Asianet News TeluguAsianet News Telugu

అమర్ దీప్ పై ట్రోలింగ్.. మనుషులేనా మీరు, సిగ్గుండాలి.. కన్నీళ్లు తెప్పించే వీడియో ప్రూఫ్ బయటపెట్టిన నటుడు

అమర్ దీప్ నుంచి సాయం పొందిన గౌతమ్, రతికాలే ఎలా వెన్నుపోటు పొడిచారో నరేష్ వీడియో ప్రూఫ్ తో సహా బయట పెట్టాడు. 

TV Actor Naresh Lolla gives counter to trolling on Bigg Boss 7 Amardeep dtr
Author
First Published Nov 19, 2023, 7:38 AM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. అందుకు ఉదాహరణ శుక్రవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్. కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్ ఎమోషనల్ బరస్ట్ అయ్యాడు. అరిచాడు.. కన్నీళ్లు పెట్టుకున్నాడు.. వేడుకున్నాడు. కానీ విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయాడు. దీనితో ప్రియాంక విజయం సాధించి కెప్టెన్ గా నిలిచింది. 

అయితే అమర్ దీప్ టాస్క్ ఆడుతున్న సమయంలో ఎమోషనల్ కావడం గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నిజంగానే అమర్ దీప్ ఎమోషనల్ అయ్యాడు అని మరికొందరు లేదు అది ఫేక్ స్ట్రాటజీ అని ట్రోల్ చేస్తున్నారు. అమర్ దీప్ ఏడుస్తూ కేకలు పెడుతున్న దృశ్యాలపై నెటిజన్లు కొందరు మీమ్స్ చేస్తూ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. 

అయితే జానకి కలగనలేదు టీవీ సీరియల్ లో అమర్ దీప్ కో యాక్టర్, బెస్ట్ ఫ్రెండ్ నరేష్ లొల్లా ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అతడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం అమర్ దీప్ మద్దతుదారులకు కన్నీరు తెప్పించేలా ఉంది. ;మనుషులేనా మీరు, సిగ్గుండాలి.. ఎమోషన్స్ ని  ట్రోల్ చేయడం ఏంట్రా.. ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో తాను గేమ్ ఆడుతుంటే.. ఎవరైతే తన వల్ల లాభం పొందారో, సాయం పొందారో వాళ్లే తనని టార్గెట్ చేస్తుంటే వచ్చిన ఎమోషన్ అది అంటూ నరేష్ ఫైర్ అయ్యాడు. 

తన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా టార్గెట్ చేస్తుంటే.. రిక్వస్ట్ చేసినా వదలకపోతే వచ్చిన ఎమోషన్ అది అంటూ నరేష్ తన ఫ్రెండ్ గురించి చెప్పాడు. తన స్నేహితుల వల్లే విజయానికి ఒక్క అడుగుదూరంలో నిలిచిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అమర్ దీప్ ని చూస్తే అర్థం అవుతుంది.

ఒక్కొక్కరు తమ ఎమోషన్స్ ని ఒక్కోలా బయట పెడతారు. దాని గురించి కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. దయచేసి డ్రామా, ఓవర్ యాక్టింగ్ అంటూ ట్రోల్ చేయకండి అని నరేష్ రిక్వస్ట్ చేశాడు. అంతే కాదు అమర్ దీప్ నుంచి సాయం పొందిన గౌతమ్, రతికాలే ఎలా వెన్నుపోటు పొడిచారో నరేష్ వీడియో ప్రూఫ్ తో సహా బయట పెట్టాడు. 

ఆ వీడియో చూస్తుంటే అమర్ దీప్ మద్దతుదారులు కన్నీరు పెట్టుకునేలా ఉంది. బేబీ కేర్ టాస్క్ లో రతిక వచ్చి ఈ టాస్క్ నాకు చాలా కీలకం అని అడుక్కుంటే ఆమె కోసం అమర్ త్యాగం చేశాడు. అలాగే కాయిన్స్ టాస్క్ లో గౌతమ్ కి అమర్ సపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లిద్దరే ప్రధానంగా కెప్టెన్సీ టాస్క్ లో అమర్ దీప్ ని టార్గెట్ చేసి ఓడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios