Loki Season 2: లోకి సీజన్ 2... ఆకతాయి దేవుడు వచ్చేశాడు! ఎక్కడ చూడొచ్చు!
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన లోకి పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టామ్ హిడిల్‌స్టన్ లోకి పాత్ర చేశారు. ఆయన మెయిన్ లీడ్ లో రూపొందిన లోకి సీజన్ 2 స్ట్రీమ్ అవుతుంది.

2011లో విడుదలైన థోర్ సూపర్ హిట్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా థోర్ తెరకెక్కింది. క్రిస్ హెమ్స్వర్త్ హీరోగా నటించారు. థోర్ కి ప్రతినాయకుడు లోకి పాత్రలో టామ్ హిగిల్స్టన్ అలరించారు. లోకి పాత్ర ప్రధానంగా అదే పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా లోకి సీజన్ 1 స్ట్రీమ్ అవుతుంది. లోకి ఫస్ట్ సీజన్ భారీ ఆదరణ దక్కించుకున్న నేపథ్యంలో సీజన్ 2 రూపొందించారు.
లోకి సీజన్ 2 అక్టోబర్ 6న స్ట్రీమ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. నవంబర్ 9 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. సీజన్ 2 మొత్తం 6 ఎపిసోడ్ గా ప్రసారం అవుతుంది. సోఫియా డి మార్టినో, వున్మీ మోసకు, యూజీన్ కోర్డెరో, రాఫెల్ కాసల్ వంటి నటులు కీలక రోల్స్ చేశారు. జస్టిన్ బెన్సన్, ఆరన్ మూర్ హెడ్ దర్శకత్వ విభాగాన్ని లీడ్ చేశారు.
'గతానికి వర్తమానానికి మధ్య నేను కొట్టుమిట్టాడుతున్నాను' అని ట్రైలర్ లో లోకి చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. హ్యూమర్, యాక్షన్ కలగలిపి విజువల్ వండర్ గా రూపొందించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చందాదారులు లోకి సీజన్ 2 నేటి నుండి ఎంజాయ్ చేయవచ్చు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఇష్టపడే వాళ్లకు లోకి సీజన్ 2 ట్రీట్ అని చెప్పాలి.
లోకి సీజన్ 2 తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన చందాదారులు, మార్కెట్ పెరుగుతుందని భావిస్తుంది. ఇటీవల హాట్ స్టార్ ఇండియా అమ్మేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను హాట్ స్టార్ ఇండియా ప్రతినిధులు ఖండించారు. ఇండియాలో అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగిన ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా హాట్ స్టార్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ నుండి తీవ్ర పోటీ నెలకొంది.