కార్తీకదీపం 2 సీరియల్ (karthika deepam 2) అక్టోబర్ 11 ఎపిసోడ్లో కార్తీక్ వైరాకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. రాజీనామా చేయమని శివన్నారాయణ జ్యోత్స్నను అడుగుతాడు. సుమిత్ర కూడా అదే అంటుంది. ఇక ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో తెలుసుకోండి. 

కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ తో వైరా గొడవ పడుతూ కనిపిస్తాడు. దశరథకు తనకి గొడవ ఉందని మధ్యలో అడ్డు రావద్దని కార్తీక్ తో అంటాడు వైరా. అలా అడ్డొస్తే ఏదైనా జరగవచ్చని, నీ కుటుంబం ఎఫెక్ట్ అవ్వకూడదని అంటాడు. అది విన్న కార్తిక్ వైరాకు తిరిగి రివర్స్ వార్నింగ్ ఇస్తాడు. ‘ఊరిలో ముందుగా పోతురాజు విగ్రహం పెడతారు. దానికి అర్థం ఏంటో తెలుసా? ఊరు జోలికి రాకూడదని. నా కుటుంబానికి నేనే పోతురాజును. నా కూతురికి జోలికి వస్తే కత్తితో నరికేస్తాను. నేను కారును నడుపుతాను.. కంపెనీని నడుపుతాను. అవసరమైతే రెండింటినీ రిపేర్ చేస్తాను’ అని అంటాడు.

వైరాకు గట్టి వార్నింగ్

వేలంలో తాను నష్టపోవడానికి కారణం నువ్వే అని తెలిసిందని వైరా.. కార్తీక్ తో అంటాడు. దానికి కార్తీక్ ‘ట్రాన్స్ ఫార్మర్ డేంజర్ అని బోర్డు రాసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నావు. నీకు తెలియకుండానే నాతో ఆట మొదలు పెట్టావు. ఈసారి డబ్బు నష్టం ఉండకపోవచ్చు. నేను రూల్స్ ఫాలో కాను. ఆ రూల్స్ ని రాస్తాను’ అంటూ వార్నింగ్ ఇస్తాడు. కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే వైరా ‘ఎవరినీ వదిలిపెట్టను’ అని అరుస్తాడు.

కాశీ, దాసు మాట్లాడుకుంటూ ఉంటారు. కాశీ తన బాధను దాసుతో చెప్పుకుంటాడు. ఇంట్లో నాకు విలువ లేదు.. భార్యా మావయ్య ఎలాంటి విలువ ఇవ్వరు. జీతం రాకపోయేసరికి జీవితం లేకుండా పోయింది. నువ్వేనా అర్థం చేసుకుంటావనుకున్నా.. నువ్వు కూడా అలాగే తయారయ్యావ్ అని అంటాడు. కాశీ దానికి ‘కోపం మనుషుల మీద కాదు... జాబ్ మీద చూపించు’ అని చెబుతాడు. కోపంలో కాశీ ‘నువ్వు కూడా చేతకాని తండ్రివే’ అని దాసుతో అంటాడు. వెంటనే దాసుకు కోపం వచ్చి కొట్టేందుకు చేయి ఎత్తుతాడు. మధ్యలో శ్రీధర్ వచ్చి ఆపుతాడు.

‘దాసు చాలా మంచోడు. అలాంటి వాడికే నువ్వు కోపం తెప్పించావంటే నీ మాటలు ఎంతో బాధ పెట్టి ఉంటాయి. నా కోసం ఏం చేసావు నాన్న అని అడుగుతున్నావు కదా.. అలా ఎప్పుడూ అడక్కు. నీకు రేపు కొడుకు పుట్టాక వాడు కూడా ఇలాగే అడిగితే కానీ ఆ బాధ నీకు అర్థం కాదు’ అని అంటాడు శ్రీధర్.

ఇక జ్యోత్స్న, శివన్నారాయణ దగ్గరికి సీన్ మారిపోతుంది. శివన్నారాయణ మాట్లాడుతూ నిన్ను సీఈవోగా వద్దంటే అంతకన్నా పరువు పోయేది లేదు. నువ్వు సీఈఓగా రాజీనామా చేయు అని అంటాడు శివన్నారాయణ. కంపెనీ అన్నాక నష్టాలు రావా? మీరు చేసినప్పుడు కార్తీక్ చేసినప్పుడు రాలేదా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. దానికి శివన్నారాయణ నష్టాలు వచ్చాయి.. కానీ గ్రాఫ్ ఇంతగా పడిపోలేదు. నీ మీద బోర్డు మెంబర్స్ కి కూడా నమ్మకం పోయింది అని దశరథ అంటాడు.

వెంటనే జ్యోత్స్న ‘మీరు వైరాన్ని చూసి భయపడిపోతున్నారు’ అంటుంది. దానికి శివన్నారాయణ ఒప్పుకోడు. వెంటనే దశరథతో మీకు కూతురు కన్నా మేనల్లుడు ఎక్కువ. కార్తీక్ చేసే పనులు గొప్పగా కనిపిస్తాయి అని అంటుంది జ్యోత్స్న. అప్పుడు దశరథ్ అవునని అంటాడు. పగ సాధించేందుకే వైరా కంపెనీలోకి వద్దామని ప్రయత్నించాడని... అప్పుడు నువ్వు ఏం చేసావో, కార్తీక్ ఏం చేసాడో చెబుతాడు. వెంటనే నువ్వు సీఈఓ పదవికి రాజీనామా చేయు అని చెబుతాడు.

ఆరాలు తీస్తున్న శ్రీధర్

శ్రీధర్.. శివన్నారాయణతో మాట్లాడుతూ కార్తీక్ మన ఇంట్లో డ్రైవర్ గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఊహించనిది ఏదో జరగబోతోంది అంటాడు. శ్రీధర్ మరోవైపు దాసుతో మాట్లాడుతూ నీ కూతురు పురిట్లోనే చనిపోయింది కదా... అసలు ఎలా చనిపోయింది అని అడుగుతాడు. దానికి దాసు తెలియదని చెబుతాడు. తాను హాస్పిటల్ కి వెళ్లేసరికి బిడ్డ చనిపోయినట్లు తెలిసిందని అంటాడు. నా కొడుకు ఇల్లు దాటి వెళ్లడం లేదు.. ఎందుకు వెళ్లట్లేదు? నేనే కనుక్కుంటాను.. మీకు ఏమైనా తెలిస్తే చెప్పు అని శ్రీధర్ అంటాడు. దాసు మనసులో బావకు అనుమానం మొదలైపోయింది, నిజం తెలుసుకునేలా ఉన్నాడు అని అనుకుంటాడు.

వైరాకు భయపడుతున్న శివన్నారాయణ

ఇక శివన్నారాయణ కార్తీక్ తో మాట్లాడుతూ నేను ఎప్పుడైనా భయపడడం చూసావా అని ప్రశ్నిస్తాడు. నాలో భయాన్ని మొదటిసారి నేను చూశాను.. మన శత్రువు మన కన్నా బలంగా మారి తల తీసుకెళ్తానంటే.. తీసుకెళ్లమంటా కానీ ఓటమి మాత్రం ఒప్పుకోలేను. వైరా పది తలల రావణుడు. అతనితో యుద్ధం చేసేందుకు నా పక్కన దేవుడు లేడు. ధైర్యం మాత్రమే ఉంది. ఆ ధైర్యం నువ్వే. నన్ను గెలిపిస్తావా? అని అడుగుతాడు.

దానికి కార్తీక్ ‘ఏ హక్కుతో గెలిపించాలి’ అని అడుగుతాడు. ఏ హక్కు ఉందని వైరా నుంచి మన కంపెనీ షేర్స్ ని కాపాడావ్.. నేను వయసులో ఉన్నప్పుడు ఈ పోటీ నాకు బాగుండేది. ఇప్పుడు బరువులు మోయలేను. కత్తి మనిషి రూపంలో మారితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. నీలా ఉండాలి. అలాంటి వ్యక్తి నాకు కావాలి అని చెబుతాడు. ఈలోపు ఎపిసోడ్ ముగిసిపోతుంది