నాగ చైతన్య ఈ ఏడాది వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. వెంకీ మామ షూటింగ్ జరుగుతుండగానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో చైతు సోలో హీరోగా నటిస్తున్నాడు. 

నాగ చైతన్య కోసం రెడీగా మరో రెండు మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో బంగార్రాజు చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య కలసి నటించబోతున్నారు. ఇక ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వహించే మహాసముద్రం చిత్రం కూడా మల్టీస్టారర్ అని టాక్. 

ఈ చిత్రంలో మరో యంగ్ హీరో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో మహా సముద్రం చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మహా సముద్రం చిత్రం విషయంలో చాలా రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట ఈ చిత్రంలో రవితేజ నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ రవితేజ రిజెక్ట్ చేయడంతో ఈ కథ నాగ చైతన్య చేతుల్లోకి వెళ్లిందట.