర్ వాటర్ యాక్షన్ అన్నట్లుగా సందీప్, అమర్ మధ్య ఫైట్ జరిగింది.
ఈ టాస్క్ లో చివరకి ఆ వస్తువుని సందీప్ సాధించి తన జిలేబి పురం జట్టుని విజేతలుగా నిలిపాడు. అలాగే మరో టాస్క్ కూడా జరిగింది ఈ టాస్క్ లో గులాబీ పురం వాళ్ళు విజేతలుగా నిలిచారు. గ్రహాంతర వాసుల మెషిన్ ని ఛార్జ్ చేసేందుకు వైర్లని సాకెట్స్ కి కనెక్ట్ చేయాలి. ఆ వైర్లు చిక్కు ముడులుగా ఉంటాయి. చిక్కు ముడులు విడదీసి ఏ కలర్ వైర్ ని ఆ కలర్ సాకెట్ లో పెట్టాలి.
ఈ టాస్క్ లో గులాబీ పురం నుంచి గౌతమ్.. జిలేబి పురం నుంచి ప్రశాంత్ పాల్గొన్నారు. ప్రశాంత్ కంటే గౌతమ్ ఎక్కువ వైర్లు కనెక్ట్ చేసి తన జట్టుకి విజయం అందించాడు. ఈ టాస్క్ లకు శివాజీ సంచాలకుడిగా వ్యవహరించాడు.
ఇదిలా ఉండగా హౌస్ లో చిన్న పాటి కామెడీ రొమాన్స్ కూడా జరిగింది. తమకి ఇచ్చిన క్యారెక్టర్స్ ప్రకారం తేజ, శోభా శెట్టి కపుల్ గా నటించారు. వీరిద్దరూ ఫన్నీగా ఫస్ట్ నైట్ సీన్ లో కూడా నటించారు.