Asianet News TeluguAsianet News Telugu

Guppednatha Manasu serial Today:భార్యను వెంటనే కాపాడుకున్నావ్..తల్లిని మాత్రం వదిలేశావ్ రిషిపై అనుపమ ప్రశ్నల

నిజంగా ఎంఎస్ఆర్ ఈ పని చేశాడా? అతనికి అంత తెలివి ఉండదని, ఇంత ప్లాన్ చేస్తాడని అనుకోవడం లేదని  ఇంకెవరైనా ఈ పని చేసి ఉండొచ్చని అనుమానంగా ఉందని వసు అంటుంది. రిషి కూడా ఎంఎస్ఆర్ ని పట్టుకుంటే, అసలు విషయం తెలుస్తుందంటాడు. వాడు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు వసుధారా అంటాడు.
 

Guppednatha Manasu serial Today:29th November 2023 Mahindra feels Greatful ram
Author
First Published Nov 29, 2023, 8:26 AM IST


Guppednatha Manasu serial Today:వసుపై పడిన నిందను రిషి చెరిపేస్తాడు. ప్రమాదంలో ఉన్న చిత్రను కూడా కాపాడేస్తారు. తర్వాత చిత్రకు తామున్నాం అనే ధైర్యం చెబుతారు. తర్వాత సీన్ లో రిషి, వసులు కాలేజీలో ఓ చోట కూర్చుకుంటారు. వసు ఏడుస్తూ ఉంటుంది. రిషి ఓదారుస్తూ ఉంటాడు. సమస్య తీరింది కదా ఇంకా ఎందుకు కన్నీళ్లు అని రిషి అంటే, వసు ఎమోషనల్ గా రిషి చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దుపెడుతుంది. దీంతో రిషి.. స్పెషల్ థ్యాంక్సా అని అంటాడు. వసు అవునని సమాధానం చెప్పి,  ఈ రోజు తనకు చాలా రిలీఫ్ గా ఉందని చెబుతుంది. అసలు ఆ సమయంలో మీరు అంత కూల్ గా ఎలా ఉండగలిగారు అని వసు రిషిని అడుగుతుంది. తనకు అయితే చాలా కంగారుగా అనిపించందని చెబుతుంది.

Guppednatha Manasu serial Today:29th November 2023 Mahindra feels Greatful ram

‘నా వళ్ల చిత్ర సూసైడ్ చేసుకుందని వాళ్లు చెప్పారు. సూసైడ్ నోట్ కూడా చూపించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ నాకు వ్యతిరేకంగా ఉండటం, ఇదంతా చూస్తుంటే ప్రాణం పోయినట్లే అనిపించింది. ప్రెస్ వాళ్లు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు  ఉన్నా వారు నమ్మడం లేదు. ఎవరో వాళ్లవైపు పక్కాగా ఆధారాలు క్రియేట్ చేసుకొని నన్ను ఇరికించారనే విషయం అర్థమైంది. హాస్పిటల్ లో అనుమప మేడమ్ అడిగిన ప్రశ్నలకు తలకొట్టేసినట్లు అయ్యింది. ఆ సమయంలో నా గుండె దడదడలాడిపోయింది. చాలా భయం వేసింది సర్’అని వసు అంటుంది. కానీ, రిషి మాత్రం‘ నీకు భయం వేసిందా? యూత్ ఐకాన్, బ్రాండ్ ఆఫ్ పొగరు నీకు భయం వేసిందా’ అంటాడు. దానికి వసు అలుగుతుంది. కోపమా అని రిషి అంటే, అలిగాను అని వసు బదులిస్తుంది. ‘ఎంత యూత్ ఐకాన్, బ్రాండ్ ఆఫ్ పొగరు అయినంత మాత్రాన  నేను కూడా మామూలు ఆడపిల్లలనే కదా సర్, ఒక అమ్మాయి నా వల్ల ప్రాణాలు తీసుకోపోయింది అనే నింద నా మీద పడింది. ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేనే నేరస్తురాలిని అని పోలీసులు నన్ను స్టేషన్ కి తీసుకువెళ్తుంటే, నువ్వు భయపడకు వసుధార, నీ వెనక నేను వస్తాను అని మీరు చెప్పారు. మీ మాట విన్నాక, మీ ముఖంలో నిబ్బరం చూశాకా నాకు అప్పుడు వచ్చింది కొండంత థైర్యం థాంక్యూ సర్’అని వసు అంటుంది.

