Guppedantha Manasu Serial Today నవంబర్ 16 ఎపిసోడ్.: శైలేంద్ర చెంప చెల్లు, మహేంద్ర ఇంటికి అనుపమ..!
ఇక, ఫణీంద్ర.. దేవయాని, శైలేంద్రలకు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు మీరే కారణం అని తిట్టేస్తాడు. జగతి చావు వెనక మీ ఇద్దరి హస్తం ఉందా అని ఫణీంద్ర అడగగానే, దేవయాణి, శైలేంద్ర ముఖాలు మాడిపోతాయి.

Guppedantha manasu Today: ఈరోజు ఎపిసోడ్ లో రిషి కిచెన్ లో వంట చేస్తూ ఉంటాడు. వసు వచ్చి, ఎందుకు సర్ మీకు ఇవన్నీ, అసలు కిచెన్ లో ఏవేవీ ఎక్కడ ఉన్నాయో కూడా మీకు తెలీదు అని చెబుతుంది. దీంతో, రిషి తనకు ఎక్కడెక్కడ ఏమేమీ ఉంటాయో తెలుసు అని అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే బియ్యం చాట తీస్తాడు. ఆ బియ్యం కాస్త.. వచ్చి వీళ్లిద్దరి తలపై పడిపోతాయి. అంతే,.. ఇద్దరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ ఉండిపోతారు. తర్వాత వసు.. ఏంటి సర్ ఇది అని కోపంగా అడుగుతుంది. అమాయకంగా ఫేస్ పెట్టిన రిషి, ఇందులో చింతపండు ఉంది అనుకున్నానని, బియ్యం అనుకోలేదు అని సమాధానం చెబుతాడు. వసు చిన్నగా నవ్వి, పెళ్లిలో తలంబ్రాలు పోసుకోలేదని, ఇలా జరిగిందేమో అని నవ్వేస్తుంది. దేవుడు మనల్ని ఇలా ఆశీర్వదించాడేమో అని అంటుంది. అన్నింట్లోనూ పాజిటివ్ గా ఆలోచిస్తావ్ కదా అని రిషి.. వసు ముఖంలోకి మురిపంగా చూసి మాట్లాడుతూ ఉంటాడు. అలా ఆలోచిస్తేనే మన లైఫ్ బాగుంటుంది అని చెప్పి, ఇలా సన్నివేశాలు మళ్లీ రావు అని ఫోటో తీసుకుందామని అడుగుతుంది. ఫోటో తర్వాత ఇద్దరూ తల మీద పడిన బియ్యం దులుపుకుంటూ ఉంటారు. వసు తలలో ఎక్కువగా ఉండటంతో, వాటిని స్వయంగా రిషినే తీసేస్తాడు.
సీన్ కట్ చేస్తే, ఇంట్లో శైలేంద్ర, దేవయాని మాట్లాడుకుంటూ ఉంటారు. అనుపమ, మహేంద్ర వాళ్లను కలిసిన విషయం దేవయాని తన కొడుక్కి చెబుతుంది. అది విని శైలేంద్ర షాకౌతాడు. పాత స్టూడెంట్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో కలసుకున్నారని, వసు, రిషి లే స్వయంగా మహేంద్రను అక్కడకు తీసుకువెళ్లారని చెబుతుంది. వాళ్లందరూ కలిసారంటేనే తన గుండెల్లో దడ పుడుతోందని దేవయాని అంటుంది. ‘ఆ అనుపమకు చిన్న నిజం తెలిసినా, మనల్ని అస్సలు వదిలిపెట్టదు. తనకు అసలే జగతి అంటే ప్రాణం. రిషి వాళ్లు ఇంట్లో ఉంటే మనకు కొన్ని విషయాలైనా తెలిసేవి. ఇప్పుడు వాళ్లు వేరే ఇంట్లో ఉండటంతో మనకు తెలీకుండా ఏవేవో గూడుపుటానీలు జరుగుతన్నాయ్’ అని దేవయాని కంగారుపడుతుంది. అయితే, అంత కంగారుపడాల్సిన అవసరం లేదని ,అంతా నేను చూసుకుంటాను అని శైలేంద్ర ధైర్యం చెబుతాడు. కానీ, దేవయాని వినిపించుకోదు..దీంతో, శైలేంద్ర భయపడవద్దని మరోసారి చెబుతాడు. మనకు తెలీకుండా రిషి వాళ్లు ఏదో చేసేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా? ఈ క్షణం నుంచి వాళ్లు ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలిసిపోతుంది. తెలిసి తీరాల్సిందే అని శైలేంద్ర అంటూ ఉంటాడు. ఆ సీన్ లోకి ఫణీంద్ర అడుగుపెడతాడు. వచ్చీ రాగానే, శైలేంద్ర చెంప పగలకొడతాడు. ఏం తెలియాలి నీకు? అంటూ ప్రశ్నిస్తాడు.
