Brahma Mudi serial Today నవంబర్ 16 ఎపిసోడ్ : కనకం ముందు బయటపడిన అప్పూ ప్రేమ, ఇరకాటంలో స్వప్న..!
ఇక్కడ కూడా కావ్య తన బాధ చెప్పుకుందా లేక, ఇంట్లో వాళ్లను తిట్టిందా? తన బుర్ర గిరగిరా తిరిగేలా చేసిందా అని అర్థంకాక అయోమయంలో పడిపోతాడు. ఏం మాయ చేసిందా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు.

Brahma Mudi Today: నిన్నటి ఎపిసోడ్ లో కావ్య అందరిముందు రాజ్ ని ఇరికించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని గదిలోకి రాగానే రాజ్ ఇలా ఎందుకు చేశావ్ అని అడుగుతాడు. దానికి కూడా కావ్య కొంటెగా, తనకు ఏమీ తెలియనట్లుగా నటిస్తూ అమాయకంగా తన వంట గురించి సమాధానం చెబుతూ ఉంటుంది. దీంతో రాజ్ స్మార్ట్ గా మాట్లాడకు అంటాడు. దీంతో, కావ్య దానికి కూడా మురిసిపోతుంది. నేను నిజంగా స్మార్ట్ గా ఉంటానా అంటూ వయ్యారాలు పోతుంది. దీంతో రాజ్, హే ఆపు అంటూ సీరియస్ అవుతాడు. నేను నీకు సారీ చెబుతానని ఎలా అనుకున్నావ్ అంటూ సీరియస్ గా అడుగుతాడు. దానికి కావ్య ఏవేవో మాట్లాడుతుంది. చిర్రెత్తుకొచ్చిన రాజ్ చంపుతా అంటే, నేను చచ్చిన తర్వాత నా సమాధి దగ్గర సారీ బోర్డు పెడతారా అని అమాయకంగా అడుగుతుంది. దీంతో, రాజ్ అసహనంగా ఏంటి ఈ డ్రామా అని అడుగుతాడు.
అప్పుడు కావ్య అసలు విషయం చెబుతుంది. తాను నాటకం ఆడుతున్నానని క్లారిటీ ఇస్తుంది. తాను నటిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రమే ఇలా చేశాను అని చెబుతుంది. వాళ్ల అక్క చేసిన పనికి తాను దోషిగా నిలపడ్డానని వాపోతుంది. భారీ, భారీ డైలాగులతో, పద్మ వ్యూహం, శత్రు పక్షం, కురక్షేత్రం, కర్ణుడు అంటూ ఏవేవో పదాలు వాడుతూ తన బాధ మొత్తం రాజ్ కి అర్థమయ్యేలా చెబుతుంది. ఇక, తాను ఏ తప్పు చేయలేదని, తన అక్క చేసిన తప్పు తెలిసినా కూడా, నిజం బయటపెట్టకుండా దాచిపెట్టడం మాత్రమే తాను చేసిన తప్పు అని , మీ అమ్మగారి దృష్టిలో నేరం అని రాజ్ కి చెబుతుంది. తన స్థానం కోసం, ఉనిఖి కోసం తాను యుద్ధం చేస్తున్నట్లు చెబుతుంది. ఇక, తాతయ్య ఆరోగ్యం కోసం ఆయనను సంతోషపెట్టడానికి, అందరూ నమ్మడానికి ఇలా నాటకం ఆడానని చెబుతుంది. ఇక,రాజ్ ప్రమేయం లేకుండా సారీ అని రాసినందుకు కావ్య సారీ చెబుతుంది. రాజ్ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. దీంతో, కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇక్కడ కూడా కావ్య తన బాధ చెప్పుకుందా లేక, ఇంట్లో వాళ్లను తిట్టిందా? తన బుర్ర గిరగిరా తిరిగేలా చేసిందా అని అర్థంకాక అయోమయంలో పడిపోతాడు. ఏం మాయ చేసిందా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు.
ఇక, రాహుల్ తాను అనుకున్న పనిని మొదలుపెడతాడు. స్వప్నను ఇరకాటంలో పెట్టేందుకు స్వప్నకు ఓ కొరియర్ వచ్చేలా చేస్తాడు. కన్ఫర్మేషన్ కోసం అరుణ్ కి ఫోన్ చేసి మరీ అడుగుతాడు. అరుణ్ తాను కొరియర్ చేశాను అని చెప్పిన క్షణమే, డెలివరీ బాయ్ వచ్చి కొరియర్ ఇచ్చి వెళతాడు. ఆ కొరియర్ ని ధాన్య లక్ష్మి అందుకుంటుంది. ఆ కొరియర్ ని ధాన్యలక్ష్మి ఓపెన్ చేయబోతుండగా, కుక్కర్ విజిల్ రావడంతో ధాన్యలక్ష్మి కిచెన్ లో పని ఉందని వెళ్లిపోతుంది. దీంతో, ఆ కొరియర్ ని అపర్ణ తెరవబోతూ ఉంటుంది. ఆ సమయంలో సుభాష్.. అపర్ణను పిలుస్తాడు. ఇక, అపర్ణ కూడా దానిని తెరవకుండా ఇంటి పెద్ద చిట్టి కి ఇచ్చి వెళ్లిపోతుంది. ఆమె తెరచి చూస్తుంది. దాంట్లో స్వప్న ఫోటోలు ఉంటాయి.
అరుణ్ తో కలిసి కాలేజీలో స్వప్న దిగిన ఫోటోలు అవి. అవి చూసి స్వప్న షాకౌతుంది. విషయం ఏంటో తెలీకుండా, ఇంట్లో అందరికీ చెప్పడం మంచిది కాదు అని అనుకుంటుంది. ఈ విషయం గురించి స్వప్నను అడగాలని అనుకుంటుంది. ఈలోగా అపర్ణ వచ్చి, ఏముంది ఆ కొరియర్ లో అని అడిగితే, అబద్ధం చెప్పి, దానిని తీసుకొని వెళ్లిపోతుంది. చిట్టి ఇలా అబద్ధం చెప్పడం చూసి రాహుల్ అయోమయంలో పడతాడు.
ఈలోగా, చిట్టి ఆ ఫోటోలను తీసుకొని స్వప్న దగ్గరకు వెళుతుంది. ఏంటి అమ్మమ్మ అని స్వప్న అడుగుతుంది. దీంతో, చిట్టి తన దగ్గర ఉన్న ఫోటోలను స్వప్నకు చూపించి ఈ అబ్బాయి ఎవరు అని అడుగుతుంది. ఇతను నీకు తెలుసా అని అడుగుతుంది. దీంతో, ఏమీ తెలియనట్లు స్వప్న నాటకం ఆడుతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియరు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఈ ఫోటో కొరియర్ లో వచ్చిందని, నీ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. స్వప్న అబద్ధం చెబుతుందా లేక, ఆ ఫోటోలు అబద్దమా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక, ఇదే విషయంపై రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. చిట్టిలో అనుమానం మరింత పెంచేలా చేయాలని, అప్పుడే ఈ విషయంలో మనం సక్సెస్ అవుతాం అని ఫిక్స్ అవుతుంది. ఇక, స్వప్న, వెంటనే అరుణ్ కి ఫోన్ చేస్తుంది. అతను మాత్రం లిఫ్ట్ చేయడు. దీంతో, ఎలాగైనా తెలుసుకోవాలని స్వప్న ఫిక్స్ అవుతుంది.
మరోవైపు కనకం, అప్పూ గదిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కళ్యాణ్ ఫోటో కనపడుతుంది. దాని మీద అప్పూ ఐలవ్ యూ అని రాసి ఉండటాన్ని చూసేస్తుంది. అప్పూ ప్రేమ విషయం కనకానికి అర్థమైపోతుంది. ఆవేశంగా అప్పూ అని పిలుస్తుంది. కళ్యాణ్ ని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగి, ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తుంది. మధ్యలో వాళ్ల పెద్దమ్మ వచ్చి అడ్డుకుంటుంది. అప్పూ కళ్యాణ్ ని ప్రేమిస్తున్న విషయం తనకు ముందే తెలుసు అని వాళ్ల పెద్దమ్మ చెప్పడంతో కనకం షాకౌతుంది. తెలిసి నాకు ఎందుకు చెప్పలేదు అని కనకం అడిగితే, ఇలా కొడతావనే భయంతోనే చెప్పలేదు అంటుంది. అందరు ఆడపిల్లలాగానే దానికి కూడా మనసు ఉంటుంది కదా అని వాళ్ల పెద్దమ్మ అంటే, ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను ఆ ఇంటికి పంపించానని చాలా మంది తిడుతున్నారని, ఇప్పుడు ఇది కూడా అదే ఇంటికి వెళతాను అంటుందని కనకం ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా అప్పూ తండ్రి అక్కడకు వచ్చి, కనకం ని అడ్డుకుంటాడు. కానీ, ఆయన ముందు ఈ విషయం బయటపడకుండా కనకం జాగ్రత్త పడుతుంది. ఏమైందని అడిగితే, అబద్ధం చెబుతుంది.
కమింగప్ లో.. అరుణ్ ఏకంగా దుగ్గిరాల ఇంటికి దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చి స్వప్నకు ఫోన్ చేస్తాడు. ఎందుకు ఫోటోలు పంపావ్ అని స్వప్న అడిగితే, ఏకంగా మీ ఇంటికే వచ్చాను అని చెబుతాడు. ఒకసారి బయటకు రమ్మని అడుగుతాడు. దీంతో, స్వప్న బయటకు వెళ్లి అరుణ్ తో మాట్లాడటం రాజ్ చూసేస్తాడు.