‘అయితే ఈ విషయంలో మనం అనుపమ గారికి థాంక్స్ చెప్పాలి. ఆవిడ నీకు బెయిల్ ఇప్పించడం వల్లే, తర్వాత కేసులో అడుగులు ఎటు వేయాలి? నేరస్తులను ఎలా పట్టుకోవాలి అనే ఆలోచన వచ్చింది. అందుకే ఆ నేరస్తులను పట్టుకోగలిగాను. అయినా నీకు భయం ఎందుకు  వసుధార? నేను ఉండగా నిన్ను ఎవరూ అవమానించలేరు. అనుమానించలేరు. నిన్ను ఎవరు టచ్ చేయాలి అన్నా.. ముందు నన్ను దాటి నీ దాకా రావాలి. చూడు వసుధార నాకు నువ్వు, నీకు నేను  తోడుగా ఉండాలి. ఈ రిషేంద్ర భూషణ్ నీకు సర్వస్వానికి కాపాల’ అని అంటాడు. దానికి వసు అలా అనకండి సర్.. మీరు నా జెంటిల్మెన్ అంటుంది.

అనుపమ కారులో వెళ్తూ ఉంటే, మహేంద్ర ఫోన్ చేస్తాడు. ఇంటికి రమ్మని కూడా పిలుస్తాడు. దీంతో, ఎందుకు పిలిచాడా అని ఒక సెకన్ ఆలోచించిన అనుపమ వెళ్లడానికే నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు రిషి, వసులు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో  వసు తెగ ఆలోచనలో ఉంటుంది. వాసవ్ చెప్పిన ఎంఎస్ఆర్ పేరు గురించి ఆమె ఆలోచిస్తుంది. నిజంగా ఎంఎస్ఆర్ ఈ పని చేశాడా? అతనికి అంత తెలివి ఉండదని, ఇంత ప్లాన్ చేస్తాడని అనుకోవడం లేదని  ఇంకెవరైనా ఈ పని చేసి ఉండొచ్చని అనుమానంగా ఉందని వసు అంటుంది. రిషి కూడా ఎంఎస్ఆర్ ని పట్టుకుంటే, అసలు విషయం తెలుస్తుందంటాడు. వాడు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు వసుధారా అంటాడు.

Guppednatha Manasu serial Today:29th November 2023 Mahindra feels Greatful ram

వసు మధ్యలో రిషిని కారు ఆపమని అడుగుతుంది. టీ కొట్టు దగ్గర కారు ఆపి, ఇద్దరూ కలిసి టీ తాగడానికి వెళతారు. అక్కడికి వెళ్లిన తర్వాత టీ ఎలా పెట్టాలో వసు స్వయంగా చెబుతుంది. దానికి రిషి, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అని అడుగుతాడు. అంటే ఏంటి రిషి సర్ అంటే.. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించేదానివో, ఇప్పుడు కూడా అలానే ప్రవర్తిస్తున్నావ్ అంటాడు. నువ్వు ఎండీవి ఇప్పుడు స్టూడెంట్ వి కాదు అంటాడు. ఏది అయితే ఏంటి సర్.. అప్పుడు, ఇప్పుడు నీ పక్కన ఉంది మీరే కదా అంటుంది. ఇద్దరూ అలా కాసేపు ఇదే విషయంపై వాదించుకున్న తర్వాత.. ఏకంగా తానే వెళ్లి టీ పెడతాను అంటుంది.  రిషి వద్దు అని చెప్పినా వినకుండా టీ సెంటర్ లోకి వెళ్లి, తానే స్వయంగా టీ పెడుతుంది. టీ పెట్టేటప్పుడు టీ మాస్టర్ కి టీ ఎలా పెట్టాలో చెబుతుంది. రిషి చాలా ఇబ్బందిగా ఫేస్ పెడుతూ ఉంటాడు. వసు అదేమీ పట్టించుకోకుండా టీ చేసేస్తుంది. తర్వాత రిషికి తీసుకు వెళ్లి ఇస్తుంది.

ఆ తర్వాత టీ షాప్ వ్యక్తి రిషిని గుర్తుపట్టి, సెల్ఫీ అడుగుతాడు.  వాళ్ల పిల్లలకు రిషి అంటే ఇష్టమని, పిల్లలకు చూపిస్తానని అంటాడు. వసు ఏమో ఏకంగా పోస్టర్ పెట్టుకోమని సలహా ఇస్తుంది. అతను కూడా  వావ్ సూపర్ ఐడియా అంటాడు. అయితే, రిషి మాత్రం అలాంటి పనులు చేయవద్దు అని చెప్పి, ఆ  తర్వాత సెల్ఫీ ఇస్తాడు. ఇక, అనుపమ మహేంద్ర ఇంటికి వచ్చేస్తుంది. మహేంద్ర స్వయంగా కాఫీ చేసుకొని వచ్చి అనుపమకు ఇస్తాడు. ఆ కాఫీ తాగుతూ, ఎందుకు రమ్మన్నావ్ అని అనుపమ అడుగుతుంది. అయితే, చిత్ర కేసులో తన కోడలు ఏ తప్పు చేయలేదని తేలిందని , ఈ మాట నీకు  ముందే చెప్పినా నువ్వు నమ్మలేదంటాడు. వసుధార జగతి శిష్యురాలు తాను ఏ తప్పు చేయదని అంటాడు.