‘ఎవరూ మీకు తెలీకుండా ఏమీ చెయ్యకూడదా? ఎక్కడికీ వెళ్లకూడదా? ఏమనుకుంటున్నారు మీరు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు?’ అని ఫణీంద్ర సీరియస్ గా అడుగుతాడు. దీంతో దేవయాని ఏమీ లేదని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ, ఫణీంద్ర మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టడదు. ‘ ఇద్దరూ ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు. కుట్రలు చేసేవారిలాగా, తవ్రవాదుల్లా ప్రవర్తిస్తారు. మీకు ఇంక వేరే పనీ, పాట లేదా’ అని ప్రశ్నించి ధరణిని పిలుస్తాడు. ‘ వీళ్లద్దరూ కలిసి మాట్లాడుకోకుండా చూసుకోమని నీకు చెప్పాను కదా ధరణి. వీళ్లిద్దరూ మాట్లాడుకకుంటుంటే, ఏం చేస్తున్నారో? ఏం జరుగుతుందో అని నాకు భయం గా ఉంది. నీకు చెప్పాను కదా? నువ్వు ఏమి చేస్తున్నావ్ ’ అని ఫణీంద్ర ధరణి ని ప్రశ్నిస్తాడు. దానికి ధరణి, తాను చాలా ప్రయత్నాలు చేస్తున్నానని, కానీ వీళ్లు మాత్రం ఒక చోట కాకపోతే, మరోచోట కలిసి మాట్లాడుకుంటూనే ఉన్నారని చెబుతుంది. ఇక, ఫణీంద్ర.. దేవయాని, శైలేంద్రలకు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు మీరే కారణం అని తిట్టేస్తాడు. జగతి చావు వెనక మీ ఇద్దరి హస్తం ఉందా అని ఫణీంద్ర అడగగానే, దేవయాణి, శైలేంద్ర ముఖాలు మాడిపోతాయి. ఎక్కడ నిజం తెలిసిపోయిందా అని భయపడిపోతారు.
ఇక, సంపార జీవితం సరిగా లేదని కూడా శైలేంద్రను తిడతాడు. పెళ్లై ఎంత కాలం అయ్యింది అని అడిగితే కూడా శైలేంద్ర సమాధానం చెప్పలేక తిప్పలు పడుతూ ఉంటాడు. దీంతో, భార్యతో ప్రేమగా ఉండాలని కొన్ని సలహాలు ఇస్తాడు. నీకు ఇలాంటివి ఏమీ తెలీదు అని విపరీతంగా క్లాస్ పీకుతాడు. ఈ సీన్ మాత్రం ఫుల్ కామెడీగా ఉంటుంది. శైలేంద్రను ఫణీంద్ర తిడుతూ ఉంటే, ధరణి తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది.
