Asianet News TeluguAsianet News Telugu

Brahma Mudi Serial Today:స్వప్నను కార్నర్ చేసిన రాహుల్, మెడపెట్టి బయటకు గెంటిన రుద్రాణి

స్వప్న పెద్ద తప్పు చేసిందని, అందుకే తాను అంత మాట అన్నాను అని రాహుల్ చెప్పడం మొదలుపెడతాడు. వెంటనే గతంలో అరుణ్ తో కలిసి దిగిన ఫోటోలను తీసి, ఇంట్లో వారందరికీ చూపిస్తాడు. ఆ అబ్బాయితో స్వప్న ఎంత చనువుగా ఉందో చూశారా అంటూ అందరినీ అడుగుతాడు.

Brahma Mudi Serial Today:24th November Rahul Accuses Swapna ram
Author
First Published Nov 24, 2023, 10:07 AM IST

Brahma Mudi  Serial Today: ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తుందా అని  రాహుల్ ఎదురుచూస్తూ ఉంటాడు. స్వప్న రాగానే ఆగు అని ఆపేస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ అంటూ నిలదీస్తాడు. ఏమీ తెలియనట్లుగా రుద్రాణి, ఇవేం ప్రశ్నలు? పార్లర్ కి వెళ్తున్నాను అని నాకు చెప్పే వెళ్లింది అని అంటుంది. రాహుల్ అవన్నీ అబద్ధం అని, నిజంగానే పార్లర్ కి వెళ్లి వచ్చావా అని స్వప్నను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. మధ్యలో కావ్య జోక్యం  చేసుకొని, మీ అమ్మగారే చెబుతున్నారు కదా పార్లర్ కి వెళ్లిందని అనబోతుంటే, ఇది మా భార్యభర్తల విషయం, నువ్వు జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో, కావ్య ఆగిపోతుంది. కావ్యను అలా అనడంతో రాజ్ జోక్యం చేసుకొని, స్వప్నను ఎందుకు ప్రశ్నలు వేస్తున్నావ్ అని అడుగుతాడు.

Brahma Mudi Serial Today:24th November Rahul Accuses Swapna ram

అప్పుడు రాహుల్, స్వప్న అందరినీ మోసం చేసి వేరే ఎవడితోనో తిరుగుతోంది అంటాడు. దీంతో, వాళ్ల నానమ్మ పళ్లు రాలకొడతాను అంటుంది. అపర్ణ సైతం భార్య బయటకు వెళ్లి వస్తే, ఇలానేనా అర్థం చేసుకునేది అని నిలదీస్తుంది. కావ్య సైతం రాహుల్ పై సీరియస్ అవుతుంది. అయితే, రాహుల్ అంత పెద్ద నింద వేసినా స్వప్న నోరు మెదపకపోవడంపై రుద్రాణి ప్రశ్నిస్తుంది. అప్పుడు స్వప్న నోరు తెరుస్తుంది. ఇంత మంది నాకు మద్దతుగా నిలుస్తున్నారని, వాళ్లెవరికీ తప్పుగా అనిపించనది, నీకు ఎందుకు తప్పుగా అనిపించింది అని స్వప్న చాలా కూల్ గా మాట్లాడుతుంది. ఆలస్యమైనందుకు క్షమాపణలు చెబుతుంది. అంతగా నమ్మకం లేకపోతే, ఈసారి నువ్వే తీసుకువెళ్లి, నువ్వే తీసుకొని రా అంటుంది. కానీ, స్వప్న అంత కూల్ గా ఉండటాన్ని రుద్రాణి తప్పు పడుతుంది.


స్వప్న పెద్ద తప్పు చేసిందని, అందుకే తాను అంత మాట అన్నాను అని రాహుల్ చెప్పడం మొదలుపెడతాడు. వెంటనే గతంలో అరుణ్ తో కలిసి దిగిన ఫోటోలను తీసి, ఇంట్లో వారందరికీ చూపిస్తాడు. ఆ అబ్బాయితో స్వప్న ఎంత చనువుగా ఉందో చూశారా అంటూ అందరినీ అడుగుతాడు. అయితే, అవన్నీ కాలేజీ రోజుల్లో ఫోటోలన్నీ, అతను తన క్లోజ్ ఫ్రెండ్ అని, ఫ్రెండ్ మాత్రమే అని చెబుతుంది. ఫ్రెండ్ తో కాస్త చనువుగా ఉంటే, నువ్వు దానిని బూతద్దంలో ఎందుకు చూస్తున్నావ్ అని స్వప్న అడుగుతుంది.అప్పుడే చిట్టికి అనుమానం వస్తుంది. మరి నేను ఈ అబ్బాయి ఫోటో చూపించిచ అడిగినప్పుడు ఎవరో తెలీయదు అన్నావ్ కదా అని అడుగుతుంది. ఆ ప్రశ్నతో అందరి ముందు స్వప్న ఇరుక్కుపోయినట్లు అవుతుంది.

Brahma Mudi Serial Today:24th November Rahul Accuses Swapna ram

ఇదే ఛాన్స్ అనుకొని రుద్రాణి తగులుకుంటుంది. ఈ విషయం ముందే తెలుసా? మరి మాకు ఎందుకు చెప్పలేదు అని అని రుద్రాణి అడుగుతంది.నిజాలు తెలీకుండా ఆడపిల్లపై నింద వేయడం కరెక్ట్ కాదని  చెప్పలేదు అని చిట్టి సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత స్వప్న ఆ ప్రశ్నకు సంజాయిషీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకొచ్చిన తలనొప్పి అని అబద్ధం చెప్పాను అంటుంది. వెంటనే కావ్య స్వప్నకు సపోర్ట్ గా నిలుస్తుంది. అరుణ్ ని కేవలం ఫ్రెండ్ లాగే చూసిందని, వాళ్లు మంచి ఫ్రెండ్స్ అని కావ్య సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది.

అయితే, ఈ స్నేహం అక్కడితో ఆగలేదని, స్వప్న ఇప్పటికీ అరుణ్ ని కలుస్తోందని రాహుల్ అంటాడు. ఇంటికి పిలిపించుకొని మరీ, బయట ఎందుకు కలిశావ్ అని నిలదీస్తాడు. అయితే, రాజ్ నేను కూడా చూశాను అని నిజం చెబుతాడు. ఇక రుద్రాణి తన ఓవర్  యాక్షన్ మొదలుపెడతుంది.  నీ ఫ్రెండ్ అయితే ఇంటికి రావాలి కానీ, బయటకు వచ్చి ఎందుకు కలిశావ్ అని అడుగుతాడు. ఆ విషయం కూడా స్వప్న అంగీకరిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు వస్తాయనే వాడెవడో నాకు తెలీదు అన్నాను అని స్వప్న చెబుతుంది.

Brahma Mudi Serial Today:24th November Rahul Accuses Swapna ram

అయితే, వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చావ్ అని రాహుల్ అంటాడు. స్వప్న ఓ భయంకరమైన ఆడదని, కడుపు ఉందని సీమంతం వరకు నాటకం ఆడిందని, తాతయ్య మాట కోసం ఆగితే ఇప్పుడు ఇలా చేసింది అని రాహుల్ ఆరోపిస్తాడు. రుద్రాణి కూడా నానా మాటలు అంటుంది.  అరుణ్ కి  డబ్బులు ఇచ్చింది అనడానికి కూడా తన దగ్గర సాక్ష్యం ఉందని రాహుల్ చెబుతాడు. వెంటనే, అరుణ్ పంపిన ఫోటోలు చూపిస్తాడు. అది చూసి ఇంట్లో వారందరికీ నోట్లో నుంచి మాట రాదు. రుద్రాణి.. ఇక స్వప్నను తిట్టరాని విధంగా చాలా దారుణంగా తిడుతుంది. అంత డబ్బు నీకు ఎక్కడికి వచ్చింది అని నిలదీస్తుంది. బంగారం తాకట్టుపెట్టి  వెళ్లింది అని దానికి కూడా రాహుల్ సాక్ష్యం చూపిస్తాడు. ఆ సాక్ష్యాలు చూపించిన తర్వాత స్వప్నకు అనుకూలంగా మాట్లాడటానికి ఎవరూ ముందుకు రారు. చిట్టి ఒక్కతే నిజం చెప్పమని అడుగుతుంది. లేదంటే. అందరూ నిన్ను అనుమానిస్తారు అంటుంది. వెంటనే రుద్రాణి అనుమానించడం కాదు, అది తప్పు చేసింది అంటుంది. కావ్య వెంటనే స్వప్న దగ్గరకు వచ్చి ఇలా ఎందుకు చేశావ్ అని అడుగుతుంది.

అదే ఛాన్స్ అనుకున్న రుద్రాణి, స్వప్నకు క్యారెక్టర్ లేదని, తన కొడుకును మోసం చేసిందని తిడుతుంది. ఇంట్లో నుంచి పంపించాల్సిందే అని నిర్ణయం తీసుకుంటుంది. అక్రమ సంబంధం ఉంది కాబట్టే, నగలు తాకట్టుపెట్టింది అని రాహుల్ అంటాడు. స్వప్న తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను కేవలం ఆలోచించకుండా మాట్లాడతాను కానీ, తప్పటడుగు వేయను అని చెప్పే ప్రయత్నం చేస్తుంది.

కమింగప్ లో స్వప్న తల్లికాబోతోందనే విషయం తెలుస్తుంది. అయితే, రాహుల్ ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు అని అనేస్తాడు. దాని బాయ్ ఫ్రెండ్ వల్లే ఆ కడుపు వచ్చిందని ఆరోపిస్తాడు. మరి ఈ సమస్యను కావ్య, రాజ్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios