ఈ వారం నో ఎలిమినేషన్.. భోలేకి అన్యాయం చేసి శోభాశెట్టిని సేవ్ చేస్తారా? `బిగ్ బాస్`పై ట్రోల్స్
ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ ఓ లీకేజ్ వార్త బయటకొచ్చింది. దీంతో నెటిజన్లు బిగ్ బాస్‌ని ట్రోల్ చేస్తున్నారు. శోభాని సేవ్ చేస్తూ భోలేకి అన్యాయం చేశారంటున్నారు. రచ్చ రచ్చ అవుతుంది.

బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇతర టీవీ షోస్‌ని దాటి దీనికి రేటింగ్ ఎక్కువగా వస్తుండటం విశేషం. ఉల్టాఫుల్టా అన్నట్టుగానే షోని నిర్వహిస్తున్నారు నిర్వహకులు. సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఎలిమినేషన్ విషయంలో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా అనిపించింది. అయితే గత రెండు మూడు వారాలుగా ఎలిమినేషన్ విషయంలో ఆడియెన్స్ నుంచి అసంతృప్తి ఎదురవుతుంది. టేస్టీ తేజ, భోలే ఎలిమినేషన్‌ని చాలా మంది వ్యతిరేకించారు. ఇది పెయిర్ గేమ్ కాదని అంటున్నారు. హౌజ్‌లో రెండు ఫేస్‌లతో, ఓవర్ యాక్టింగ్ చేస్తున్న వారిని సేవ్ చేసి ఎంటర్‌టైన్ చేస్తున్న వారిని హౌజ్ నుంచి పంపించారనే కామెంట్లు వచ్చాయి.
గత వారం దీపావళి పండగ సందర్భంగా భోలేని పంపించడంపై కూడా ఇదే వ్యతిరేకత వచ్చింది. బిగ్ బాస్‌ని ట్రోల్ చేశారు. హౌజ్‌లో తనదైన పాటలతో అలరిస్తున్న ఆయన్ని ఎలిమినేట్ చేయడం సరికాదన్నారు. రతిక, శోభా శెట్టి వంటి వారిని కాకుండా వీరిని ఎలిమినేట్ చేయడం పట్ల ఆడియెన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వారం (పదకొండో వారం)లో ఎలిమినేషన్ లేదని తెలుస్తుంది. ఈ వారం అందరిని సేవ్ చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓ లీకేజీ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వారం నామినేషన్‌లో అమర్ దీప్, ప్రియాంక, యావర్, రతిక, గౌతమ్, అర్జున్, అశ్విని, శోభా శెట్టి ఉన్నారు. ఇందులో యావర్ ఫ్రీ ఎవిక్షన్ పాస్ పొందాడు. ఓటింగ్ పరంగా మిగిలిన వారితో పోల్చితే అశ్విని, శోభా శెట్టి లకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈ వారం ఈ ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే వార్తలొచ్చాయి. కానీ పెద్ద ట్విస్ట్ ఇస్తూ, అసలు ఈ వారం ఎలిమినేషన్ లేదని తెలుస్తుంది. అయితే పండగ వేళ ఇలాంటి ఎలిమినేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుంటారు. ఎలిమినేట్ అయిన వారిని కూడా సేవ్ చేస్తారు.. కానీ దీపావళి సందర్బంగా భోలేని ఎలిమినేట్ చేశారు. ఏమీ లేని ఈ వారం మాత్రం ఎలిమినేషన్ నుంచి రిలీఫ్ ఇవ్వడం షాకిస్తుంది.
దీనిపై బిగ్ బాస్‌పై ట్రోల్స్ ఊపందుకుంటున్నారు. బిగ్ బాస్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఈ వారం లీస్ట్ లో ఉన్న శోభా శెట్టి ఎలిమినేట్ కావాల్సి ఉందని, కానీ ఆమెని సేవ్ చేయడం కోసం నో ఎలిమినేషన్ తీసుకొచ్చారని, ఇది చాలా అన్ ఫెయిర్ గేమ్ అని అంటున్నారు నెటిజన్లు. ఇది చాలా అన్యాయమంటున్నారు. ఈ వారం సేవ్ చేసి అందరి చేత క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ చూపిస్తారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. నానా రకాలుగా కామెంట్లతో ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా, నిజంగానే ఈ వారం ఎలిమినేషన్ ఉండబోదా? అనేది ఆదివారంతో తేలనుంది.