ఇక, మహేందర్ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అనుపమ గురించి ఆలోచిస్తుండగా, అనుపమే ఫోన్ చేస్తుంది. కానీ, మహేంద్ర కాల్ కట్ చేస్తూ ఉంటాడు.అయినా, అనుపమ మళ్లీ చేస్తూనే ఉంటుంది. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. ‘నేను జగతిని చంపావ్ అన్నావ్ కదా? ఎంత మాట అన్నావ్?’ అంటాడు మహేంద్ర. దీంతో, అనుపమ‘ నాకు ముందే ఎందుకు నిజం చెప్పలేదు? మనం అరకులో కలిసినప్పుడే ఇలా జరిగిందని ఎందుకు చెప్పలేదు?’ అని ప్రశ్నిస్తుంది. అయితే, తనకు చెప్పాలని అనిపించలేదని, చెప్పలేకపోయాను అని అంటాడు. ఇలా కంటిన్యూస్ గా ప్రశ్నలు వేయడంతో మహేంద్ర ఇరిటేట్ అవుతాడు.
కానీ, అనుపమ మాత్రం వదిలిపెట్టదు. జగతిని ఎవరు చంపారు? తాను చనిపోయిన తర్వాత మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? అని అడుగుతుంది. కానీ, ఈ విషయంలో తాను ఇంతకంటే ఎక్కువ సమాధానాలు చెప్పలేను అని ఆపేస్తాడు. ఈ విషయం ఇంతటితో వదిలేయమని మహేంద్ర అడగగా, అనుపమ మాత్రం తాను వదలను అంటుంది. జగతి గురించి తనకు అన్ని విషయాలు తెలియాల్సిందే అని పట్టుపడుతుంది. కానీ, మహేంద్ర తన బాధ అంతా చెప్పేస్తాడు. అసలే తాను జగతి లేక బాధపడుతుంటే, నువ్వు ఇంకా ఇరిటేట్ చేస్తున్నావ్ అని సీరియస్ అవుతాడు. ఇవేమీ పట్టించుకోని అనుపమ, జగతిని ఎవరు చంపారో ఇప్పటి వరకు ఎందుకు తెలుసుకోలేదు అని అడుగుతుంది. నిజంగా జగతి మీద ప్రేమ ఉంటే, ఆ హంతకులు ఎవరో తెలుసుకునేవాడివి కదా? జగతి బతికున్నప్పుడు కూడా ఆమెకు దూరంగానే ఉన్నావ్ కదా? ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తోంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దీంతో, మహేంద్ర చాలా సీరియస్ అవుతాడు. జగతి గురించి అడగడానికి అయితే ఇంకోసారి ఫోన్ చేయవద్దు అంటూ కాల్ కట్ చేస్తాడు.ఇదంతా, రిషి, వసులు వినేస్తారు. అనుపమ కాల్ కి మహేంద్ర ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కాక, రిషి ఆలోచనలో పడిపోతాడు.
ఇక, అనుపమ ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. జగతి గురించి అసలు నిజం తాను తెలుసుకోవడం ఎలా? జగతిని చంపిందెవరు? నాకు అన్ని విషయాలు తెలియాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తాను, మహేంద్ర వాళ్ల ఇంటికి వెళితేనే, తనకు అన్ని విషయాలు తెలుస్తాయని ఫిక్స్ అవుతుంది. దానిలో భాగంగానే, వెంటనే మహేంద్ర ఇంటికి బయలు దేరుతుంది. లగేజ్ పట్టుకొని వెళ్తుంటే, ఏంజెల్ చూసి తన తాత విశ్వనాథం కి చెబుతుంది.
విశ్వనాథం వెంటనే, ఎక్కడికి అని ప్రశ్నించగా, తాను తెలుసుకోవాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయని, అవి తెలుసుకోవడానికి వెళ్తున్నానని చెబుతుంది. అది విని విశ్వనాథం బాధపడతాడు. వదిలి వెళ్లవద్దని బ్రతిమిలాడతాడు. ఏంజెల్ కూడా వెళ్లవద్దని బతిమిలాడుతుంది.కానీ, అనుపమ మాత్రం వినిపించుకోదు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.