Asianet News TeluguAsianet News Telugu

వేణు స్వామి, టీవీ5 మూర్తి వివాదం కొత్త మలుపు

ఈ ఆరోపణల మీద టీవీ5 మూర్తి రియాక్ట్ అయ్యాడు.  వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ 

TV5 Murthy Files Complaint On Venu Swamy jsp
Author
First Published Aug 21, 2024, 6:40 AM IST | Last Updated Aug 21, 2024, 6:40 AM IST


టీవీ5 మూర్తి ఇంకా కొందరు జర్నలిస్ట్‌ లు కలిసి తమను రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ సెలబ్రెటీ అస్ట్రాలజర్ వేణు స్వామి, ఆయన భార్య వీణలు సోషల్‌ మీడియా ద్వారా వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైరల్ అయిన ఆ వీడియోలో టీవీ 5 మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంత డబ్బు మా దగ్గర ఎందుకు ఉంటుందని.. వాళ్లు చేసే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే వీడియోలో కాల్‌ రికార్డింగ్‌ ను కూడా జోడించి టీవీ5 మూర్తితో పాటు ఇతర జర్నలిస్టులపై వారు ఆరోపణలు చేశారు. 

అయితే ఈ ఆరోపణల మీద టీవీ5 మూర్తి రియాక్ట్ అయ్యాడు.  వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ టీవీ లైవ్ షోలో ప్రకటించాడు. అంతే కాకుండా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి వేణు స్వామి,వీణలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసు ఫిర్యాదు చేశారు. తాను చేయని నేరాన్ని తనపై ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన నిజాయితీని కించపరచడంతో పాటు చిత్తశుద్దిని ప్రశ్నించే విధంగా వారు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే తాను బ్లాక్‌ మెయిల్‌ కి పాల్పడ్డట్లుగా వారు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే ఏ శిక్షకు అయినా సిద్దం అని, వారు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మూర్తి డిమాండ్‌ చేస్తున్నాడు. తాను ఎప్పుడు కూడా ఎవరిని బ్లాక్ మెయిల్‌ చేయలేదని, తనకు ఆ అవసరం లేదని మూర్తి చెప్పుకొచ్చాడు. గతంలో తాను ఆయన వికృత చేష్టలు, అబద్దపు జోతిష్యాల గురించి బయట పెట్టడం వల్లే ఇప్పుడు తన గురించి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మూర్తి చెప్పుకొచ్చాడు.

 ఇటీవల నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ తరువాత వేణు స్వామి వదిలిన వీడియో పెద్ద దుమారమే రేపింది. నాగ చైతన్య, శోభితల జాతకాన్ని విశ్లేషిస్తూ వేణు స్వామి షేర్ చేసిన వీడియో మీద చర్చలు జరిగాయి. ఈ విషయం మీద జర్నలిస్ట్ సంఘాలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వారు చేసిన ఫిర్యాదు మేరకు వేణు స్వామికి నోటీసులు కూడా వచ్చాయన్న సంగతి తెలిసిందే. అయితే వేణు స్వామి మీద ఇలా జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేయడం మీద అతని భార్య వీణా శ్రీవాణి మండి పడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios