Asianet News TeluguAsianet News Telugu

కార్తీక దీపం మళ్లీ వస్తోంది..!

ఆ సీరియల్ లో నటించిన పాత్రలను చూస్తే.. వారి అసలు పేర్ల కంటే.. సీరియల్ లోని క్యారెక్టర్ల పేర్లతోనే పిలుస్తారు. దీప, కార్తీక్, డాక్టర్ బాబు, మోనిత, హిమ, శౌర్య.. ఈ పేర్లే వినపడతాయి.
 

New Promo Of Karthika Deepam is out ram
Author
First Published Feb 19, 2024, 4:33 PM IST

తెలుగులో ఇప్పటి వరకు చాలా టీవీ సీరియల్స్ వచ్చాయి. ఇప్పటికీ చాలా వస్తున్నాయి. అయితే.. అన్ని సీరియల్స్ లో కెల్లా.. జనాల చేత నీరాజనాలు అందుకున్న సీరియల్స్ మాత్రం చాలా తక్కువ అనే చెప్పొచ్చు. అలాంటి వాటిలో కార్తీక దీపం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సీరియల్ అయిపోయి దాదాపు రెండు సంవత్సరాలు దాటినా.. ఆ సీరియల్ సృష్టించిన మాయలోనుంచి ఇంకా ఫ్యాన్స్ బయటకు రాలేదనే చెప్పాలి. అంతలా ఆ సీరియల్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సీరియల్ లోని పాత్రలను చాలా ఓన్ చేసుకున్నారు. ఆ సీరియల్ లో నటించిన పాత్రలను చూస్తే.. వారి అసలు పేర్ల కంటే.. సీరియల్ లోని క్యారెక్టర్ల పేర్లతోనే పిలుస్తారు. దీప, కార్తీక్, డాక్టర్ బాబు, మోనిత, హిమ, శౌర్య.. ఈ పేర్లే వినపడతాయి.

అయితే.. ఈ సీరియల్ ని చివరి వరకు జనాలు బాగా ఆదరించారు. ఈ సిరియల్ అయిపోవడం చాలా మందికి బాధ కలిగించింది. అందుకే... ఇప్పుడు మరోసారి ఈ కార్తీకదీపం కావ్యం అలరించడానికి రెడీ అవుతోంది. కార్తీకదీపం పేరుతోనే మళ్లీ వస్తుండటం విశేషం.

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమోలో ఓ చిన్న పాప కనపడుతుంది.  పాప చదువుకుంటూ ఉంటే కరెంట్ పోతుంది. అగ్గిపెట్టెతో దీపం వెలిగిస్తుంది. ఆ దీపం ఆరిపోబోతుంటే వాళ్ల అమ్మ చేతులతో గాలి రాకుండా అడ్డుపెడుతుంది.  ఈ చీకటిలో నాకు ధైర్యం ఇచ్చే వెలుగు మా అమ్మ. కష్టాల నుంచి కాపాడే మా నాన్న మాతో లేడు. కానీ అమ్మ అయినా, నాన్న అయినా నాకు మా అమ్మే. ఇంతకీ  నా పేరు  చెప్పలేదు కదా శౌర్య , నేను ఇప్పుడు చెప్పబోయేది మా అమ్మనాన్నల కథ అంటూ ప్రోమో విడుదల చేశారు. కార్తీక దీపం నవవంసతం అని చెప్పారు.

మరి కార్తీక దీపం అంటేనే అందరికీ దీప క్యారెక్టర్ లో కనిపించిన ప్రేమి విశ్వనాథ్ గుర్తుకు వస్తుంది. ఇక డాక్టర్ బాబు కార్తీక్ అంటే నిరుపమ్, విలన్ మోనిత పాత్రలో శోభా శెట్టి నే కనిపించేవారు. మరి.. వారితోనే ఈ సీరియల్ కూడా తీస్తారో లేక.. కొత్త క్యారెక్టర్లతో తీస్తారో చూడాలి. కొత్త క్యారెక్టర్లు అయితే.. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios