Asianet News TeluguAsianet News Telugu

Brahma Mudi Serial Today:తప్పు చేయలేదని నిరూపిస్తా, డీఎన్ఏ టెస్టుకి రెడీ అన్న స్వప్న, షాక్ లో రాహుల్

ఈలోగా రుద్రాణి స్వప్నను గది నుంచి బయటకు లాక్కొని వస్తుంది. గతంలో లాగే మళ్లీ నాటకం ఆడుతుందని, డాక్టర్ పై కూడా నింద వేస్తుంది. అయితే, డాక్టర్ మాత్రం గట్టిగా కౌంటర్ ఇస్తుంది. తాను చెప్పేది నిజం అని చెప్పేసి వెళ్లిపోతుంది.

Brahma Mudi Serial Today:25th November 2023 Swapna Berates Rahul ram
Author
First Published Nov 25, 2023, 10:17 AM IST


Brahma Mudi Serial Today: ఈరోజు ఎపిసోడ్ లోనూ స్వప్న పంచాయతీ నడుస్తూ ఉంటుంది. తాము వేసిన ప్లాన్ పక్కాగా వర్కౌట్ కావడంతో రుద్రాణి చెలరేగిపోతుంది. స్వప్న లాంటి ఆడది, ఇంతటి పవిత్రమైన ఇంట్లో ఉండటానికి వీలు లేదని, దానిని ఇంట్లో నుంచి గెంటివేస్తానని, ఎవరూ అడ్డు చెప్పడానికి వీలు లేదు అని ఇంట్లో వాళ్లతో రుద్రాణి చెబుతుంది. అందరూ అలానే షాకై ఉండిపోతారు. అప్పటికే స్వప్నకు కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. స్వప్న చెప్పేది వినిపించుకోకుండా, రుద్రాణి ఇంట్లో నుంచి గెంటేయబోతుంది. ఈలోగా స్వప్న గుమ్మం దగ్గర కళ్లు తిరిగి పడిపోతుంది. కావ్య, ధాన్యలక్ష్మి కంగారుగా వెళ్లి లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ, స్వప్న లేవదు. అయితే, అది కూడా స్వప్న నాటకమేనని రుద్రాణి అంటుంది. లాగిపెట్టి ఒకటి కొడితే అదే లేస్తుంది అని రుద్రాణి అంటే, చాలా నాటకాలు ఆడుతుంది, బయటకు ఈడ్చుకొని వెళతాను అని రాహుల్ అంటాడు. కానీ, రాజ్ ఆపేస్తాడు. తప్పు చేసిందా, ఒప్పు చేసిందా తెలీదు కానీ, స్పృహలో లేని అమ్మాయిని అలా బయటకు గెంటేయడం సంస్కారం కాదు అని ఆపుతాడు. ముందు డాక్టర్ ని పిలిచి, ట్రీట్మెంట్ చేయిద్దాం అంటాడు. అయితే, ఇంకా దీనిని ఎలా నమ్ముతున్నారు అని రుద్రాణి అంటుంది. చిట్టి రుద్రాణి పై సీరియస్ అవుతుంది. కాసేపు ఆగలేవా అని అరిచి, రాజ్ ని ఫోన్ చేయమని అడుగుతుంది.

Brahma Mudi Serial Today:25th November 2023 Swapna Berates Rahul ram

రాజ్ ఫోన్ చేసిన తర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి స్వప్నకు చెక్ అప్ చేస్తారు. స్వప్న కడుపుతో ఉందని, జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ కావ్యకు చెప్పి బయటకు వస్తుంది.  అలా బయటకు రాగానే, డాక్టర్ ని మరోసారి ఇంట్లో వాళ్లు ఏమైందని అడుగుతారు. మరోసారి డాక్టర్ స్వప్న ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుంది. అందరూ షాకై చూస్తూ ఉంటారు. స్వప్న మాత్రం ఆనందపడుతుంది. ఈలోగా రుద్రాణి స్వప్నను గది నుంచి బయటకు లాక్కొని వస్తుంది. గతంలో లాగే మళ్లీ నాటకం ఆడుతుందని, డాక్టర్ పై కూడా నింద వేస్తుంది. అయితే, డాక్టర్ మాత్రం గట్టిగా కౌంటర్ ఇస్తుంది. తాను చెప్పేది నిజం అని చెప్పేసి వెళ్లిపోతుంది.

