భర్త చెంప చెల్లుమనిపించిన ఉదయ్‌ కిరణ్‌ హీరోయిన్‌ అనిత..వీడియో వైరల్‌

ఉదయ్‌ కిరణ్‌ హీరోయిన్‌ అనిత హసానందాని భర్త రోహిత్‌ రెడ్డి చెంప చెల్లుమనిపించింది. సరదాగా ఆడుకుంటూ గట్టిగా వాయించేసింది. దీంతో అనిత భర్త మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. 

uday kiran heroine anita slap her husband video viral  arj

ఉదయ్‌ కిరణ్‌ హీరోయిన్‌ అనిత హసానందాని భర్త రోహిత్‌ రెడ్డి చెంప చెల్లుమనిపించింది. సరదాగా ఆడుకుంటూ గట్టిగా వాయించేసింది. దీంతో అనిత భర్త మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. తెలుగులో `నువ్వు నేను`, `శ్రీరామ్‌`, `నేనున్నాను` వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన అనిత హసానందాని ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇటీవల పండండి మగబిడ్డకి జన్మనిచ్చిన అనిత భర్తతో సరదాగా గడుపుతోంది. 

జస్ట్ ఫ్రాంక్‌ అంటూ భర్త చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అనిత తన భర్తను కుర్చీలో కూర్చోబెట్టింది. అతడి వెనకాల నిలబడిన ఆమె తన చేతిలో ఓ దారాన్ని పట్టుకున్నట్లు నటించింది. దాన్ని అతడి చెవిలో నుంచి తీసినట్లు యాక్ట్‌ చేసింది. ఇంతలో ఫడేలుమని చెంప మీద ఒక్కటిచ్చింది. దీంతో షాకైన భర్త తనను ఏమీ అనలేక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. భార్యలకు ఈ మ్యాజిక్‌ ట్రిక్‌ తప్పకుండా నచ్చుతుందంటూ `ఈ ట్రిక్‌ను తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి` అని అనిత వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చింది.

దీనిపై ఆమె భర్త రోహిత్‌ ఫైర్‌ అయ్యాడు. తనను ఇలా ఇంత చేసిన భార్యను ఊరుకునేది లేదంటున్నాడు. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక అనిత తన భర్తను ఈ రకంగా ఆటపట్టించడం చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పాపం, రోహిత్‌ ముఖం మాడిపోయిందని అంటున్నారు. అతడు ఎలా రివేంజ్‌ తీసుకుంటాడా అని ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. అనిత 2013లో రోహిత్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios