విష్ణుప్రియను గట్టిగా దెబ్బతీసిన బిగ్ బాస్ షో, డబ్బు తప్ప దక్కింది ఏముంది?

విష్ణుప్రియకు బిగ్ బాస్ షోతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగినట్లు తెలుస్తుంది. ఈ విషయం బయటకు వచ్చాక అమ్మడుకి అర్థమైంది. 
 

vishnupriya not gets much appreciation from bigg boss show other than money ksr

బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది విష్ణుప్రియ. అయితే ఆశించిన స్థాయిలో రాణించలేదు. విష్ణుప్రియ కనీసం ఫైనల్ కి వెళ్లలేకపోయింది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విష్ణుప్రియ ప్రేమ వ్యవహారం హైలెట్ అయ్యింది. ఆమె ఆటను మరచి కంటెస్టెంట్ పృథ్వితో రొమాన్స్ చేసింది. 

విష్ణుప్రియ 14 వారాలు హౌస్లో ఉండటమే ఎక్కువ. ఆమె గేమ్ అంత దారుణంగా ఉంది.హోస్ట్ నాగార్జున ఆమెను హెచ్చరించారు కూడాను. నువ్వు గేమ్ ని సీరియస్ గా తీసుకోకపోతే.. ఆడియన్స్ కూడా నిన్ను సీరియస్ గా తీసుకోరని చెప్పాడు.ఫ్యామిలీ వీక్ లో హౌస్లోకి వచ్చిన విష్ణుప్రియ ఫాదర్ సైతం హింట్ ఇచ్చాడు. పృథ్వితో నీ రిలేషన్ తప్పుగా ప్రొజెక్ట్ అవుతుందని తెలియజేశాడు. అయినప్పటికీ విష్ణుప్రియ తీరులో మార్పు రాలేదు. 

విష్ణుప్రియ తెలుగు బిగ్ బాస్ టైటిల్ కొట్టిన ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ అవుతుందని భావించారు. విష్ణుప్రియ ఏ మాత్రం పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఆమె టైటిల్ రేసులో ఉండేది. టైటిల్ కొట్టడం అటుంచితే ఫైనల్ లో అడుగుపెట్టలేకపోవడం అనూహ్య పరిణామం. సోషల్ మీడియా స్టార్ నబీల్ టాప్ 3లో నిలవడం, విష్ణుప్రియకు చెంప పెట్టు.  కాగా బిగ్ బాస్ హౌస్లో తన పెర్ఫార్మన్స్ పై విష్ణుప్రియ ఓపెన్ అయ్యింది. ''కొందరు నన్ను అభిమానించారు. మరికొందరు ద్వేషించారు. హౌస్లో నేను నాలానే ఉన్నాను. గతంలో నేను కోటి రూపాయలు ఇచ్చినా బిగ్ బాస్ షోకి వెళ్ళను అన్నాను. ఆ కామెంట్స్ ఆధారంగా ట్రోల్ చేశారు. 

నాకు సీజన్ 3 నుండి బిగ్ బాస్ ఆఫర్స్ వచ్చాయి. నాకు కోపం, ఇగో ఎక్కువ. నన్ను నేను ఎంత వరకు కంట్రోల్ చేసుకోగలను అని తెలుసుకోవాలని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాను. రెండేళ్లుగా ఆధ్యాత్మిక చింతన మొదలైంది. నా గురువు సలహా మేరకు షోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ వెళ్ళాక వేరే విధంగా అయ్యింది. కొన్ని సందర్భాల్లో నేను కంట్రోల్ తప్పాను. పీరియడ్స్ వలన చోటు చూసుకునే హార్మోన్స్ ఇన్ బ్యాలన్స్ కూడా దీనికి కారణం'', అని విష్ణుప్రియ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

పృథ్విపై ఎనలేని ప్రేమ కనబరిచిన విష్ణుప్రియ అతడు ఎలిమినేటై బయటకు వెళుతుంటే పెద్దగా స్పందించలేదు. అతడు దూరం అవుతున్నాడన్న బాధ ఆమెలో కనిపించలేదు. బయటకు వచ్చాక కూడా వారిద్దరూ కలవలేదు. కాబట్టి పృథ్వి పై విష్ణుప్రియ చూపించింది ఫేక్ లవ్, ఫేక్ ఎమోషన్స్ అని తేలిపోయింది. హౌస్లో సర్వైవ్ కావడానికి ఆ యాంగిల్ వాడుకుందనే సందేహం కలుగుతుంది. 

ఇకపోతే బిగ్ బాస్ షో వలన విష్ణుప్రియకు కొత్తగా ఒరిగింది ఏమీ లేదు. పైగా కొంత మేర డ్యామేజ్ జరిగింది. విష్ణుప్రియలో అంత పరిపక్వత లేదని తేలిపోయింది. కెమెరాల ముందు ఓపెన్ గా పృథ్వితో రొమాన్స్ చేయడం, ముద్దులు, హగ్గులతో హద్దులు మీరడం ప్రేక్షకులకు నచ్చలేదు. కేవలం స్టార్ మా సప్పోర్ట్ కారణంగానే విష్ణుప్రియ అన్ని వారాలు హౌస్లో ఉందనే వాదన కూడా ఉంది. ఒకటి మాత్రం నిజం బిగ్ బాస్ షో కొందరికి మేలు చేస్తే.. మరికొందరికి కీడు చేస్తుంది. పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ వంటి సోషల్ మీడియా స్టార్స్ బుల్లితెర మీద బిజీ అయ్యారు. వారి ఇమేజ్, పాపులారిటీ రెట్టింపు అయ్యింది. ఆల్రెడీ ఇమేజ్, క్రేజ్ ఉన్న విష్ణుప్రియ లాంటి కంటెస్టెంట్స్ నష్టపోతున్నారు. 

బిగ్ బాస్ హౌస్ నుండి పాజిటివ్ ఇమేజ్ తో బయటకు రావడం కష్టం. నటిగా అడపాదడపా ఆఫర్స్ వస్తున్న సమయంలో విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ బాట పట్టింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర చేసిన దయ వెబ్ సిరీస్లో విష్ణుప్రియకి కీలకమైన ఫుల్ లెన్త్ రోల్ దక్కింది. జర్నలిస్ట్ పాత్రలో విష్ణుప్రియ ఆకట్టుకుంది. దయ 2 కూడా ప్రకటించారు. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఇమేజ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ షోతో విష్ణుప్రియ గట్టిగా ఆర్జించింది. టైటిల్ విన్నర్ కంటే ఎక్కువ మొత్తంలో ఆమె రాబట్టారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి గాను విష్ణుప్రియ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆమె వారానికి రూ. 4 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందట. ఆ లెక్కన 14 వారాలకు రూ. 56 లక్షలు వసూలు చేసిందట. ఇది విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ కావడం విశేషం. ప్రైజ్ మనీతో భారీగా కోతలు ఉంటాయి. పనులన్నీ చెల్లించగా విన్నర్ కి గెలుచుకున్న ప్రైజ్ మనీలో కొంచెం అటు ఇటుగా సగం చెల్లిస్తారు. రెమ్యునరేషన్ లో ఆ స్థాయిలో పన్నుల కోతలు ఉండవు. కాబట్టి టైటిల్ విన్నర్ నిఖిల్ తో సమానంగా విష్ణుప్రియకు డబ్బుల పరంగా ప్రయోజనం చేకూరింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios