Brahmamudi serial Today: రాహుల్ మరో కన్నింగ్ ప్లాన్, కళ్యాణ్ పెళ్లి, అప్పూ కంట కన్నీరు..!
ఈ మనస్పర్థలు అన్నీ పోయి అందరూ సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో ఏదైనా శుభాకార్యం జరగాలని అంటాడు. అయితే, కళ్యాణ్ పెళ్లి జరిపిద్దామని చిట్టి చెప్పడంతో అందరూ ఒకే అని చెప్పేస్తారు.

Brahmamudi: ఇప్పటికే ఆస్తి తమ పేరు మీద రాయలేదని తెలిసి రుద్రాణి కుళ్లుకుంటూ ఉంటుంది. మరోవైపు రాహుల్ స్వప్నను ఎలా వదిలించుకోవాలా అని చూస్తూ ఉంటాడు. ఇక, కావ్య కూడా రాజ్ మనసు మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి, ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
నిన్నటి ఎపిసోడ్ లో సీతారామయ్యను చూసేందుకు డాక్టర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ డాక్టర్ శుభవార్త తెలియజేస్తారు. సీతారామయ్య ఆరోగ్యానికి ఢోకా లేదని, ఆయన సంతోషంగా చూసుకుంటే చాలు అని చెబుతారు. ఆ మాటకు చిట్టి చాలా సంతోషిస్తుంది. ఆయన కోరుకున్నదే డాక్టర్ కూడా చెప్పారు అని సంబరపడుతుంది. కుటుంబ సభ్యులతా ఈ మాట విని సంతోషపడతారు. ఇక, డాక్టర్ నేను వెళ్లి వస్తాను అని చెబుతాడు. అయితే, కావ్య భోజనం చేసి వెళ్లమని కోరుతుంది. దీంతో, ఆయన తనకు కాన్ఫరెన్స్ ఉందని, కుదరదు అని చెప్పి సెలవు తీసుకొని వెళ్లిపోతాడు.
ఇక, డాక్టర్ చెప్పింది వినమని రాజ్ వాళ్ల తాతయ్యని కోరతాడు. ఇక సీతారామయ్య కూడా అందరూ తాను చెప్పిన మాట వినాలని చెబుతాడు. ఇంట్లో కొన్ని పొరపాట్లు జరిగాయాని( స్వప్న కడుపు మ్యాటర్) అయితే, ఆ పొరపాట్లనే పట్టుకొని గొడవలు పెద్దవి చేయకుండా అందరూ కలిసిపోవాలి అని కోరతాడు. ఈ మనస్పర్థలు అన్నీ పోయి అందరూ సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో ఏదైనా శుభాకార్యం జరగాలని అంటాడు. అయితే, కళ్యాణ్ పెళ్లి జరిపిద్దామని చిట్టి చెప్పడంతో అందరూ ఒకే అని చెప్పేస్తారు.
మరోవైపు, అప్పూ భోజనం చేయడం లేదంటే, వాళ్ల పెద్దమ్మ తినిపిస్తుంది. అంతలో కనకానికి కావ్య ఫోన్ చేస్తుంది. తాతయ్య ఆరోగ్యం నయం అవుతుందని డాక్టర్లు చెప్పారనే విషయాన్ని కావ్యకు చెబుతుంది. ఇదే విషయాన్ని కనకం తమ కుటుంబ సభ్యులతో పంచుకుంటుంది. అదే సమయంలో కళ్యాణ్, అప్పూకి ఫోన్ చేస్తాడు. అప్పూ లిఫ్ట్ చేయదు. మరోసారి చేస్తాడు. అది కనకం చూసేస్తుంది. మళ్లీ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మరీ ఇస్తుంది. దీంతో, అప్పూకి మాట్లాడక తప్పదు. అర్జెంట్ గా కలవాలని అడుగుతాడు. అప్పుూ కుదరదు అని చెప్పినా, కనకం వెళ్లమని బలవంత పెడుతుంది.
ఇలా, అప్పూ కాల్ కట్ చేయగానే కళ్యాణ్ అనామిక కు కూడా ఫోన్ చేస్తాడు. వెంటనే కలవాలి అని, గుడ్ న్యూస్ చెబతానని అంటాడు.
తాతయ్య ఆరోగ్యం కుదుట పడుతుందని డాక్టర్ చెప్పడంతో రాజ్ ఆనందంలో ఉంటాడు. అప్పుడే వచ్చి కావ్య పక్కన కూర్చుంటుంది. ఇద్దరూ కాసేపు ఎప్పటిలాగానే కీచులాడుకుంటూ ఉంటారు. సంతోషాన్ని కలిసి పంచుకోవాలి అని కావ్య సలహా ఇస్తుంది. అయితే, రాజ్ మాత్రం తన ఆనందాన్ని పరాయి వాళ్లతో పంచుకోను అంటాడు. తాను పరాయి కాదని, కట్టుకున్న భార్య అని చెబుతాడు. కట్టుకోవడం, ఆకట్టుకోవడం మీ అక్క చెల్లెళ్లకు బాగా తెలుసులే అని రాజ్ సెటైర్ వేస్తాడు. స్వప్న టాపిక్ తేవడంతో చిరాకు పడుతుంది కావ్య. ఇక, కావ్య మాట్లాడదామని మీతో వచ్చానని, పోట్లాడటానికి కాదు అని ఏదో చెప్పబోతున్నా రాజ్ వినిపించుకోడు.
దీంతో, తాతయ్య సంతోషంగా ఉండాలి అంటే, మనం కూడా సంతోషంగా ఉండాలని, ప్రేమించుకోవాలి అని చెబుతుంది. మొగుడు,పెళ్లాలు ప్రేమించుకుంటే ప్రేమ రాలుతుందని కావ్య చాలా చెబుతుంది. కుటుంబం మొత్తం కలిసి తాతయ్యను సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారని, అందుకు తమ వంతు చేయాలని అడుగుతుంది. కానీ, రాజ్ నువ్వు అసలు మా కుటుంబమే కాదు అంటాడు. దీంతో, ఈ కావ్య రివర్స్ అవుతుంది. ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తానని అంటుంది. నన్నే బ్లాక్ మొయిల్ చేస్తున్నావా అని రాజ్ అడుగుతాడు. కాదని, మన మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా తాతయ్య బాధపడకూడదని, దాని కోసం మనమిద్దదరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందామని చాలా కూల్ గా చెబుతుంది. కానీ రాజ్ మాత్రం ససమేరా అంటాడు. తాతయ్య కోసం తాను నటించగలను అంటాడు. ఇలా మంచిగా చెబితే రాజ్ వినడు అని అర్థం చేసుకున్న కావ్య తెలివిగా ఓ ప్లాన్ వేస్తుంది. మీరే కాదు నేను కూడా నటించగలను అని, నేను నటిస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని కౌంటర్ వేసి వెళ్తుంది. కావ్య ఏం చేస్తుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లోనూ కలుగుతుంది. వెనక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. కావ్య వెళ్తూ వెళ్తూ రాజ్ కి ప్లయ్యింగ్ కిస్ ఇస్తుంది. అది చూసి రాజ్ షాకౌతాడు.
ఇక, ఇక్కడ సీన్ కట్ చేస్తే, స్వప్న అద్దం ముందు ముస్తామౌతూ ఉంటుంది. అది చూసి రాహుల్ మరో ప్లాన్ వేస్తాడు. స్వప్నను పెళ్లి చేసుకోవాలని ఆశపడిన డాక్టర్ అరుణ్ వివరాలు తెలుసుకొని, ఎలాగైనా స్వప్నను వదిలించుకోవాలని అనుకుంటాడు. దాని కోసం తల్లితో కలిసి ప్లాన్ వేస్తాడు. ఆ డాక్టర్ అరుణ్ కి డబ్బు అవసరం ఉందని, అతని కి సహాయం చేసి, ఆ తర్వాత అతని ద్వారా స్వప్నను ఇంటి నుంచి వెళ్ల గొట్టాలని రాహుల్ ప్లాన్ వేస్తాడు.
ఇక, అప్పూ, కళ్యాణ్, అనామిక ఒకచోట కలుసుకుంటారు. ఆ సమయంలో కళ్యాణ్ శుభవార్త చెబుతాడు. తాతయ్య ఆరోగ్యం సెట్ అవుతుందని, ఇంట్లో శుభకార్యం చేయాలని అనుకుంటున్నారని అసలు విషయాన్ని చెప్పేస్తాడు. ఈ విషయం విని, అనామిక చాలా సంతోష పడుతుంది. వెంటనే కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. పెళ్లి వార్త విని అప్పూ అప్ సెట్ అవుతుంది. ఇక, తన కళ్లముందే అనామిక కళ్యాణ్ ని హగ్ చేసుకోవడం చూసి షాకౌతుంది. అప్పూ కళ్ల వెంట నీళ్లు వచ్చేస్తాయి. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తయ్యింది.
ఇక, రేపటి ఎపిసోడ్ లో కావ్య తన ప్లానింగ్ మొదలుపెడుతుంది. రాజ్ తో చేసిన ఛాలెంజ్ ని అప్లై చేయడం మొదలుపెడుతుంది. హాల్ లో బోర్డు మీద సారీ కళావతి అని తానే రాసి, రాజ్ రాసినట్లు నమ్మిస్తుంది. అది చూసి అందరూ రాజ్ నిజంగా రాశాడు అని అనుకొని అతనిపై ప్రశ్నలు కురిపిస్తారు. ఈ తతంగం రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..