అయితే, రుద్రాణి మాత్రం ఆఖరి నిమిషయంలో కడుపు అంటూ నాటకం ఆడితే నమ్మేస్తాం అనుకుంటున్నావా అని  అంటుంది. అప్పుడు స్వప్న కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది. డాక్టర్ ని ఎవరు పిలిపించారు? అందరూ ఇక్కడే ఉన్నారు.. నేను నాటకం ఆడితే, మీకు తెలిసిపోదా అని అడిగేస్తుంది. రాహుల్ కూడా, స్వప్నకు కడుపు నిజమే అయ్యి ఉంటుంది మామ్ అంటాడు. కానీ, ఆ బిడ్డకు తండ్రిని మాత్రం తాను కాదు అంటూ బాంబ్ పేలుస్తాడు. దీని బాయ్ ఫ్రెండ్ వల్లే ఆ కడుపు వచ్చిందని, ఇలాంటి చెడిపోయిన ఆడదాన్ని ఇంట్లో ఉంచొద్దు అని అంటుంది. ఆ మాటకు కోపం తో ఊగిపోయిన స్వప్న, చెంప పగలకొడుతుంది. రుద్రాణి కోపంగా ఏయ్ అని అరిస్తే, అంతే కోపంగా స్వప్న ఏయ్ అంటూ అరుస్తుంది.

Brahma Mudi Serial Today:25th November 2023 Swapna Berates Rahul ram

‘ఇప్పటి వరకు నన్ను ఎన్ని మాటలు అన్నా భరించాను. ఎందుకంటే, ఆ అరుణ్ అనేవాడు చాలా పకడ్బందీగా నన్ను ఉచ్చులో బంధించాడు. అందుకే నేను నోర్మూసుకున్నాను. కానీ, ఇప్పుడు నువ్వేం అన్నావ్? ఆ బిడ్డకు తండ్రివి నువ్వు కావా? ఆ మాటతో నాకు కూడా గుర్తొచ్చింది. నేను కూడా ఆడదానినే అని. నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, నేను కూడా పవిత్రంగానే బతుకుతున్నాను. నువ్వు నన్ను వదిలించుకోవడానికి ఇంత పెద్ద నింద వేస్తున్నావ్ అని ఇప్పుడు అర్థమైంది. మిస్టర్ రాహుల్, నేను రిచ్ గా బతకాలి అనుకున్నది మాత్రం నిజం. కానీ,ఎలా పడితే అలా బతకాలని అనుకోలేదు. నాకు కూడా ఓ క్యారెక్టర్ ఉంది. అంతగా దిగజారిపోయాను అని ఎలా అనుకున్నావ్? చంపేస్తాను.’ అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది.

‘ఎంత ధైర్యం నీకు. నువ్వు ఒకడితో తిరుగుతున్నావ్ అని, వాడికోసం నగలు తాకట్టుపెట్టావని, అన్ని సాక్షాలతో రుజువు అయిన తర్వాత కూడా నువ్వు ఏ తప్పు చేయలేదంటే ఎలా నమ్ముతానే’ అని రాహుల్ అంటే, ‘నమ్మాలి, నమ్మితీరాలి. నా పేరెంట్స్ పేదవాళ్లే కావచ్చు. నేను పేదరికాన్ని అసహ్యించుకొనే ఉండొచ్చు. నా బతుకంటే నాకు చిరాకే కావచ్చు. కానీ, రిచ్ గా బతకడానికీ, చెడిపోయి బతకడానికి చాలా తేడా ఉంది. పెళ్లికి ముందు నా మనసులో ఎవరూ లేరు. పెళ్లి తర్వాత నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు. నా జీవితంలోకి మరో వ్యక్తి వచ్చే అవకాశమే నేను ఇవ్వను. నేను అందంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యంగా బతకాలని ఎప్పుడూ కోరుకుంటాను. అందుకని,నన్ను నేను అపవిత్రంగా చేసుకున్నా పర్వాలేదని ఎఫ్పుడూ అనుకోలేదు’ అని స్వప్న చాలా స్ట్రాంగ్ గా సమాధానం ఇస్తుంది,

Brahma Mudi Serial Today:25th November 2023 Swapna Berates Rahul ram

అయితే, రుద్రాణి మాత్రం ఎలాగైనా స్వప్నను వదిలించుకోవాలని, స్వప్న చెప్పేవన్నీ అబద్ధాలని కుటుంబ సభ్యులను నమ్మించాలని అనుకుంటూ ఉంటుంది. ‘ మొగుడ్ని వదిలేసిన నిన్నే పవిత్రంగా చూస్తోంది ఈ కుటుంబం. మొగుడితో కాపురం చేసే నన్ను ఎందుకు పవిత్రంగా చూడరు. నేను బ్లాక్ మెయిల్ కి లొంగి ఎవరికో డబ్బు ఇచ్చినంత మాత్రానా, నా శీలాన్నే పణంగా పెడతానని అనుకున్నారా? నేను, నగలు తాకట్టుపెట్టినట్లు, పరువు కోసం పవిత్రతను కూడా తాకట్టు పెట్టానని అనుకుంటున్నారా? ఇది నా శీలం, ఇదినా పవిత్రత, ఇది నా వ్యక్తిత్వం, ఇది నా జీవితం. ఒక ఆడిదానివై ఉండి, మరో ఆడదాని శీలం మీద మచ్చ వేయాలని చూస్తే, ఊరుకొనేది లేదు.’ అని స్వప్న చాలా గట్టిగా తన అత్తకు ఇచ్చిపడేస్తుంది.

అయితే, రుద్రాణి మాత్రం ఇంట్లో వాళ్లందరినీ చూస్తూ ఉరుకుంటారేంటి? ఇది నా వంశాన్ని సంకరం చేయాలని చూస్తోందని, ఎవరికో పుట్టేవాడిని నా వారసుడిని చేయాలని చూస్తోందని, నా కొడుకును అమాయకుడిని చేసి, ఆ బిడ్డకు వీడిని తండ్రిని చేయాలని చూస్తోందని, ఇలాంటి దానిని నమ్మద్దని , దీనికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నిజం, ఈ కడుపుకు కారణం కూడా వాడే అని రుద్రాణి ఆరోపిస్తుంది. ఈ మాటలు వినలేక కావ్య ఎంట్రీ ఇస్తుంది.  తన అక్క చెడిపోయిందని ఇంకొక్కమాట అన్నా ఊరుకోను అని కావ్య గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.  ఇంట్లో పెద్దవాళ్లు ఏమీ మాట్లాడకపోవడాన్ని కూడా ప్రశ్నిస్తుంది. తాము ముగ్గురం ఆడపిల్లలను నిప్పులాగా తమ తల్లిదండ్రులు పెంచారని, తాము ఎలాంటి తప్పు చేయమని చెబతుంది.

అయితే, స్వప్న మాత్రం కావ్యను పక్కకి జరిపి, తన సమస్యను తానే పరిష్కరించుకుంటానని అంటుంది. ఈ విషయంలో తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని, తనను తాను గెలిపించుకోవడానికి సహనం ఉందని చెబుతుంది. ఈ బిడ్డ నీ బిడ్డ అవునో కాదో నిరూపించడానికి తాను డీఎన్ఏ టెస్టు చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతుంది.  డీఎన్ఏ టెస్టుతో ఈ బిడ్డ మీ బిడ్డే అని నిరూపిస్తానని చెబుతుంది. నేను రెడీ, నువ్వు రెడీనా రాహుల్ అని స్వప్న అడిగే సరికి, రాహుల్ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు.  డీఎన్ఏ టెస్టు రిపోర్టు వచ్చిన తర్వాత ఈ మాటలు మాట్లాడమంటుంది. నిజంగా ఆ రిపోర్టులో ఈ బిడ్డ రాహుల్ బిడ్డకాదని తెలిస్తే,మీరు నిరూపించడం కాదు, తానే తల దించుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెబుతుంది. ఇంట్లో పెద్దవాళ్లను కూడా స్వప్న ఇదే విషయం అడుగుతుంది. తాను కూడా ఒక ఆడదానిని నిరూపించుకోవడానికి ఈ టెస్టుకి తాను అంగీకరించానని, ఈ విషయంలో తనకు ఒక్క అవకాశం ఇవ్వమని స్వప్న అడుగుతుంది.

దీంతో, వాళ్ల తాతయ్య రాహుల్ కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆడపిల్లను అలా అవమానించడం కరెక్ట్ కాదని, మన రక్తాన్ని మనమే మలినం చేసుకున్న వాళ్లం అవుతామని , ఆవేశం తగ్గించుకోమని చెబుతాడు. ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా తాను టెస్టుకి సిద్ధం అని చెబుతున్నా, మీరు ఇలా ఆలోచనలేకుండా పనులు చేయడం కరెక్ట్ కాదని చెబుతాడు. సమస్యకు ఎలా పరిష్కారం చూపించాలో ఆలోచించమని చెబుతాడు. ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదని, ఆలోచనతో తీసుకోవాలని, అప్పటి వరకు సహనంగా ఉండమని సలహా ఇస్తాడు.

సీన్ కట్ చేస్తే, గదిలోకి తీసుకువెళ్లి, రాహుల్ చెంప పగలకొడుతోంది రుద్రాణి. స్వప్న అందరి ముందు కొడితే, నువ్వు గదిలో కొడతావా అని సీరియస్ అవుతాడు. ప్లాప్ ఫెయిల్ అయితే నేనేం చేస్తా అని రాహుల్ అంటే, అదృష్టం అందలం ఎక్కిస్తా అంటే, బుద్ధి గాడిదలు కాస్తా అన్నట్లు చెస్తావని, ఈ ఆస్తికి నిన్ను వారసుడిగా చేద్దాం అని నేను అనుకుంటే, నువ్వు జీవితాంతం ఒకరి మోచేతుల నీళ్లు తాగుదామని ఆశపడుతున్నావా అని రుద్రాణి తిడుతుంది. నీవల్లే ఆ స్వప్న ఈ రోజు ఈ ఇంట్లో ఉండబోతుందని, ఇలాంటి పని ఎలా చేశావ్ అని తిడుతుంది. దానిని ఓ వైపు ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తూనే, మరోవైపు దానికి కడుపు ఎలా చేశావ్ అని అడుగుతుంది. రాహుల్ ఏదో చెప్పబోతుంటే వినకుండా, రుద్రాణి తిడుతుంది. అసలు స్వప్నకు ఎలా కడుపువచ్చిందో తనకు తెలీదంటాడు. హనీమూన్ కి తీసుకువెళ్ి, తన కథ ఫినిష్ చేయరా అంటే, కడుపు చేసి తీసుకువస్తావా అని తిడుతుంది. స్వప్న కడుపులో బిడ్డకు నీకు ఎలాంటి సంబధం లేదని ప్రూవ్ చేద్దామని సలహా ఇస్తుంది.

కమింగ్ అప్ లో రాజ్ కూడా స్వప్న క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడతాడు. దీంతో, కావ్య తన అక్క ఏ తప్పు చేయలేదని తాను సాక్ష్యాలతో సహా నిరూపిస్తానని రాజ్ తో ఛాలెంజ్ చేస్తుంది. మరి ఎలా నిరూపిస్తుందో చూడాలి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios