Guppedantha Manasu Serial Today: రిషిని ప్రశ్నలతో వేధించిన అనుపమ, శైలేంద్రను ఉతికి ఆరేసిన ధరణి..!
ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఎవరికీ కాంటాక్ట్ లో లేను. ఆ ఒట్టు మీద గౌరవం ఉంచబట్టే ఇంతకాలం నేను ఏమీ అడగలేదు. కానీ, ఇప్పుడు జగతి లేదు అందుకే అడుగుతున్నాను’ అని అనుపమ అంటుంది.

Guppedantha Manasu Serial Today:నిన్నటి ఎపిసోడ్ లో అనుపమ మహేంద్ర ఇంటికి వెళ్లి,జగతి గురించి ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే. అదే సీన్ కంటిన్యూ అవుతుంది. ‘జగతి నీతో ఉంటే నూరేళ్లు సంతోషంగా ఉంటుందని నీతో పెళ్లి చేస్తే, నువ్వేం చేశావ్? జగతిని కష్టపెట్టావ్. జగతిని నడిరోడ్డు మీద నిలపెట్టేశావ్’ అని అనుపమ మహేంద్ర పై అరుస్తూ ఉంటుంది. మహేంద్ర కూడా గట్టిగా స్టాప్ ఇట్ అనుపమ అంటాడు. సరిగ్గా అప్పుడే రిషి, వసులు వచ్చేస్తారు. వాళ్లు వచ్చింది చూసుకోకుండా అనుపమ మహేంద్రను ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది.‘ ప్రేమించిన అమ్మాయిని అలా ఎలా దూరం పెట్టావ్? అలా ఎలా వేధిస్తావ్? తాను బతికున్నప్పుడు బాధపెట్టి, చనిపోయిన తర్వాత నువ్వు బాధపడుతున్నావా? జగతి కలల్ని, సంతోషాలన్నింటినీ నువ్వు చిదిమేశావ్. చివరకు జగతి చనిపోయేలా చేశావ్’ అంటుంది. ఆ మాటకు మహేంద్రకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అని వార్నింగ్ ఇస్తాడు.
సరిగ్గా, అప్పుడే రిషి వచ్చి మధ్యలో జోక్యం చేసుకుంటాడు. ఒకరినొకరు పలకరించుకుంటారు. జగతి ప్రాణం పోవడానికి కారణం నేనే అని అనుపమ అంటోందని, అది తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని మహేంద్ర రిషితో చెప్పుకుంటాడు. అప్పుడు రిషి, అనుపమతో.. ‘మా అమ్మ ఎలా చనిపోయిందో మీకు చెప్పాను కదా’ అంటాడు. ‘చెప్పావ్ కానీ, జగతి అంటే నాకు ప్రాణం. తన సంతోషమే నా సంతోషం అనుకొనేదాన్ని, వీరిద్దరూ ప్రేమించుకున్నారని,వారికి పెళ్లిచేసి నేను దూరంగా వెళ్లిపోయాను. కొన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని తెలిసి నేను జగతికి ఫోన్ చేశాను. ఆ రోజు జగతి నాతో ఏమందంటే, నువ్వు మా పెళ్లి చేశావ్. కానీ మా బంధం నిలపెట్టడం నీ తరం కాదు. ఈ విషయంలో నువ్వు మహేంద్రను ఏమీ అనొద్దు. అంటే, నా మీద ఒట్టు అని జగతి ఒట్టుపెట్టుకుంది. అందుకే, నేను అప్పుడు మహేంద్రను ఏమీ అడగలేదు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఎవరికీ కాంటాక్ట్ లో లేను. ఆ ఒట్టు మీద గౌరవం ఉంచబట్టే ఇంతకాలం నేను ఏమీ అడగలేదు. కానీ, ఇప్పుడు జగతి లేదు అందుకే అడుగుతున్నాను’ అని అనుపమ అంటుంది.
కానీ, మహేంద్ర బాధగా లోపలికి వెళ్లిపోతాడు. వెంటనే రిషి కూడా మహేంద్ర వెంట వెళతాడు. ఈలోగా వసుధార అనుపమను టీ, కాఫీ తీసుకుంటారా అని అడిగితే, భోజనం చేయమని అడగరా అంటుంది. దాంతో, వసు భోజనం చేసే వెళ్లండి మేడమ్ అంటుంది. దానికి అనుపమ సరే అంటుంది. అది విని శైలేంద్ర షాకౌతాడు. భోజనం చేసేవరకు నేను ఇక్కడే ఉండాలా? ఈలోగా ఎవరైనా చూస్తే నేను రిస్క్ లో పడతాను వెళ్లిపోవడమే బెటర్ అనుకుంటుంది. ఆలోగా శైలేంద్ర ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అను వసు చూసేలోగా, ముఖానికి నలుపు రంగు పూసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. శైలేంద్ర ఏమో అని అనుమానంతో వసు, వెంటనే ధరణికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్నాడా అని అడుగుతుంది. లేడు అనే సరికి వసులో కొన్ని అనుమానాలు మొదలౌతాయి.
ఆ తర్వాత ధరణి తన భర్త చాలా మారిపోయాడని, తనపై చాలా ప్రేమ చూపిస్తున్నాడని చెబుతుంది. మొదట్లో తాను కూడా నమ్మలేదని, కానీ ఇప్పుడిప్పుడే అర్థమౌతోందని చెబుతుంది. తన భర్తలో ఈ మార్పు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ధరణి పొంగిపోతుంది. మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటే చాలు మేడమ్ అని వసు అంటుంది. కానీ, ఆ విషయంలో వసుధారకు అనుమానం మాత్రం అలానే ఉండిపోతుంది.
మరోవైపు శైలేంద్ర ముఖానికి నలుపు రంగు పూసుకొని, తప్పించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆ బైక్ సరిగా పనిచేయదు. దీంతో, దానిని నెట్టుకుంటూ వెళుతూ ఉంటాడు. మధ్యలో ఒక రిపేర్ చేసే వ్యక్తి వచ్చి సహాయం చేస్తాను అంటాడు. దానికి రూ. వెయ్యి ఇవ్వమని అడుగుతాడు. శైలేంద్ర సరే అంటాడు. తీరా చూస్తే, కీ ఆన్ చేసి బైక్ స్టార్ట్ చేయమని చెబుతాడు. వెంటనే ఆన్ అవుతుంది. ఏం చేశావ్ అని అడిగితే, మీరు కీ ఆన్ చేయలేదు అని చెప్పడంతో శైలేంద్ర షాకైపోతాడు.
సీన్ మళ్లీ మహేంద్ర ఇంట్లో మొదలౌతుంది. రిషితో అనుపమ మాట్లాడుతూ ఉంటుంది. తాను ఏంజెల్ ఫ్రెండ్స్ అని రిషి చెబితే, జగతి, మహేంద్ర తాను మంచి ఫ్రెండ్స్ అని అనుపమ చెబుతుంది. ఇక తర్వాత రిషి అనుపమతో మాట్లాడతాడు. మీ కారణంగా మహేంద్ర బాధపడుతున్నాడని చెబుతాడు. కానీ, తాను జగతి కోసం మాట్లాడుతున్నానని అనుపమ చెబుతుంది. ఆ సమయంలోనే రిషి, తాను తన తండ్రి పడే బాధ చూడలేక వాళ్లిద్దరినీ కలిపానని చెబుతాడు.
అప్పుడే సరిగ్గా దేవయాణి చెప్పిన మాటలు అనుపమకు గుర్తుకు వస్తాయి.అప్పుడు నువ్వు జగతిని ఏమని పిలిచేవాడివి అని అనుపమ అడగగా, చాలా ఇబ్బంది పడుతూ మేడమ్ అని పిలిచేవాడిని అని రిషి చెబుతాడు. అమ్మని ఎవరైనా మేడమ్ అని పిలుస్తారా అని అనుపమ ప్రశ్నిస్తుంది. తన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగానే, అమ్మతో ఉన్న దూరం కారణంగా తాను అలా పిలవాల్సి వచ్చింది అని రిషి చెబుతాడు. అయితే, అనుపమ మాత్రం గుచ్చిగుచ్చి మరీ నువ్వు తప్పు చేశావ్ అంటుంది. దానికి రిషి కూడా అంగీకరిస్తాడు. తాను తప్పు చేశానని, అన్నీ అర్థం చేసుకొని తాను మారిపోయిన తర్వాత వాళ్ల అమ్మ దూరం అయిపోయిందని రిషి బాధపడతాడు.
అయితే, అనుపమ మాత్రం నువ్వు ఇదొక తప్పే చేశావా? ఇంకేమైనా తప్పు చేశావా అని అడుగుతుంది. దానికి రిషి, మీ మాటలు చాలా కఠినంగా ఉన్నాయని, మీ మాటలు నన్నే ఇంతలా ఇబ్బంది పెడుతున్నాయని, మా నాన్నని ఇంకా ఎక్కువ బాధపడతాయో అర్థమౌతోందని అంటాడు. కుదిరితే, మా డాడ్ ని బాధ నుంచి బయటపడేయండి అంతేకానీ, బాధ పెట్టకండి అని కోరుకుంటాడు. అయితే, మరోవైపు అనుపమ బాధను కూడా రిషి అర్థం చేసుకుంటాడు.
ఈలోగా వసుధార వచ్చి మళ్లీ కాఫీ,టీ ఏం కావాలి అని అడిగితే, కాఫీ తాగుతాను అంటుంది. ఆ కాఫీ కూడా తానే కలుపుకుంటానని అనుపమ చెప్పడంతో, వసు కిచెన్ లోకి తీసుకువెళ్తుంది. ఇక, శైలేంద్ర ఆ మాసిన ముఖంతో ఇంటికి చేరుకుంటాడు. అయితే, శైలేంద్రను చూసి ధరణి కూడా గుర్తుపట్టదు. తోసుకుంటూ వెళ్లిపోతాడు. ధరణి నిజంగా దొంగ అనుకొని చీపిరి తీసుకొని పిచ్చి కొట్టుడు కొడుతుంది. తర్వాత శైలంద్ర తానేని ముఖం తుడుచుకొని మరీ చెబుతాడు. దొంగ అనుకొని కొట్టానని ధరణి క్షమాపణలు చెబుతుంది. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. భర్తను కొట్టినందుకు చాలా ఫీలౌతుంది.