ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత యష్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా ట్విట్టర్ లో షాకింగ్ ట్వీట్ లు చేశారు. 

''ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. నా పరిస్థితి బాగాలేదు.. ప్రయత్నిస్తున్నాను కానీ ఓడిపోతూనే ఉన్నాను. కొన్ని గంటల పాటు నా ట్విట్టర్ ను డీయాక్టివేట్ చేశాను. చావుకి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనిపిస్తోంది. త్వరలో శాశ్వతంగా వెళ్లిపోతాననిపిస్తుంది'' అంటూ ట్వీట్ చేశారు.

ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. అసలు ఉదయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. దయచేసి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఆయనకి సూచించడం మొదలుపెట్టారు. అయితే ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే ఉదయ్ దాన్ని డిలీట్ చేశారు.

కానీ అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీయడంతో అది కాస్త వైరల్ అయింది. 'ధూమ్‌', 'ధూమ్‌ 2', 'ప్యార్‌ ఇంపాజిబుల్‌' వంటి చిత్రాల్లో ఉదయ్‌ నటించారు. కానీ నటుడిగా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.ఈ మధ్యకాలంలో ఆయన బాగా లావై గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.