Asianet News TeluguAsianet News Telugu

Guppedantha Manasu Serial Today:సంతోషంలో మహేంద్ర, అనుపమలో అనుమానం పెంచుతున్న దేవయాణి, ధరణి తో శైలేంద్ర హనీమూన

గుప్పెడంత మనసు నవంబర్ 23 ఎపిసోడ్.. అనుపమ వచ్చి వెళ్లిన తర్వాత మహేంద్ర కుటుంబం సంతోషంగా ఉంటుంది. మరోవైపు దేవయాణి మళ్లీ అనుపమ బుర్రలో విషం నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు శైలేంద్ర, ధరణి లను హనీమూన్ పంపడానికి ఫణీంద్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

Guppedantha Manasu Serial Today November 23, Rishi Feels Haapy About Mahindra ram
Author
First Published Nov 23, 2023, 7:44 AM IST


Guppedantha Manasu Serial Today: ఈరోజు ఎపిసోడ్ లో వసు ఇంట్లో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. అనుపమను తనను అడిగిన ప్రశ్నలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. దేవయాణి దగ్గరకు వెళ్లి వచ్చారు కాబట్టి, ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా? అనుపమ మెదడును దేవయాణి స్పాయిల్ చేసిందా అదే నిజమైతే, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది. ఈలోగా అక్కడికి రిషి వచ్చి, అనుపమ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు. తన తండ్రి ఒంటరిగా ఉండటం ఇష్టంలేక, అనుపమను వాళ్ల అమ్మే పంపించింది అనిపిస్తోందని రిషి అంటాడు. వసు కూడా నిజమేనని అంగీకరిస్తుంది. వాళ్లిద్దరి స్నేహం చాలా  గాఢమైనదని తెలుస్తోందని వాళ్లిద్దరూ అభిప్రాయపడతారు.  చాలా కాలం తర్వాత మనకు నచ్చిన వస్తువు, పుస్తకం దొరికితే ఎంత సంతోషంగా ఉంటే, ఆ సంతోషం ఈ రోజు కనిపించిందని వారు అనుకుంటారు. తమకు కూడా తెలియని మహేంద్ర ఆహారపు అలవాట్లు అనుపమ చెబుతున్నట్లు గుర్తు చేసుకుంటారు. ఇక, అనుపమ జీవితంలో పెళ్లి ఎందుకు చేసుకోలేదని వసు ఆలోచిస్తుండగా, ఆమెకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు కదా వసుధార అని రిషి అంటాడు. దేవుడు ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా రాస్తాడని, సంతోషంగా ఉంటాం అనుకున్న మన జీవితంలోనే ఇన్ని కష్టాలు తీసుకువచ్చాడు ఆ దేవుడు అని రిషి అనగా, ఎన్ని వచ్చినా మనం కలిసే ఉన్నాం కదా సర్ అంటూ రిషి చెయ్యి పట్టుకుంటుంది వసు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి  లోపలికి వెళతారు.

Guppedantha Manasu Serial Today November 23, Rishi Feels Haapy About Mahindra ram

వాళ్లు లోపలికి వెళ్లే సరికి మహేంద్ర ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసి వీరిద్దరూ సంతోషిస్తారు. ఈరోజు చాలా స్పెషల్ గా ఉన్నారు మీరు ఏంటి స్పెషల్ అని రిషి అడిగితే, తాను ఎప్పటిలానే ఉన్నాను అని మహేంద్ర అంటాడు. వసు, రిషిలు ఇద్దరూ కలిసి  మీరు కొత్తగా ఉన్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మహేంద్ర మాత్రం తాను నార్మల్ గానే ఉన్నాను అని చెబుతాడు.  ఆతర్వాత ముగ్గురూ నవ్వుకుంటారు. మీరు ఇలానే సంతోషంగా ఉండాలని, తాను అదే కోరుకున్నానని రిషి అంటాడు. తర్వాత మహేంద్ర.. వాళ్లిద్దరినీవెళ్లి పడుకోమంటాడు. వాళ్లు వెల్లగానే మహేంద్ర తనలో తాను మాట్లాడుకుంటాడు. జగతి వెళ్తూ వెళ్తూ తనకు ఓ అమ్మని ఇచ్చి వెళ్లావ్ అంటాడు.  ఎవరికైనా కొడుకు తండ్రి లా మారతాడని, కానీ రిషి మాత్రం తనకు అమ్మలా మారాడు అని సంతోషిస్తాడు.

Guppedantha Manasu Serial Today November 23, Rishi Feels Haapy About Mahindra ram

ఇక, ఇంటికి వెళ్లిన అనుపమకు దేవయాణి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావ్ అని ప్రశ్నలు వేస్తుంది. ఊరికే తెలుసుకుందాం అని దేవయాణి అంటే, తెలుసుకొని ఏం చేస్తారు అని అనుపమ అంటుంది. ఇక్కడే ఉంటే భోజనానికి పిలుద్దామని అనుకున్నానని దేవయాణి చెబుతుంది. అయితే, అనుపమ తాను ఇక్కడే ఉన్నానని భోజనం కూడా చేశానని చెబుతుంది. హోటల్ భోజనం చేశావా? ఇంటి భోజనం అయితే ఆరోగ్యం కదా అని దేవయాణి అమాయకంగా అడగగా, తాను ఇంటి భోజనమే చేశానని, రిషి ఇంట్లో భోజనం చేసినట్లు చెబుతుంది. నిజానికి, ఈ విషయం తెలుసుకోవడానికే దేవయాణి, అనుపమకు ఫోన్ చేయడం విశేషం. తర్వత అనుపమ ఫోన్ పెట్టేయబోతుంటే, దేవయాణి వదిలిపెట్టదు. మహేంద్రతో ఏం మాట్లాడావ్? వసుధారతో ఏం మాట్లాడావ్ అని అడుగుతుంది.

Guppedantha Manasu Serial Today November 23, Rishi Feels Haapy About Mahindra ram

దీంతో, అనుపమ మీకు ఎందుకు ఈ విషయాలు? నేను ఏం మాట్లాడితే మీకు ఎందుకు అని అడుగుతుంది. దీంతో, అనుమానం వచ్చిందా అని కాస్త తగ్గినట్లే తగ్గి, వసుధార టాపిక్ తెస్తుంది. వసుధారతో మాట్లాడావా? ఏం అంది అడుగుతుంది. దానికి అనుపమ, వసు చాలా తెలవైంది అని చెబుతుంది. ఇక అంతే, వసు చాలా తెలివైంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని హింట్స్ ఇస్తుంది. వసుధారే అంతా చేసింది అనే విషయం అర్థం కావాలని నొక్కి నొక్కి మరీ వసుధారతో జాగ్రత్త అని చెబతుంది.  అనుపమకు దేవయాణి ఏం చెప్పాలి అనుకుంటోందో అర్థం కాదు. ఈలోగా దేవయాణి ఫోన్ పెట్టేస్తుంది. దేవయాణి మాటలకు అర్థం ఏంటో అనుపమకు అర్థం కాదు. మరో వైపు దేవయాణి అలర్ట్ అవుతుంది. అనుపమ పదేపదే మహేంద్ర ఇంటికి వెళితే, నిజం తెలిసిపోతుందని, వసుధార చెప్పకపోయినా మహేంద్ర నిజాలు మొత్తం చెప్పేస్తాడని భయపడుతుంది.

సీన్ ఓపెన్ చేస్తే, కాలేజీలో మొదలౌతుంది.  ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరూ లవర్స్ అనే విషయం అర్థమౌతుంది. అమ్మాయి వెళ్తుంటే, ఒక అబ్బాయి వచ్చి చెయ్యి పట్టుకొని ఆపుతుంటాడు. అప్పుడే రిషి వచ్చి ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావ్ అని అడుగుతారు. అయితే, వారిద్దరం ప్రేమించుకున్నామని, చిన్న గొడవకే తను నాతో మాట్లాడటం లేదని ఆ అబ్బాయి వాపోతాడు. కానీ, ఆ అమ్మాయి మాత్రం అసలు నేను ప్రేమించలేదు అని చెబుతుంది. ఆ అబ్బాయి వదలకుండా ఇబ్బంది పెడుతుంటే, వసు ఏకంగా ఆ అబ్బాయిని కొడుతుంది. ప్రేమ లేదని  ఆ అమ్మాయి, ప్రేమించిందని అబ్బాయి వాదిస్తూ ఉంటారు. దీంతో, ఇద్దరిలో తప్పు ఎవరిదో తేల్చే పనిలో రిషి, వసులు ఆలోచనలో పడతారు. దీంతో, రిషి అ అబ్బాయికి హిత భోధ చేస్తాడు.  నువ్వు నిజంగా ప్రేమిస్తే, తనను ఇబ్బంది పెట్టకూడదని, ఎదురు చూడాలని అని చెబుతాడు. ఆ తర్వాత అతనిని బయటకు పంపించేసి, ఆ అమ్మాయికి ధైర్యం చెబుతారు.

Guppedantha Manasu Serial Today November 23, Rishi Feels Haapy About Mahindra ram

సీన్ కట్ చేస్తే, శైలేంద్ర, ఫణీంద్ర, దేవయాణిలకు ధరణి కాఫీలు ఇస్తూ ఉంటుంది. ఇక, కాఫీ అద్భుతం అంటూ శైలేంద్ర పొగడ్తలు కురిపిస్తాడు. అప్పుడే ఫణీంద్ర కలగజేసుకొని, నువ్వు కూడా ధరణికి నచ్చినట్లుగా ఉండాలని సలహా ఇస్తాడు. అప్పుడే బంధం బాగుంటుందని సలహా ఇస్తాడు. ఈ లోగా ఓ అమ్మాయి పని కోసం ఇంటికి వస్తుంది. పని అమ్మాయి ఎందుకు అని దేవయాణి ప్రశ్నించగా, తానే పెట్టానని ఫణీంద్ర అంటాడు. ధరణి ఉండగా, ఈ పని అమ్మాయితో ఏం పని అని దేవయాణి అడగగా,  ధరణి, శైలేంద్రలను బయటకు పంపిస్తున్నట్లు చెబుతాడు. తాను అన్ని ఏర్పాట్లు చేశానని కూడా చెబుతాడు.

Follow Us:
Download App:
  • android
  • ios