Brahma mudi Serial Today: అప్పూ ఆత్మహత్య...? వేరే వ్యక్తితో స్వప్న సంబంధం పెట్టుకుందన్న రాహుల్..!
డబ్బులు ఇస్తే వదిలేస్తా అని సలహా ఇస్తాడు. అయితే, అంత డబ్బు తాను ఎలా ఇవ్వగలను అని అడుగుతుంది. అది తనకు అనవసరం అని, రేపటిలోగా డబ్బు ఇవ్వకుంటే రేపు ఇంటికి కొరియర్ వస్తుంది అని భయపెట్టేస్తాడు.
Brahma mudi Serial Today:ఈ రోజు ఎపిసోడ్ లో స్వప్నకు అరుణ్ ఫోన్ చేస్తాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయడం, చేయడమే తిట్టడం మొదలుపెడుతుంది. రాత్రే చెప్పాను కదా, మళ్లీ ఫోన్ చేయద్దని చెప్పాను కదా ఎందుకు చేశావ్..? పోలీసులకు ఫిర్యాదు చేయమంటావా అని తిడుతూ ఉంటుంది. అరుణ్ చెప్పాలి అనుకుంటున్న విషయం కూడా చెప్పనివ్వకుండా అరుస్తూ ఉంటుంది. నీకు నాకు ఏంటి సంబంధం అని అరవగా, అక్రమ సంబంధం అంటూ సమాధానం ఇస్తాడు. నీకు నాకు మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మర్చిపోయావా అంటూ మాట్లాడతాడు. అతని మాటలకు మొదట షాకైనా తర్వాత పళ్లు రాలకొడతా అని స్వప్న తిడుతుంది. దీంతో, జస్ట్ జోక్ చేశానని అంటాడు. దీంతో, నీకేమి కావాలి? నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావ్? మళ్లీ ప్రేమ దోమ అంటూ విసిగించకు అంటుంది, దానికి అరుణ్, నువ్వో పెద్ద మిస్ యూనివర్స్ అని నీ వెంట పడతానా నీకు అంత సీన్ లేదు, జస్ట్ నిన్ను భయపెట్టడానికి మాత్రమే అలా చేశాను అని చెబుతాడు. తనకు హాస్పిటల్ కట్టుకోవడానికి డబ్బులు కావాలని రూ.పది లక్షలు ఇవ్వమని అడుగుతాడు. అది విని స్వప్న షాకౌతుంది. రూ. పది లక్షలు ఇస్తే, నిన్ను ఇబ్బంది పెట్టను అని చెబుతాడు.
అయితే, స్వప్న ఏ మాత్రం భయపడదు. నీను నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఇంటికి వస్తే రా నాకేమీ భయం లేదు అని చెబుతుంది. అప్పుడు అరుణ్,, నేను ఎందుకు వస్తాను స్వప్న, జస్ట్ మనమిద్దరం కలిసి గడిపినట్లు ఫోటోలు గ్రాఫిక్స్ లో ఎడిట్ చేసి మళ్లీ కొరియర్ పంపుతాను అని చెబుతాడు. ఆ మాటలకు స్వప్న నిజంగానే భయపడుతుంది. డబ్బులు ఇస్తే వదిలేస్తా అని సలహా ఇస్తాడు. అయితే, అంత డబ్బు తాను ఎలా ఇవ్వగలను అని అడుగుతుంది. అది తనకు అనవసరం అని, రేపటిలోగా డబ్బు ఇవ్వకుంటే రేపు ఇంటికి కొరియర్ వస్తుంది అని భయపెట్టేస్తాడు.
దీంతో, స్వప్న అంత డబ్బు ఎలా ఇవ్వగలను అని ఆలోచనలో పడుతుంది. ఇదంతా పక్కనే ఉండి విన్న రాహుల్, రుద్రాణిలు తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు సంబరపడుతూ ఉంటారు. ఇంట్లో ఎవరినీ డబ్బులు అడిగే సాహసం కూడా స్వప్న చేయలేదు అని సంబరపడిపోతారు. మరోవైపు స్వప్న ఏం చేయాలో తెలియక భయపడిపోతూ ఉంటుంది. నగలు తాకట్టుపెడుతుంది అని రుద్రాణి రాహుల్ తో చెబుతుంది కానీ, స్వప్న మాత్రం నగలు తాకట్టుపెడితే, ఇంట్లోవాళ్ల ముందు దొరికిపోతానని, వేరే దారి వెతకాలి అనుకుంటూ ఉంటుంది.
ఇక, సీన్ కట్ చేస్తే, ఇంట్లో అప్పూ ఒంటరిగా దిగాలుగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఈలోగా, కనకం ఇంటి ముందు హడావిడిగా ఉంటే ఏమైందా చూద్దాం అని కనకం బయటకు వెళ్తుంది. వాళ్ల ద్వారా ఎవరో అమ్మాయి ప్రేమించినవాడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. అది వినగానే కనకానికి అప్పూ గుర్తుకు వస్తుంది. అప్పూ కి అలా జరగకూడదని, తన కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంది. వెంటనే అప్పూ దగ్గరకు వెళ్లి ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. తనతోపాటు అప్పూని ఉంచుకోవడానికి పని కి సహాయం చేయమని అడుగుతుంది. అప్పూ కూడా సరే అని హెల్ప్ చేస్తుంది.
మరోవైపు రాజ్ కి పోలీసు ఆఫీసర్ కాల్ చేస్తాడు. అరుణ్ గురించి ఆరా తీయమని చెబితే ఆ విషయం ఆ పోలీసు చెబుతాడు. స్వప్న, అరుణ్ ఫ్రెండ్స్ అని , డాక్టర్ గా ప్రాక్టీస్ గా చేస్తున్నాడని, డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నాడని చెబుతారు. దీంతో, రాజ్ అనవసరంగా స్వప్న గురించి భయపడుతున్నాం, ఏం ఉండదులే అని అనుకుంటాడు. ఇంతలో కావ్య ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరూ ఎప్పటిలాగానే కీచులాడుతూ ఉంటారు. కాఫీ కూడా ఇవ్వలేదు అని దెప్పుతాడు. నేను ఇస్తే మీరు తాగరు కదా అంటే, అది మొగుడిగా తన పొగరు అంటాడు.
ఇక, అప్పూ ఇంట్లో పని చేస్తూ కూడా కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కనకం అలా అప్పూని చూసి భయపడుతుంది. అప్పూ ని ఖాళీ గా ఉంచితే కళ్యాణ్ గురించే ఆలోచిస్తుందని, వేరే పనులు చెబుతూ ఉంటుంది. వాళ్ల పెద్దమ్మ నేను చేస్తాను అన్నా కూడా వద్దు అని, అప్పూనే చేయాలి అని కనకం అంటుంది. ఇంటి పనులు అలవాటు కావాలని చెబుతున్నా అని కవర్ చేస్తుంది. ఒక దాని తర్వాత మరొక పని చేయిస్తూనే ఉంటుంది. అప్పూ విసుక్కుంటుంటే, సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది. దీంతో, అప్పూూ అన్ని పనులు చేస్తూనే ఉంటుంది.
ఇక స్వప్న, డబ్బుల కోసం తిప్పలు పడుతూ ఉంటుంది. స్వప్న టెన్షన్ పడటం చూసి రాహుల్ సంబరపడిపోతాడు. ఏమీ తెలియనట్లుగా ఏమైంది అని అడుగుతాడు. టెన్షన్ గా ఉన్నావ్ ఏంటి అని అడిగితే, ఏం లేదు నేను బాగానే ఉన్నాను అంటుంది. కానీ, రాహుల్ వదలడు. నీ ముఖం చూస్తేనే అర్థమౌతోంది ఏమైంది అని గుచ్చి గుచ్చి అడుగుతాడు. స్వప్న మనసులో తిట్టుకుంటుంది. పెళ్లాన్ని సంతోషంగా చూసుకోవడం తెలీదు కానీ, ఇలాంటివి మాత్రం బాగానే గుర్తుపడతాడు అని అనుకుంటుంది. ఏమైనా సహాయం కావాలా అని అడుగుతాడు. నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి? నేను తప్పు ఎప్పుడు చేస్తానా అని కదా నువ్వు ఎదురు చూసేది అని అంటుంది. స్వప్నకు అనుమానం వచ్చిందని అర్థమైన రాహుల్ ఏదో చెప్పి కవర్ చేస్తాడు. నమ్మేసిన స్వప్న డబ్బు కావాలని రాహుల్ ని అడుగదుామని అనుకొని, మళ్లీ వద్దులే అని ఆగిపోతుంది.
ఇక, రాజ్ ఇంట్లో డోర్ తో కుస్తీ పడుతూ ఉంటాడు. డోర్ పడటం లేదని చెబుతాడు. మరోవైపు ఇంట్లో కనకం అప్పూ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో బెడ్ మీద అప్పూ అచేతనంగా పడి ఉంటుంది. అది చూసి కనకం షాకౌతుంది. అయితే, అది కనకం కల అయ్యి ఉండొచ్చు. రేపటి ఎపిసోడ్ లోచూపిస్తారు. ఇక, కమింగ్ అప్ లో ఇంట్లో అందరి ముందు స్వప్న తప్పు చేస్తోందని రాహుల్ నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ రచ్చ రేపటి ఎపిసోడ్ లో ఉంటుంది.