ఈ మాట చెప్పడానికే పిలిచావా? ఇంకేమీ లేదా అని అనుపమ అడుగుతుంది. థ్యాంక్స్ చెప్పాలని పిలిచాను అని మహేంద్ర అంటాడు. ‘నువ్వు బెయిల్ ఇచ్చి వసుధారను బయటకు తీసుకు వచ్చావ్ కాబట్టే, రిషికి ఆ కేసు సాల్వ్ చేయాలనే ఆలోచన వచ్చింది. నువ్వు హెల్ప్ చేయడం వల్లే కదా  ఇది జరిగింది’ అని మహేంద్ర అంటాడు. ‘ చెప్పాను కదా మహేంద్ర, తప్పు లేదని మీరే నిరూపించుకోవాలని, నేను జస్ట్ బయటకు తీసుకువచ్చాను. అంతే తప్ప, నాకు ఏ ఉద్దేశం లేదు’ అని అనుపమ అంటుంది. అప్పుడే రిషి, వసులు అక్కడికి వస్తారు.

అనుపమను రిషి పలకరిస్తాడు. చిత్ర కేసులో  ఫ్రాడ్ ఎవరో తెలిసిపోయింది. ఎవరైతే  ఆ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడో వాడే అసలైన ఫ్రాడ్. చిత్ర పేరంట్స్ కూడా నిజమైన పేరెంట్స కాదు. ఈ కేసులో వీళ్లే నేరస్తులు మేడమ్. వసుధార మీద పడిన నింద తొలగిపోయింది. తను ఏ తప్పు చేయలేదని తేలిపోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని రిషి అంటాడు.

Guppednatha Manasu serial Today:29th November 2023 Mahindra feels Greatful ram

అప్పుడు, అనుపమ మళ్లీ వెటకారంగా మాట్లాడటం మొదలుపెడుతుంది. నీ భార్య నేరం చేయలేదని నిరూపించుకున్నావ్ సంతోషం. నేరస్తులను పట్టుకోవడంలో నీకు వేగం, చాతుర్యం ఉంది కదా? కానీ, మీ అమ్మను చంపిన వాళ్లను పట్టుకోవడానికి నీకు ఎందుకు ఇంత ఆలస్యమౌతుంది? చెప్పు రిషి.  అమ్మని చంపిన వాళ్లను పట్టుకోవాలని? శిక్షించాలని  లేదా అని అడుగుతుంది.  తాను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని రిషి చెప్పగా, అయినప్పటికీ ఆ కేసు కొలిక్కి రాలేదు కదా అని అనుపమ అంటుంది. కనీసం అనుమానితులు ఎవరు అనేది కూడా తెలీయలేదు కదా అంటుంది.

వసుధార మీద నిన్న నింద పడితే, ఈరోజుకి పరిష్కరించాడు. మరి అమ్మని చంపిన వారి విషయంలో ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యమౌతోంది? బతికినంత కాలం జగతిని బాధ పెట్టారు.. కనీసం తన చావుకు అయినా  న్యాయం జరగాలి కదా అంటూ ప్రశ్నలు వేస్తుంది. ఆమె ప్రశ్నలకు రిషికి బాగా కోపం వస్తుంది. తాను ఆ విషయం వదిలిపెట్టలేదని, ఎంత ప్రయత్నం చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసంటాడు. వసుధార కేసులో క్లూ దొరికిందని, జగతి కేసులో క్లూ దొరకలేదని చెబుతాడు. దానికి కూడా అనుపమ కౌంటర్ వేస్తుంది. క్లూ దొరకకపోతే వదిలేస్తావా అంటుంది. వసుధారపై కూడా ప్రశ్నలు వేస్తుంది. నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి జగతే కారణం కదా? నువ్వు ఆ మాత్రం జగతి కోసం ఇది చేయలేవా అని అడుగుతుంది. తనని చంపిన వాళ్లను పట్టుకుంటే, కనీసం  తన ఆత్మ అయినా సంతోషిస్తుంది కదా? నా జగతిని చంపిన వారు ఎవరో నాకు తెలియాలి అని అనుపమ అంటుంది.

అయితే, ఆ మాటలకు రిషి ఎమోషనల్ అవుతాడు. అమ్మను చంపిన వాళ్లను పట్టుకోవడం కోసం తాను చాలా కష్టపడుతున్నానని, తన తండ్రి తాగుడుకు బానిస అయినప్పుడు తనను మార్చడానికి చాలా  ప్రయత్నించానని అంటాడు. ఏడుస్తూ కూర్చుంటేనే మా బాధ మీకు తెలుస్తుంది. ఒక ఫ్రెండ్ గా మీకు అంత ఉంటే, కొడుకుగా నాకు ఎంత ఉండాలి? కచ్చితంగా అమ్మ మరణానికి న్యాయం చేసి తీరతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios