Guppedantha Manasu Serial Today:రిషి గుట్టు తెలుసుకునేందుకు ధరణిని మాయ చేస్తున్న శైలేంద్ర
అనుపమ వెళ్తూ వెళ్తూ, ఏంజెల్ కి ఓ సలహా ఇస్తుంది. ‘నీ మేనత్తగా, ఓ ఫ్రెండ్ గా నీకో మంచి మాట చెబుతాను వింటావా, నీ జీవితం, నా జీవితంలా మాత్రం చేసుకోవద్దు’ అని సలహా ఇస్తుంది. అనంతరం అక్కడి నుంచి బయలు దేరుతుంది.

Guppedantha Manasu Episode Today: గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ లో అనుపమ, మహేంద్ర ఇంటికి బయలు దేరుతుంది. అది చూసి విశ్వనాథం ఆపుతాడు. ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు తనకు దూరంగా ఉన్నావని, ఇన్నాళ్ల తర్వాత పిలవకుండానే ఇంటికి వచ్చినందుకు తనకు సంతోషంగా అనిపించిందని, ఇప్పుడు మళ్లీ వెళ్లిపోతానని బాధపెట్టవద్దని కోరతాడు. దానికి అనుపమ క్షమాపణలు చెబుతుంది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటలన కారణంగా మీ అందరికీ దూరం కావాల్సి వచ్చిందని, మిమ్మల్ని బాధపెట్టానని చెబుతుంది. కానీ, ఇక నుంచి అలా జరగదని, తాను మీతో ఉంటానని, మీకు చెప్పకుండా, మీకు దూరంగా ఎక్కడికీ వెళ్లనని హామీ ఇస్తుంది. దీంతో, విశ్వనాథం సంతోషిస్తాడు. కానీ, ఇప్పుడు మాత్రం తాను ఒక పనిమీద వెళ్లాలని, ఆ పని పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ వస్తానని చెబుతుంది. దాంతో, విశ్వనాథం సరే అని అంగీకరిస్తాడు. కానీ, ఎక్కడ ఉంటావ్ అదైనా చెప్పమని అడుగుతాడు. ఆ విషయం ఇంకా తనకు కూడా తెలీదని అనుపమ బదులిస్తుంది. అదేంటి అని విశ్వం అడగగా, ప్రస్తుతం తనకు తాను చేయాల్సిన పని మాత్రమే తెలుసు అని, ఆ పని ఎలా పూర్తి చేయాలి అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని చెబుతుంది. విశ్వనాథం కూడా సరే అని అంగీకరిస్తాడు. కానీ, నీకు తోడుగా ఏంజెల్ ని తీసుకువెళ్లమని కోరతాడు. అయితే, అనుపమ తాను ఒంటరిగా ఉండటం అలవాటేనని, జీవితంలోనే ఒంటరిగా మిగిలిపోయిన దానిని అని, ఈ ఒంటరి ప్రయాణం తనకు ఏమీ కొత్త కాదు అని చెబుతుంది.
అయితే, మధ్యలో ఏంజెల్ ఇన్వాల్వ్ అవుతుంది. అత్తయ్య నేను కూడా మీతో వస్తాను అని అడుగుతుంది. అప్పుడు అనుపమ, ఇప్పుడు కాదని, తనకు నిజంగా అవసరం అనిపించినప్పుడు కచ్చితంగా పిలుస్తాను అని హామీ ఇస్తుంది. కానీ, ఏంజెల్ వినిపించుకోకుండా ఇప్పుడే వస్తాను అంటుంది. దాంతో, అనుపమ చిన్నపిల్లలా మారాం చేయవద్దు, అర్థం చేసుకోమంటుంది. విశ్వం కూడా అనుపమకే సపోర్ట్ చేస్తాడు. అనుపమ ఒక నిర్ణయం తీసుకుంటే దానిలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతాడు. ఇక, ఏంజెల్ సైలెంట్ అవుతుంది. అనుపమ వెళ్తూ వెళ్తూ, ఏంజెల్ కి ఓ సలహా ఇస్తుంది. ‘నీ మేనత్తగా, ఓ ఫ్రెండ్ గా నీకో మంచి మాట చెబుతాను వింటావా, నీ జీవితం, నా జీవితంలా మాత్రం చేసుకోవద్దు’ అని సలహా ఇస్తుంది. అనంతరం అక్కడి నుంచి బయలు దేరుతుంది.
మరోవైపు ఇంట్లో ధరణి బట్టలు ఐరన్ చేస్తూ ఉంటుంది. శైలేంద్ర కాఫీ తీసుకొని అక్కడికి వస్తాడు. రావడం రావడమే ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెడతాడు. అయ్యో ధరణి నువ్వు ఎందుకు కష్టపడుతున్నావ్, ఇలాంటి పనులు నువ్వెందుకు చేస్తున్నావ్ అని లేని ప్రేమను ఒలకబోస్తాడు. ఆ మాటలకు ధరణి కూడా షాకౌతుంది.‘ అన్ని పనులు నువ్వు చేయకూడదు, కొన్ని పనులు వదిలేసేయ్, ఇదిగో కాఫీ తీసుకో.. ఏంటి అలా చూస్తున్నావ్? నీ కోసం నేనే కాఫీ చేసి తీసుకువచ్చాను. నా చేతులతో చేశాను. తాగి టేస్ట్ చేసి చెప్పు’ అని శైలేంద్ర అడుగుతాడు. ఎప్పుడూ లేనిది శైలేంద్ర ఇలా ప్రేమ చూపించడం ధరణి కి కొత్తగా అనిపిస్తుంది. మీరు కాఫీ తేవడం ఏంటి అని అడుగుతుంది. దానికి శైలేంద్ర తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, ఇక మీదట నిన్ను కష్టపెట్టకూడదని అనుకున్నాను అని, ప్రేమగా చూసుకుంటానని, నీ కోరికలు తీరుస్తూ, నిన్ను సంతోషంగా చూసుకోవాలని అనుకుంటున్నానని కూడా చెబుతాడు.
ఈ ప్రవర్తనకు ధరణి వెంటనే ఆలోచనలో పడిపోతుంది. సడెన్ గా ఇలా మాట్లాడుతున్నారంటే, కచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉండే ఉంటుంది అని అనుకుంటుంది. ధరణి అనుమానాన్ని శైలేంద్ర వెంటనే పసిగట్టేస్తాడు. వెంటనే ఆమె మైండ్ మార్చాలని అనుకుంటాడు ‘ నిన్న డాడ్ అన్న మాటలు నన్ను కలచి వేశాయి. రాత్రి నిద్రకూడా పట్టలేదు, ఇంతకాలం నిన్ను చాలా బాధ పెట్టాను. నిన్నే కాదు చాలా మందిని బాధపెట్టాను. చాలా తప్పులు చేశాను. చాలా అన్యాయాలు చేశాను. ముఖ్యంగా ఒక భార్యగా నిన్ను గుర్తించేలకపోయాను, వాటన్నింటికీ చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. నాకు ఈ ఉదయం జ్నానోదయ అయ్యింది. ఇక మీద నిన్ను నేను కసరుకోను. ఒక్కమాట కూడా అనను. వేరే వాళ్లను కూడా అననివ్వను.మామ్ ని కూడా అననివ్వను’ అని కళ్లబొళ్లి మాటలు చెబుతాడు. ఆ మాటలకు, చెప్పిన విధానానికి ధరణి కూడా నమ్మేసినట్లే అనిపిస్తోంది. అయితే ఇటు శైలేంద్ర ఇలా మాట్లాడుతుంటే ఫణీంద్ర వింటాడు. నిజమే అనుకొని, కొడుకు మారినందుకు సంతోషిస్తాడు.
వెంటనే ఫణీంద్ర కొడుకు దగ్గరకు వస్తాడు. ప్రేమగా శైలేంద్ర అని పిలుస్తాడు. నువ్వు మారినందుకు సంతోషంగా ఉందంటాడు. మీ మాటలకు, మీరు కొట్టిన చెంప దెబ్బకు నాలోని దుర్మార్గుడు పారిపోయాడు అని శైలేంద్ర చెబుతాడు. తాను కోరుకున్నది కూడా ఇదేనని ఫణీంద్ర చెబుతాడు. అప్పుడే అక్కడకు వచ్చిన దేవయాణి, నిజంగా తన కొడుకు మారిపోయాడా? లేక నటిస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక, ఫణీంద్ర. కొడుక్కి, భార్యతో ఎలా ఉండాలో హిత బోధ చేస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లగానే, దేవయాణి కనపడుతుంది. ఏంటి అలా ఉన్నావ్ అనగానే, ఆమె కూడా తన పర్ఫార్మెన్స్ మొదలుపెడుతుంది. మీరు నిన్న అన్న మాటలు నాకు గుచ్చుకుంటున్నాయ్ అని, తాను గయ్యాళిని కానీ, దుర్మార్గురాలిని కాదు అని చెబుతుంది. సేమ్ అక్కడ కొడుకు ఎలా నటించాడో? ఇక్కడ దేవయాణి కూడా నటిస్తుంది.
ఇక, అనుపమ ఫోన్ కాల్ తర్వాత, మహేంద్ర చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆ మాటలు పదే, పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. దీంతో, వెంటనే జగతి ఫోటో ముందు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ టార్చర్ నుంచి బయటపడటానికి తాను మందు తాగాలని డిసైడ్ అవుతాడు. ఆవేశంగా సీసా అందుకుంటాడు. రిషి, వసులు వచ్చి అడ్డుకుంటారు. తాగను అని చెప్పారు కదా డాడ్ మళ్లీ, ఎందుకు తాగుతున్నారు అని ప్రశ్నిస్తారు. తనకు తాగాలని అనిపిస్తోందని, తాను మనిషినే మారిపోయానని, మనసుదేముంది అంటాడు. ఓవైపు జగతి జ్నాపకాలు మర్చిపోలేక ఇబ్బంది పడుతున్న తనకు, కొన్ని ప్రశ్నలు,కొన్ని చూపులు తనను పొడిచేస్తున్నాయని అంటాడు. మీరు చెబుతోంది అనుపమ గురించే కదా అని రిషి ప్నశ్నిస్తాడు. ఆమె గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదని, తాను చెప్పాల్సిన నిజం తాను చెప్పేశానని రిషి అంటాడు.
అనుపమ గురించి మాత్రమే కాదని, చిన్న చిన్న విషయాలకు కూడా తనకు జగతి గుర్తుకువస్తోందని, మర్చిపోలేకపోతున్నానని మహేంద్ర తన బాధను చెబుతాడు. దీంతో, రిషి ఒక్క ఎమోషనల్ డైలాగ్ తో మహేంద్ర నోరు మూయిస్తాడు. పోయిన అమ్మ మాత్రమే గుర్తువస్తోందా? ఉన్న నేను గుర్తుకు రావడం లేదా అని అంటాడు. మహేంద్ర స్టన్ అయిపోతాడు. ‘నేను మీ రిషిని డాడ్, మీకోసం ఏదైనా చేసే రిషిని. మీ ఆనందం కోసం అమ్మను ఇంటికి పిలిచాను.కనీసం ఆ కృతజ్నత కోసం నా గురించి ఆలోచించారా’ అని ప్రశ్నిస్తాడు. ‘మీరు అమ్మను తలుచుకొని,తాగి,తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటారా?’ అని రిషి అడుగుతాడు. కానీ, మహేంద్ర మాత్రం వినిపించుకోడు.‘ప్రతి నిమిషం జగతి ఆలోచనలు తనను చంపేస్తున్నాయి. 20ఏళ్లు మీ అమ్మకు దూరంగా ఉన్నా కూడా, తను ఎక్కడో ఒక చోట బతికే ఉందని ఆశ ఉండేది. ఏనాటికైనా కలుస్తామనే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఏ ఆశ, ఏ భరోసా లేదు . నా కాళ్ల ముందే తాను కుప్పకూలిపోవడం, నా కళ్ల ముందే తను చలనం లేకుండా పడి ఉండటం చూశాను. నా కళ్ల ముందే బూడిదైపోవడం చూశాను. అదంతా నేను ఎలా భరించగలను. నేను భరించలేను రిషి, నేను భరించలేకపోతున్నాను. ఆ ఆలోచనలకు దూరంగా ఉండాలంటే నా మెదడు మొద్దు బారాలి. నా మనసు మూత పడాలి. అందుకే నేను తాగాలి , అడ్డు తప్పుకో రిషి. నేను తాగాలి’ అంటూ మందు బాటిల్ పట్టుకుంటాడు.
దీంతో, రిషి వెంటనే,... ‘మీరు తాగుతున్నది రిషి ఆయుష్షు అని గుర్తు పెట్టుకోండి.మీరు బాధను మర్చిపోవాలని అనుకుంటన్నారు కానీ, అందులోనే మేము కూడా బాధపడాలని అనుకుంటన్నారు. మీరు తాగడం వల్ల మా ఆనందం దూరమైపోతుంది. మా జీవితం మాకు కాకుండా పోతోంది. మేం సంతోషంగా బతకాలని మీరు అనుకుంటున్నారు. కానీ, మీరు అలా తాగితే, మేం సంతోషంగా ఉండేలం. డాడ్, మీకు ఒక్కరికేనా బాధ..?నీ ఒక్కరికే ఉంటుంది అనుకుంటున్నారా? నేను పడలేదా ఆ బాధ? తల్లి లేదనే ఆవేదన పసితనంలో ఎలా దాటాను? మా అమ్మ కావాలని అనిపించినప్పుడల్లా తనను తలుచుకుంటూ ఒంటరిగా బాధపడ్డాను కానీ, ఏ అలవాట్లు నేర్చుకోలేద కదా? బాధను ఒంటరిగా భరించినవాళ్లే, జీవితంలో పైకి వస్తాడు, నిలపడతాడు మీరు నాకు నేర్పిన పాఠం, ఈరోజు మీకు చెప్పాల్సి వస్తోంది. అమ్మ వచ్చింది. నాకు అమ్మ విలువ తెలిసింది. అమ్మతో జీవితాంతం గడపాలని, అమ్మ ప్రేమ పొందాలి అనుకున్న టైమ్ లో అమ్మే దూరం అయిపోయింది. మీకు దూరమైంది భార్య, కానీ నాకు దూరమైంది అమ్మ. మరి నేను ఎలా భరిస్తున్నాను డాడ్..? అమ్మ కోరిక తీర్చడం కోసం, ఆమె మన మధ్యలోనే ఉంటుందనే కోరికతోనే నేను పెళ్లి కూడా చేసుకున్నాను. అయినా కూడా అమ్మ దూరం అయిపోయింది. అలా అని నేను కూడా బాధ పడాలా? నేను కూడ తాగాలా చెప్పండి డాడ్? దేవుడు అమ్మకు అంత వరకే తలరాత రాశాను అని మనం అర్థం చేసుకోవాలి. ఇంతే మన ప్రాప్తం అని నేను సైలెంట్ గా ఉండటం లేదా? తాగుడే బాధకు ఓదార్పు అయితే, కన్నీళ్లు ఎందుకు డాడ్? మందు నీళ్లు సరిపోవా? కావాలంటే, మనసారా ఏడ్వండి ఒప్పుకుంటాను. కానీ, ఇలా తాగుతాను అంటే మాత్రం నేను సహించను డాడ్. సహించను. ఇంకెప్పుడు మీరు తాగొద్దు. తాగను అని నా మీద ఒట్టేసి చెప్పండి.’ అంటూ మాట తీసుకుంటాడు.