Guppedantha Manasu Serial Today: వసుధారను విలన్ చేస్తూ, అనుపమ మెదడులో విషం నింపిన శైలేంద్ర..!
ఇక్కడికి ఎందుకు వచ్చిందని, ఏం తెలుసుకుంటుందని కంగారు పడతాడు. వెంటనే దూరం నుంచి అనుపమ ఫోటోలు తీస్తాడు. అనపమతో మాట్లాడిన స్టాప్ ని పిలిచి, ఎవరు, ఏం మాట్లాడారని శైలేంద్ర ఆరా తీస్తాడు.

Guppedantha Manasu Serial Today: ఈ రోజు ఎపిసోడ్ లో అనుపమ డీబీఎస్టీ కాలేజీ లో అడుగుపెడుతుంది. జగతి ని ఎవరు చంపారో తెలుసుకోవాలని ఆమె నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కాలేజీ దగ్గర నుంచే తన పని మొదలుపెడుతుంది. కాలేజీ కి వెళ్లగానే, కొందరు స్టాఫ్ కనపడగానే వారితో మాట్లాడుతుంది. మహేంద్ర ఎక్కడ ఉన్నాడని అడిగితే, ఆయన ఈ మధ్య కాలేజీకి రావడం లేదని వారు సమాధానం ఇస్తారు. ఎందుకు అని అనుపమ ప్రశ్నించగా, జగతి మేడమ్ చనిపోయినదగ్గర నుంచి బాగా డిస్టర్బ్ అయ్యారని, అందుకే రావడం లేదని చెబుతారు. మీరు ఎవరు అని వారు ప్రశ్నించగా, తన పేరు అనుపమ అని, జగతి ఫ్రెండ్ అని చెబుతుంది. జగతి మేడమ్ ఎండీగా ఉన్నప్పుడు చాలా బాగా చేసేవారు ఆ స్టాఫ్ అనుపమకు చెబుతారు. ఇప్పుడు ఎండీ ఎవరు అంటే, వసుధార అని చెబుతారు. జగతి హత్య గురించి కూడా అనుపమ ఆరా తీస్తుంది. ఆ సమయంలో దూరం నుంచి శైలేంద్ర చూసేస్తాడు. అనుపమను గుర్తుపట్టేస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చిందని, ఏం తెలుసుకుంటుందని కంగారు పడతాడు. వెంటనే దూరం నుంచి అనుపమ ఫోటోలు తీస్తాడు. అనపమతో మాట్లాడిన స్టాప్ ని పిలిచి, ఎవరు, ఏం మాట్లాడారని శైలేంద్ర ఆరా తీస్తాడు.
ఆ తర్వాత వెంటనే వాళ్ల అమ్మ దేవయాణికి ఫోన్ చేసి, అనుపమ ఫోటో పంపానని చెబుతాడు. తను కాలేజీకి వచ్చిందని చెబుతాడు. పిన్ని చావు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోందని చెబుతాడు. దీంతో,దేవయాణి ప్లాన్ వేస్తుంది. అనుపమను తమ ఇంటికి తీసుకురమ్మని సలహా ఇస్తుంది. వెంటనే వెళ్లి శైలేంద్ర, అనుపమతో మాట కలుపుతాడు. వెంటనే వాళ్ల అమ్మతో మాట్లాడమని ఫోన్ చేసి ఇస్తాడు. ఇక, దేవయాణి కాసేపు కుశల సమాచారం అడిగిన తర్వాత, ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. అయితే, అనుపమ తాను రిషి, వసులను కలవడానికి వచ్చానని రానని చెబుతుంది. కానీ, దేవయాణి వదలదు. జగతి గురించి చాలా విషయాలు చెప్పాలని అంటుంది. జగతి గురించి చెబితే, అనుపమ కచ్చితంగా వస్తుందని దేవయాణికి తెలుసు. అందుకే, ఆ పాయింట్ స్ట్రెస్ చేసి మరీ చెబుతుంది. దేవయాణి మాటలకు అనుపమ కూడా ఆలోచనలో పడుతుంది. కానీ, తాను వసు, రిషితో మాట్లాడిన తర్వాత వస్తాను అని చెబుతుంది. అయితే, వాళ్లిద్దరూ ఈ రోజు కాలేజీకి రారని, మీటింగ్ కి వెళతారని చెబుతారు.
కానీ, అదే సమయానికి రిషి, వసులు కారులో కాలేజీకి వస్తారు. ఆ విషయం తెలియని అనుపమకు అబద్దాలు చెప్పి, శైలేంద్ర ఇంటికి తీసుకొని వెళతాడు. వాళ్లు అలా వెళుతుండగానే, రిషి వసులు ఎదురుగా వస్తూ ఉంటారు. అది శైలేంద్ర చూసేస్తాడు. వెంటనే అనుపమ కంట పడకుండా డైవర్ట్ చేసేస్తాడు. జగతి ఫోటో దగ్గరకు అనుపమను తీసుకొని వెళతాడు. ఆమెను అలా డైవర్ట్ చేసేలోగా, రిషి, వసులు లోపలికి వెళ్లిపోతారు. దీంతో వెంటనే అనుపమను తీసుకొని బయటకు వచ్చేస్తాడు. డైరెక్ట్ గా తమ ఇంటికి తీసుకొని వెళతాడు. ఇంట్లో దేవయాణి వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆలోగా శైలేంద్ర, అనుపమను తీసుకొని వచ్చేస్తాడు.
దేవయాణి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత కూర్చోమని అడుగుతుంది. అనుపమ కూర్చున్న తర్వాత ధరణిని పిలిచి, కాఫీ తెప్పిస్తుంది. ఆ తర్వాత జగతి ప్రస్తావన వస్తుంది. తాను జగతిని కన్నకూతురిలా చూసుకున్నానని ఏవేవో అబద్దాలు చెబుతుంది. కానీ, అనుపమ అవి నమ్మడానికి ఇష్టపడదు. ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. కుటుంబంలో తేడాలు వచ్చి, భర్త, కొడుకును వదిలేసి వెళ్లిపోయిందని చెబుతుంది. నెమ్మదిగా మహేంద్ర టాపిక్ తీసుకువస్తుంది. అనుపమ మెదడులో మహేంద్ర గురించి నెగిటివ్ గా,పాయిజన్ లా నింపడం మొదలుపెడుతుంది. మహేంద్ర అసలు జగతిని పట్టించుకోలేదని చెబుతుంది. నిజం తెలియని అనుపమ, అవి నమ్మడం మొదలుపెడుతుంది. ఆ విషయాలన్నీ నమ్ముతోందని అర్థం కాగానే, ఇక ఒకటి తర్వాత మరొకటి ఎక్కించడం మొదలుపెడుతుంది.
ఇక,జగతి ఎలా చనిపోయింది అని అనుపమ అడుగుతుంది. రిషిని చంపబోతుంటే, జగతి అడ్డు తగిలిందని, అందుకే చనిపోయిందని చెబుతుంది. అందులో కూడా నిజం లేదు అని నమ్మేలా మాట్లాడుతుంది. అసలు అక్కడ ఎం జరిగిందో ఎవరికీ తెలీదని, రిషి,వసుధార, జగతి మాత్రమే అక్కడ ఉన్నారని, వాళ్లు చెప్పింది మేం నమ్మాం అని దేవయాణి చెబుతుంది. జగతి ఎండీ అయినప్పటి నుంచి ఆ సీటు కోసం చాలా గొడవలు జరిగాయని, చాలా సార్లు ప్రమాదాలు ఎదురయ్యాయి అని ఇలా చాలా అబద్ధాలు అనుపమకు శైలేంద్ర చెప్పడం మొదలుపెడతాడు. ఎండీ సీటు కోసం వసుధారే, జగతిని చంపించింది అని చెప్పకపోయినా, అదే అర్థం వచ్చేలా శైలేంద్ర చెబుతాడు. అయితే, అక్కడే అనుపమకు అనుమానం వస్తుంది. మీరు ఎప్పుడూ ఎండీ సీటు కావాలని అనుకోలేదా అని శైలేంద్ర అడుగుతుంది.తనకు ఆ ఆలోచన రాలేదని, అంత పెద్ద పదువులు తాను మోయలేదని చెబుతారు. ఎండీ అయిన తర్వాతే జగతికి కష్టాలు ఎదురయ్యాయని, జగతిపై చాలా కుట్రలు చేశారని చెబుతారు. ఇవన్నీ చూస్తుంటే, అనుపమ నమ్మేలానే కనపడుతోంది. మరి, ఈ విషయంలో అనుపమ నిజాలు ఎలా తెలుసుకుంటుందో చూడాలి.