Asianet News TeluguAsianet News Telugu

Guppedantha Manasu Serial Today:వసు అరెస్ట్, బెయిల్ ఇప్పించి ఒక్క ఛాన్స్ ఇచ్చిన అనుపమ..!

అసలు చిత్ర ఆ అబ్బాయిని ప్రేమించలేదని, నిజమైన ప్రేమకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ఎవరో కుట్ర చేస్తున్నారు అని చెబుతుంది. ఈ లోగా అక్కడికి అనుపమ వస్తుంది. మీకు అసలు ఇది న్యాయంగా ఉందా అని ప్రశ్నిస్తుంది.

Guppedantha Manasu Serial Today:25th November 2023 Rishi, Mahindra Rebuke Anupama ram
Author
First Published Nov 25, 2023, 8:27 AM IST


Guppedantha Manasu Serial Today:గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ హాస్పిటల్ లోనే కంటిన్యూ అయ్యింది. వసుధార, చిత్రను బెదిరించిందని అందుకే ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని చిత్ర బాయ్ ఫ్రెండ్ చెబుతాడు. ఇదే విషయాన్ని కావాలంటే చిత్ర పేరెంట్స్ ని కూడా అడగమని చెబుతాడు. ట్విస్ట్ ఏమిటంటే, వాళ్లు కూడా అదే నిజమని చెబుతారు. ఈ మేడమ్ గారు వచ్చి బెదిరించడం వల్లే, మా అమ్మాయి ఇలా చేసుకుందని చిత్ర తల్లిదండ్రులు ఏడుస్తూ చెబుతారు. తన చిత్రకు ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చిన ఈ మేడమ్ ని అరెస్టు చేయమని అతను పోలీసులను అడుగుతాడు. ఆమెను అరెస్టు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి కదా సర్ అని అతను అడగగానే, పోలీసులు కూడా సరిపోతాయి అని చెబుతారు. వెంటనే వసుధారను పోలీసులు అరెస్టు చేస్తారు.

Guppedantha Manasu Serial Today:25th November 2023 Rishi, Mahindra Rebuke Anupama ram

రిషి ఆపేందుకు ప్రయత్నం చేస్తాడు. వసుధార తప్పు చేయదని, ఇందులో ఏదో మతలబు ఉందని రిషి చెప్పినా, ఎస్ఐ ఒప్పుకోడు. దీంతో, వారు అరెస్టు చేసుకొని తీసుకొని వెళతారు. మధ్యలో మీడియా వాళ్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. వాటికి వసు సమాధానాలు చెబుతూనే ఉంటుంది. అసలు చిత్ర ఆ అబ్బాయిని ప్రేమించలేదని, నిజమైన ప్రేమకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ఎవరో కుట్ర చేస్తున్నారు అని చెబుతుంది. ఈ లోగా అక్కడికి అనుపమ వస్తుంది. మీకు అసలు ఇది న్యాయంగా ఉందా అని ప్రశ్నిస్తుంది.

‘మీరు ఒక ఆడపిల్ల అయ్యి ఉండి, మరో ఆడ పిల్ల చావుకు కారణమౌతారా? కాలేజీ ప్రతిష్ట కోసం ఒక ఆడపిల్ల ప్రాణాన్ని పణంగా పెడతారా? ఇది మీకు సవ్యంగా ఉందా? ఎండీ సీటులో కూర్చునే ముందు దానికి తగ్గ అర్హత ఉందో లేదో తెలసుకోవాలి కదా’ అంటూ అనుపమ వసుధారను ప్రశ్నిస్తుంది. మధ్యలో కలగజుసుకున్న రిషి, చిత్ర ఆత్మహత్యకు వసుధారకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. నిజాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ కాస్త సీరియస్ గానే చెబుతాడు. దీని వెనక ఏదో జరిగింది అని రిషి అంటాడు. మరి, ఆ సమయంలో వసు వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లింది అని  అనుపమ ప్రశ్నిస్తుంది. అయితే, తనకు ఆ సమయంలో చిత్ర ఫోన్ నుంచి ప్లీజ్ హెల్ప్ మీ మేడమ్ అని మెసేజ్ వచ్చిందని, అందుకే వెళ్లానని చెబుతుంది. అయితే, ఆ మెసేజ్ చూపించమని అనుపమ అడుగుతుంది. అయితే, ఆ మెసేజ్ కోసం వసు వెతకగా, అది కనపడదు. మెసేజ్ డిలీట్ అయ్యిందని చెబుతుంది.

దీంతో, అనుపమ వసు చెప్పింది వినదు. ఇదంతా మీరే క్రియేట్ ఛేశారని, చిత్ర ఆత్మహత్య యత్నం చేయడానికి నువ్వే కారణం అంటుంది. కానీ, వసు మాత్రం తాను కారణం కాదని, తాను ఏమీ చేయలేదు అని చెబుతుంది. వెంటనే అనుపమ... ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, వసుధారను అరెస్టు చేయమని చెబుతుంది.  వసు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని ప్రాధేయపడుతుంది. కానీ,పోలీసులు వినకుండా తీసుకొని వెళతారు. ఏదైనా ఉంటే స్టేషన్ కి వచ్చి మాట్లాడండి అంటారు. దీంతో, రిషి,మహేంద్ర స్టేషన్ కి బయలుదేరతారు.

Guppedantha Manasu Serial Today:25th November 2023 Rishi, Mahindra Rebuke Anupama ram

ఈలోగా, అనుపమ వారిద్దరినీ ఆపేస్తుంది. వసుధార ఇలాంటి పనులు చేస్తుందని తాను అనుకోలేదని, ఎండీ స్థానంలో ఉంది అంటే ఆమె ఆలోచనలు కూడా గొప్పగా ఉంటాయని అనుకున్నానని, కానీ ప్రేమికుల మధ్య , వాళ్ల గొడవల్లో దూరుతుందని అనుకోలేదు అని అనుపమ అంటుంది. ఒక కాలేజీ కి ఎండీగా ఉంటూ, ఒక స్టూడెంట్  చావుకు కారణమమౌతుందా? జగతి పేరు నాశనం చేస్తోంది అంటుంది. ఆ మాటలకు రిషికి బాగా కోపం వస్తుంది. మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని రిషి సీరియస్ అవుతాడు. దానికి అనుపమ వెటకారంగా, తాను ఏమీ ఊరికే అనడం లేదని,  సాక్ష్యాధారాల ఆధారంగానే తాను మాట్లాడుతున్నాను అని అంటుంది. దానికి కూడా రిషి గట్టిగానే ఆన్సర్ ఇస్తాడు. మనకు తెలిసిందే సర్వస్వం అనుకోకూడదు అంటాడు. వసుధార గురించి మాకు బాగా తెలుసు అని, వసుధార మా కాలేజీలో స్టూడెంట్ నుండి ఎండీగా ఎదిగిందని, తన గ్రాఫ్ చూస్తే తన కెపాసిటీ ఏంటో మీకు తెలుస్తుంది అంటాడు. మీరు మనసులో ఏదో పెట్టుకొని, ఇంకేదో మాట్లాడొద్దు అని సీరియస్ గా చెబుతాడు.

వసు.. ఎంత మంది ఆడపిల్లలకు జీవితం ఇచ్చిందో తెలుసా? మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా చాలా మందికి లైఫ్ ఇచ్చిందో మీకు తెలుసా అని రిషి అంటాడు. మీరు ఇప్పుడు ఏవేవో చెప్పి, గొప్పదాన్ని చేయాల్సిన అవసరం లేదు అని అనుపమ కౌంటర్ ఇస్తుంది. అయితే, మహేంద్ర కూడా సీరియస్ అవుతాడు. నువ్వు బురద జల్లుతావా? వసుని ఏదైనా అంటే, నువ్వు జగతిని అన్నట్లే అని మహేంద్ర అంటాడు.  ఇక, రిషి కూడా చిత్ర కు మెళకువ వచ్చిన తర్వాత అన్ని నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి, మహేంద్రను తీసుకొని వెళ్లిపోతాడు.

కారులో స్టేషన్ కి వెళ్తూ, డీఐజీ కి ఫోన్ చేస్తాడు  రిషి.  బెయిల్ ఇప్పించండి అని రిషి అడగగా, ఇప్పటికే ఈ వార్త అందరికీ తెలిసిపోయిందని, ఇప్పుడు కష్టం అని చెప్పేస్తారు.వెంటనే ఏసీపీ కూడా కాల్ చేస్తారు. ఆయన కూడా తన వళ్ల కాదని చేతులు ఎత్తేస్తాడు. దీంతో, వసు జైల్లో ఉండాల్సిందేనా అని రిషి బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వసు స్టేషన్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆలోగా, రిషి, మహేంద్రలు అక్కడికి వచ్చేస్తారు. ఏమీ కాదని, నువ్వు ఏ తప్పు చేయలేదని రిషి, వసులు ధైర్యం చెబుతారు. వెంటనే బెయిల్ తెస్తాం అని హామీ ఇస్తారు.

Guppedantha Manasu Serial Today:25th November 2023 Rishi, Mahindra Rebuke Anupama ram

వసుధార తప్పు ఏమీ లేదని పోలీసులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒక టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న తనను మీరు ఇలా అరెస్టు చేయడం కరెక్ట్ కాదు అని మహేంద్ర చెప్పబోతే, అంతకన్నా పెద్దవాళ్లను కూడా తాము అరెస్టు చేశామని, ఏదైనా ఉంటే లాయర్లతో మాట్లాడుకోమని చెబుతారు. మరోవైపు రిషి, వసుకి ధైర్యం చెబుతాడు. ఏడ్వకు వసుధార, ఇంతకన్నా పెద్ద కష్టం వచ్చినా నువ్వు ఏ రోజు అధైర్య పడలేదు అంటాడు. వసు తాను కష్టంలో ఉన్నా, చిత్ర పరిస్థితి ఎలా ఉందో అని ఆరా తీస్తుంది. ట్రీట్మెంట్ జరుగుతుందని, చిత్ర కోలుకుంటే తప్ప, నీ మీద పడిన నింద తొలగిపోతుంది అని రిషి అంటాడు. దానికి వసు, తాను ఏ తప్పు చేయకపోయినా నింద పడితే చాలా బాధగా ఉంటుంది సర్ అంటుంది. గతంలో రిషి మీద తాను వేసిన నింద గురించి గుర్తు చేసుకుంటుంది. ఆరోజు తాను అలా చేసిందుకే, ఈరోజు తనకు ఇలా దేవుడు శిక్ష వేశాడు అని బాధపడుతుంది. తాను ప్రస్తుతం కేవలం నింద మాత్రమే మోస్తున్నానని, అప్పుడు మీరు నింద మోయడంతో పాటు, శిక్ష కూడా అనుభవించారు అని  క్షమాపణలు చెబుతుంది.

అయితే, గతాన్ని వదిలేయమని, ఆరోజు మీరు నన్ను కాపాడటానికే అలా చేశారు కదా అని నచ్చచెబుతాడు. తర్వాత లాయర్ తో మాట్లాడదామని రిషి ఫోన్ చేస్తాడు. లాయర్ తో మాట్లాడమని పోలీసులకు ఫోన్ ఇవ్వబోతాడు. కానీ, ఇలా ఫోనన్ లో చెబితే వదిలేయలేమని, బెయిల్ తీసుకురావాల్సిందే అని పోలీసులు ఖరాఖండిగా చెబుతారు. ఈలోగా మరో లాయర్ వచ్చి, వసుకి బెయిల్ తీసుకువస్తాడు. దీంతో, అన్నీ చెక్ చేసి, పోలీసులు వసును బెయిల్ మీద రిలీజ్ చేస్తారు. అనుపమ ఈ బెయిల్ తీసుకువచ్చిందనే విషయం అర్థమౌతుంది.

స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి అనుపమ బయటే ఉంటుంది. మహేంద్ర థాంక్స్ చెబుతాడు. తాము చాలా ప్రయత్నించినా వసుకి బెయిల్ కి రాలేదని, మీ లాయర్ ఆ సమయంలో వచ్చి సహాయం చేశాడని చెబుతాడు.  రిషి కూడా థాంక్స్ చెబుతుంది. అయితే, వసు తన జగతి శిష్యురాలు అని చెప్పారు కాబట్టే బెయిల్ ఇప్పించానని, వసు జగతి ప్రతిరూపం అని, వసుధార తప్పు చేయదని మీరు నమ్ముతున్నారు కాబట్టే బెయిల్ ఇప్పించానని చెబుతుంది.  అక్కడ కూడా జగతిని పొగడుతూ, వసుధార తక్కువ చేసినట్లుగా అనుపమ మాట్లాడుతుంది. ఆ విషయంలో రిషికి బాగా కాలుతుంది. మీకు మా అమ్మ అంటే బాగా ఇష్టం అని మాకు తెలుసు అని, అయితే, ఎదుటివారిని తక్కువ చేయద్దు అంటాడు. దానికి అనుపమ తానేమీ తక్కువ చేయడం లేదని, తన తప్పు ఏమీ లేదని నిరూపించుకోమని చెబుతున్నాను అంటుంది.

Guppedantha Manasu Serial Today:25th November 2023 Rishi, Mahindra Rebuke Anupama ram

ఇక, చిత్ర అలా ఉన్నందుకు తమకు బాధగా ఉందని రిషి అంటాడు. దీని వెనక ఉన్న కుట్ర ఏంటో తాను బయటపెడతాను అంటాడు. వసుధార ఏ తప్పు చేయలేదని, జరిగిన దాంట్లో తన ప్రమేయం లేదని నేను నిరూపిస్తాను అని రిషి అంటాడు. బెయిల్ నుంచి బయటకు వచ్చినవారు అందరూ నిర్దోషులు అవ్వరు అని అనుపమ అంటే, జైలుకు వెళ్లిన వచ్చినవారందరూ దోషులు కాదు అని రిషి అంటాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios