Asianet News TeluguAsianet News Telugu

Brahmamudi Serial Today: అరుణ్ ని తప్పించిన రాహుల్, రాజ్ పై అక్రమ సంబంధం ఆరోపించిన కావ్య..!

 నర్స్ వచ్చి అరుణ్ రిజైన్ చేసి వెళ్లిపోయాడు అని చెబుతుంది. ఇందాకే లాస్ట్ గా వచ్చి వెళ్లిపోయాడు అని, అడ్రస్ , డీటైల్స్ కూడా ఏమీ లేవు అని నర్స్ చెబుతుంది. ఆ మాట విని కావ్యకు చిరాకు వస్తుంది.
 

Brahma Mudi Serial Today 30th November 2023 kavya Firmly Supports Swapna ram
Author
First Published Nov 30, 2023, 10:28 AM IST

Brahmamudi Serial Today: స్వప్న ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడానికి కావ్య, రాజ్ తో కలిసి అరుణ్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. ఆ సమయంలోనే కనకం ఫోన్ చేస్తుంది. స్వప్న కడుపు నాటకం మళ్లీ ఆడుతోందని కనకం అంటే, కాదని నిజంగానే తల్లికాబోతోందని కావ్య చెబుతుంది. అయితే, కనకం మాత్రం తాను చస్తే నమ్మను అంటుంది. కనకం అలా అంటుంటే, రాజ్ సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. మీ అమ్మ చాలా చక్కగా నిజాలు మాట్లాడతోంది.. బాగా విను అని రాజ్ తెగ  నవ్వేస్తూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం నిజంగానే అక్క కడుపుతో ఉంది అని చెప్పి, తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తుంది. రాజ్ మాత్రం ఆ కన్వర్జేషన్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. తనివితీరా నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని రాజ్ అడుగుతాడు. అయితే, కావ్య హాస్పిటల్ కి అంటుంది. హాస్పిటల్ కి ఎందుకు అంటే, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకోవడానికి అంటుంది. ఆ మాటతో  కంగారుపడిపోయిన రాజ్ వెంటనే కారు ఆపేస్తాడు. కానీ, తర్వాత వెళ్లేది అరుణ్ దగ్గరకు వెళ్తున్నాం అని చెబుతుంది. అరుణ్ ని కొట్టి, నిజం చెప్పించాలని అంటుంది. అరుణ్ ని కొట్టాల్సింది కూడా మీరే అంటూ రాజ్ కి చెబుతుంది. 

మరోవైపు కనకం తన అక్కతో స్వప్న నిజంగానే కడుపుతో ఉంది అని చెబుతుంది. ఆ సమయంలో కనకం కి క్రేజీ ఐడియా వస్తుంది. స్వప్న కడుపు అడ్డం పెట్టుకొని ఆ ఇంట్లో తిష్ట వేస్తానని, కళ్యాణ్ మనసు మార్చి, అప్పూతో పెళ్లి చేయిస్తా అంటుంది. అయితే, వాళ్ల అక్క మళ్లీ తనకు పాత కనకం కనపడుతోంది అని చెబుతుంది. తాను ఎప్పుడూ ఒకటే కనకం అని, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాను అని చెబుతుంది.

సీన్ కట్ చేస్తే, రాజ్ , కావ్యలు అరుణ్ ఉన్న హాస్పిటల్ కి వచ్చేస్తారు. ఆ సమయంలోనే రాహుల్, అరుణ్ తో మాట్లాడుతూ ఉంటాడు. నా కోసం కావ్య రావడం ఏంటి అని అరుణ్ భయపడుతుంటే, వాళ్ల అక్క మీద నిందలు వేస్తే రాకుండా ఎలా ఉంటుంది అని రాహుల్ అంటాడు. కావ్య వస్తుంది అనగానే అరుణ్ చాలా టెన్షన్ పడుతాడు. కావ్య కి  నేను ఎదురుపడితే నిజం చెప్పించేంత వరకు వదిలిపెట్టదని అంటాడు. అందుకే జాగ్రత్తపడమని సలహా ఇస్తున్నానని రాహుల్ చెబుతాడు. కావ్యకు దొరకకుండా ఉండమని చెబుతాడు.  ఇక్కడ స్టాఫ్ అందరికీ, నువ్వు ఈ హాస్పిటల్ లో మానేసి వెళ్లిపోయావని చెప్పమని చెప్పు అంటాడు. అదే సమయానికి కావ్య అరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఈలోగా రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అరుణ్ కూడా తన స్టాఫ్ కి నా గురించి ఎవరు అడిగినా నా అడ్రస్ చెప్పొద్దు అంటాడు. సరిగ్గా కావ్య వచ్చే సమయానికి అరుణ్ అక్కడ ఉండడు. నర్స్ వచ్చి అరుణ్ రిజైన్ చేసి వెళ్లిపోయాడు అని చెబుతుంది. ఇందాకే లాస్ట్ గా వచ్చి వెళ్లిపోయాడు అని, అడ్రస్ , డీటైల్స్ కూడా ఏమీ లేవు అని నర్స్ చెబుతుంది. ఆ మాట విని కావ్యకు చిరాకు వస్తుంది.

చేసేది లేక కావ్యను రాజ్ అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతాడు. రాజ్ ఆలస్యం చేయడం వల్లే ఇలా జరిగిందని రాజ్ పై కావ్య అరుస్తుంది. మళ్లీ ఎప్పటిలాగానే వీళ్లిద్దరూ కీచులాడుకుంటూ ఉంటారు. ఏవేవో కారణాలు చెప్పి,  ఏవేవో అనేస్తూ ఉంటుంది. ఏవేవో సంబంధం లేని మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటుంది. వీరి వాదన పూర్తైన తర్వాత ఇద్దరూ ఇంటికి మళ్లీ రిటన్ అవుతూ ఉంటారు. వాళ్లు అలా వెళ్లగానే  అరుణ్, రాహుల్  దాక్కొని బయటకు వచ్చేస్తారు. బయట తిరగకుండా ఎక్కడైనా దాక్కోమని కొంతకాలం పాటు అసలు బయటకు రాకుండా ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని రాహుల్ చెప్పి వెళ్లిపోతాడు. కానీ, అరుణ్ మాత్రం భయపడుతూనే ఉంటాడు. ఎలాగైనా కావ్య తనను పట్టుకునేలా ఉందని, బయటకు రాకుండా దాక్కోవాలని అనుకుంటాడు.

సీన్ కట్ చేస్తే, అలిగి వెళ్లిపోయిన అనామిక దగ్గరకు కళ్యాణ్ వస్తాడు. అయితే, అనామిక మాత్రం వెటకారంగా అప్పుడే వచ్చారా? ఈరోజంతా మీ ఫ్రెండ్ దగ్గరే ఉంటారని అనుకున్నానే అని మాట్లాడుతుంది. నీకు ఇంకా కోపం పోలేదా అని కళ్యాణ్ అడుగుతాడు. ‘నాది కోపం కాదు. బాధ. నువ్వు నీ ఫ్రెండ్ తో ఎలాగైనా ఉండు కానీ, నేను పక్కన ఉన్నప్పుడు నువ్వు నాకు ప్రయార్టీ ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా’ అని అనామిక ప్రశ్నిస్తుంది. తప్పు కాదని కళ్యాణ్ చెబుతున్నా వినకుండా, అప్పూ కోసం తనను కారులో గంట సేపు ఎదురు చూసేలా చేశావని సీరియస్ అవుతుంది. కళ్యాణ్ బతిమిలాడటం మొదలుపెడతాడు. అప్పుడు కూడా అప్పూ గురించే మాట్లాడతాడు. అప్పూని చూస్తే బాధేసింది అని. ఆ మాటకు అనామికకు మరింత కాలుతుంది. నన్ను చూస్తే బాధ అనిపించలేదా అని తిరిగి ప్రశ్నిస్తుంది. మనం ఎప్పుడూ పక్కనే ఉంటాం కదా అని కళ్యాణ్ అంటే, నేను పక్కనే ఉంటాను కాబట్టి నన్ను పట్టించుకోవా ? ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చులే అని అనుకుంటున్నావా అని అడుగుతుంది.

కళ్యాణ్ మాత్రం మనం ఇద్దరం ఒకటే అని, బాధలో ఉన్న ఫ్రెండ్ ని సపోర్ట్ చేయాలి కదా అంటాడు. దానికి అనామిక తనకి ఎవరు సపోర్ట్ చేస్తారని ప్రశ్నిస్తుంది. 24గంటలు అప్పూ భజనే చేస్తున్నావమని మండిపడుతుంది. నాకు కూడా బాధలున్నాయని అంటుంది. నీ బాధ ఏంటి అని కళ్యాణ్ అడిగితే, ఇప్పటి వరకు పెళ్లి డేట్ ఫిక్స్ చేయలేదని అంటుంది. తెలిసిన వాళ్లు అందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారని, అసలు పెళ్లి జరుగుతుందా;? ఆగిపోతుందా అని భయం వేస్తుందని అంటుంది. దానికి కళ్యాణ్ వెంటనే తాను  తన ఇంట్లో వాళ్లను పెళ్లికి ఒప్పిస్తానని చెబుతాడు. సంతోషించిన అనామిక వెంటనే వెళ్లి, కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది.

మరోవైపు  దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్ లో కూర్చొని టీ, కాఫీ తాగుతూ ఉంటారు. స్వప్న అక్కడే కూర్చొని మామిడి పండ్లు తింటూ ఉంటుంది. పని అమ్మాయిని చిటికేసి మరీ పలిచి తనకు జ్యూస్ కావాలని చెబుతుంది. లంచ్ , డిన్నర్ కి కూడా స్పెషల్ డిషెస్ కావాలని చెబుతుంది. రోజూ తనకు స్పెషల్ డైట్ కావాలని చెబుతుంది. అది విన్న రుద్రాణి వచ్చి రచ్చ చేయడం మొదలుపెడుతుంది. స్వప్న తింటున్న మామిడికాయను తీసి కిందపడేస్తుంది. తర్వాత పైకి లేమ్మని అరుస్తుంది. కానీ స్వప్న అంతే పొగరుగా కాలిమీద కాలు వేసుకొని కూర్చుంటుంది. దీంతో రుద్రాణి మరింత రెచ్చిపోతుంది.

‘చేసిన తప్పుడు పనికి ఓ మూలన ముసుగు వేసుకొని కూర్చోవాల్సిందిపోయి, దర్జాగా నడి ఇంట్లో కూర్చొని మహారాణి లా ఆర్డర్స్ వేస్తున్నావేంటి’ అంటుంది. స్వప్న మాత్రం మీరు కూడా రోజూ ఇదే చేస్తారు కదా అని పొగరుగా బదులిస్తుంది. ఆ మాటకు రుద్రాణికి మరింత కాలుతుంది. దారితప్పిన ఆడదానివని స్వప్న ని తిడుతుంది. తాను ఈ ఇంటి ఆడపడుచు అని గర్వంగా చెబుతుంది. కానీ స్వప్న మాత్రం ఆ హోదాలో మిమ్మల్ని ఎవరూ ఇక్కడ చూడటం లేదు అంటుంది. ఈ ఇంట్లో మీ పెత్తనం ఏంటి? ఆస్తి కూడా మీది కాదు కదా అని స్వప్న వరసగా ప్రశ్నలు వేస్తుంది. వీళ్ల పంచాయతీ మొదలవ్వగానే రాజ్ కావ్యలు వచ్చేస్తారు. ఇంట్లో అందరూ కూడా ఒకే చోట చేరిపోతారు.

అయితే, స్వప్న ను చిట్టి మందలిస్తుంది. అత్తగారి అంతస్తు గురించి అలా మాట్లాడకూడదని, రాహుల్ ని పెళ్లి చేసుకోకముందు ఇవి ఆలోచించాలి అని సలహా ఇస్తుంది. రుద్రాణి మాత్రం రెచ్చిపోతుంది. దీంతో, చిట్టి సీరియస్ అవుతుంది. కడుపుతో ఉన్న పిల్ల మీద తీండి విషయంలో కూడా పెత్తనం ఏంటి అని ప్రశ్నిస్తుంది. ఈలోపు రాహుల్, ఆ కడుపు గురించి మాట్లాడి తనను చిత్ర వధ చేయకండి అని, ఆ కడుపుకి తనకు సంబంధం లేదు అని మళ్లీ పాతపాటే పాడతాడు.

తప్పు చేశాను అంటే ఊరుకోనని స్వప్న తెగేసి చెబుతుంది. నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు అని రాహుల్ అంటే, నువ్వు చూసిన ఆడవాళ్లంతా పాసింగ్ క్లౌడ్స్ అని, నాలాగా స్థిరంగా ఉండే ఆడవాళ్లను ఎక్కడా చూసి ఉండవులే అని సెటైర్ వేస్తుంది. దొరికింది కదా అని రుద్రాణి స్వప్నను ఇంట్లో నుంచి బయటకు గెంటేయమని ఇంట్లో వాళ్లను అడుగుతుంది. రాహుల్ కూడా కొన్ని సెంటిమెంట్ డైలాగులు వాడి, స్వప్నను ఇంట్లో నుంచి గెంటేయమని చెబుతాడు.

అప్పుడు రాజ్ జోక్యం చేసుకుంటాడు. స్వప్నను ఇంట్లో నుంచి గెంటేయాలంటే అందుకు తగిన సాక్ష్యాలు కావల్సిందేనని అంటాడు. సాక్ష్యాలు చూపించం కదా అని రుద్రాణి అంటుంది.రుద్రాణి మాత్రం ఇప్పుడే గెంటేయాలని అంటుంది. స్వప్న కూడా ఊరుకోదు. రుజువు చేసిన తర్వాతే గెంటేయండి అంటుంది. ఆ తర్వాత అపర్ణ జోక్యం చేసుకుంటుంది. స్వప్న తాను ఏ పరీక్షకు అయినా సిద్ధంగా ఉన్నానని చెబుతోంది కాబట్టి, డీఎన్ఏ టెస్టు  చేయించండి అని తన భర్తని అడుగుతుంది. రోజూ ఇంట్లో  ఈ పంచాయతీ ఉండదు అని అపర్ణ అంటుంది.

అయితే, కనీసం నెలరోజులు కూడా ఆగకపోతే టెస్టు చేయలేం అని సుభాష్ అంటాడు. అది విన్న కావ్యకు చిరాకు పుడుతుంది. ఇంట్లో వాళ్లందరినీ ప్రశ్నిస్తుంది. తన అక్కని అలా నిలదీయడంపై కావ్య మండిపడుతుంది. ఎప్పటిలాగానే కావ్య ఆడది, తల్లి, వంశం అంటూ భారీ డైలాగులు కొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగ్ అప్ లో రాజ్ కి ఆఫీసులో శ్రుతి అనే అమ్మాయితో సంబంధం ఉందని కావ్య ఆరోపిస్తుంది. సాక్ష్యం  చూపించమని రాజ్ అడిగితే, ఒక ఫోటో చూపిస్తుంది. అది చూసి రాజ్ షాకౌతాడు. ఒక్క ఫోటో చూసి ఆడపిల్లపై నింద ఎలా వేస్తావ్ అంటాడు. దానికి కావ్య తన అక్కని మరి సాక్ష్యం ఎలా అడుగుతున్నారు అంటుంది. రాజ్ కి ఒక్క ఉదాహరణగా చెప్పి, తన అక్క తప్పు చేయలేదని కావ్య నిరూపించాలని అనుకుంటోంది, మరి ఈ సమస్యను కావ్య ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios