Asianet News TeluguAsianet News Telugu

Brahma Mudi Serial Today: రాజ్ ఒడిలో కావ్య ప్రేమ కబుర్లు, స్వప్నను అలా చూసి, రాజ్ లో అనుమానాలు..!

మరోవైపు స్వప్న, అరుణ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ అరుణ్ ఎప్పుడో ఫోన్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు చేయలేదు. సరిగ్గా రాహుల్ ఉన్నప్పుడు చేస్తాడేమో, చాలా తప్పులు చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు ఏ తప్పు చేయకుండానే వీడికి భయపడాల్సి వస్తుంది అని అనుకుంటుంది.

Brahma Mudi Serial Today 18th November:Swapna Meets Arun ram
Author
First Published Nov 18, 2023, 8:52 AM IST


Brahma Mudi Serial Today: ఈ రోజు ఎపిసోడ్ లో  కావ్య బెడ్ మీద పడుకొని ఏదో పుస్తకం చదువుతూ ఉంటుంది. కావాలని ‘రాజ్ ని రెచ్చగొట్టేలా రాజు అంతపురంలోకి వచ్చాడు. రాణి హంసతూలికా పాన్పుపై పడుకొని ఉంది’ అంటూ ఇలా ఏవేవో చదువుతూ ఉంటుంది. కావ్య చదువుతున్న దానికి చిరాకు వచ్చిన రాజ్, బెడ్ మీద దుప్పటి లాగేస్తాడు. ఆ దుప్పటితో పాటు కావ్య కూడా కదలి వచ్చేస్తుంది. ఇద్దరూ వెళ్లి కింద పడిపోతారు. రాజ్ నొప్పితో బాధపడుతుంటే, కావ్య, అప్పుడు కూడా ఆ పుస్తకం వదలకుండా చదువుతూ ఉంటుంది. అప్పుడు కావ్య తల రాజ్ ఒడిలో ఉంటుంది. దానిని అవకాశంగా తీసుకొని ‘ రాజు ఒడిలో రాణి ఉండగా ఆమె ముక్కుపుడక అతని చెవి కింద గీరుకుంటుంది. చెవి కమ్మ మెడ మీద రాసుకుంటుంది. కస్తూరి తిలకం అతని చెంప మీద అంటుకుంది’ అని చదువుతూ ఉంటుంది. రాజ్ నిజంగానే తనకు గీసుకున్నాయా, అంటుకున్నాయా అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. కావ్య మాత్రం ఓ కంట రాజ్ ని గమనిస్తూనే, మరోవైపు పుస్తకం చదవడం కంటిన్యూ చేస్తుంది. ఇక తట్టుకోలేక రాజ్ ఆపు అని గట్టిగా అరుస్తాడు. దానికి కావ్య, అలా ఎవరూ ఆపలేదండి అని ఇంకా ఏదో చదవబోతుంటే, రాజ్ పుస్తకం లాక్కొని విసిరేస్తాడు. ఆ పుస్తకం గాలిలో ఎగిరి, మళ్లీ వచ్చి రాజ్ తలపై పడుతుంది. అబ్బా అని అరుస్తాడు. అప్పుడు కావ్య తప్పండి.. అలా చేయకూడదు భార్యభర్తలు సరసల్లాపాల్లో ఉండగా డిస్టర్బ్ చేయకూడదు అంటుంది. ఏమైందో నీకు అని రాజ్ అంటే, వయసు కాదు, మనసు అయ్యింది అంటుంది. అయితే, రాజ్.. నీకు, నాకు మధ్య భార్యభర్తల బంధం లేదు అని తేల్చి చెప్పేస్తాడు.

Brahma Mudi Serial Today 18th November:Swapna Meets Arun ram

దాంతో  కావ్య, ‘ ఏ బంధం, ఏ సంబంధం లేకుండానే, ఇంతసేపు నన్ను మీ ఒడిలో పడుకోపెట్టుకున్నారా’ అని అడుగుతుంది. వెంటనే కావ్యను పైకి లేపి, ‘నీకు, నాకు ఈ జన్మలో ఎలాంటి బంధం ఉండదు’ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ, కావ్య మాత్రం  ఎలా ఉండదో నేను చూస్తాను ప్రవరాఖ్య అంటుంది.

మరోవైపు స్వప్న, అరుణ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ అరుణ్ ఎప్పుడో ఫోన్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు చేయలేదు. సరిగ్గా రాహుల్ ఉన్నప్పుడు చేస్తాడేమో, చాలా తప్పులు చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు ఏ తప్పు చేయకుండానే వీడికి భయపడాల్సి వస్తుంది అని అనుకుంటుంది. మరోవైపు రాహుల్, రుద్రాణి ఇంకా, అరుణ్ రాలేదేంటని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లోగా అరుణ్ అక్కడకు వచ్చి రాహుల్ కి ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావ్ అంటే, మీ ఇంటి దగ్గరే ఉన్నాను సర్ అంటాడు. వెంటనే స్వప్నకు ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పు అంటాడు. అది రాదు సర్ అని అరుణ్ అంటే, నీ దగ్గర తన ఫోటోలు ఉన్నాయి కాబట్టి, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది అని చెబుతాడు. దీంతో, సరే సర్ అని అరుణ్ స్వప్నకు ఫోన్ చేస్తాడు.

Brahma Mudi Serial Today 18th November:Swapna Meets Arun ram

ఫోన్ చెయ్యడం, చెయ్యడం స్వప్న తిట్లదండకం మొదలుపెడుతుంది. ‘అసలు నీకు బుద్ధుందా కామన్ సెన్స్ పనిచేయట్లేదా ఫోటోలు ఎందుకు పంపించావ్? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది నీతో ఫొటోస్ పంపించేస్తావా నువ్వు ఏమైనా సినిమా హీరో అనుకున్నావా చూడగానే ముడిచిపోవడానికి నువ్వు మనిషివేనా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు డాక్టర్ చదివాను అంటావ్ కొంచెం అన్న కామెంట్ సెన్స్ ఉందా? ఆలోచించవా ఇక్కడ నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడున్నానో నాకు పెళ్లయింది నాకు మొగుడు ఉన్నాడు ఇవన్నీ గుర్తు ఉండవా నీకు బుద్ధుందా నువ్వు మనిషివేనా? మర్యాదగా ఇంటికి వచ్చి రాంగ్ అడ్రస్ అని చెప్పి నీ ఫొటోస్ నువ్వు తీసుకెళ్ళు’ అని తిడుతూనే ఉంటుంది. దీంతో, అరుణ్.. ఇది నా మాట వినదు అంటే రాహుల్ వినిపించుకోలేదు. ఇదేమో, ఫోన్ చేస్తేనే బూతులు తిడుతోంది అనుకుంటూ ఉంటాడు.

Brahma Mudi Serial Today 18th November:Swapna Meets Arun ram

ఇలా కాదని, అరుణ్ మాట్లాడటం మొదలుపెడతాడు. ‘ఇందాక నుంచి నా ఫోటో నా ఫోటో అంటున్నావ్ మనిద్దరం కలిసి దిగిన ఫొటోస్ కూడా పంపించా కదా అందుకే నేను చెప్పేది పూర్తిగా వినమంటున్నా నేను ఇప్పుడు మీ ఇంటి ముందే ఉన్నాను ఒకసారి బయటికి రా నీతో మాట్లాడి విషయం చెప్పి వెళ్ళిపోతాను’ అంటాడు. అది విని షాకైన స్వప్న, ‘ఇదేమైనా మా నాన్న ఇల్లు అనుకుంటున్నావా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి, నా కాపురం నాశనం అయిపోతుంది’ అంటుంది. దానికి అరుణ్, ఈ ఒక్కసారి రా, మళ్లీ ఇలా రమ్మని అడగను. ఆ ఫోటోలు ఎందుకు పంపించానో తెలుసుకోవాలంటే ఇక్కడికి రా అంటాడు. దీంతో, స్వప్న అరుణ్ ని కలవడానికి బయటకు వెళ్తుంది. అలా వెళ్లడం రాహుల్, రుద్రాణి సీక్రెట్ గా చూస్తూ ఉంటారు. ఇదే టైమ్ లో రాజ్ ని రూమ్ నుంచి బయటకు వచ్చేలా చూసి, స్వప్న, అరుణ్ లను చూసేలా చేయమని రుద్రాణి సలహా ఇస్తుంది.

రాహుల్, రాజ్ దగ్గరకు వెళ్లబోయి, ముందే రాజ్ ని లేపి, అక్కడ ఏమీ జరగకపోతే ఫూల్ అవుతాను అనుకుంటాడు. ముందు, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని వెళతాడు. ఈలోగా స్వప్న, గార్డెన్ లో ఉన్న అరుణ్ దగ్గరకు కోపంగా వెళ్తుంది. పై నుంచి రాహుల్, రుద్రాణిలు చూస్తూ ఉంటారు. అక్కడకు వెళ్లిన తర్వాత స్వప్న వెంటనే అరుణ్ చెంప పగలకొడుతోంది.  ఎంత ధైర్యం ఉంటే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావ్ అని కోప్పడుతుంది.  ఈ టైమ్ లో రాజ్ వచ్చి, ఈ సీన్ చూస్తే చాలు అనుకొని, ఫోన్ చేయబోతూ ఉంటాడు. కానీ, అప్పటికే రాజ్ బయటే ఉంటాడు. కానీ, బాల్కనీకి రమ్మని అడిగితే, వస్తాను అంటాడు.

మరోవైపు స్వప్న అరుణ్ ని ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. అప్పుడు అరుణ్, స్వప్నకు ప్రేమిస్తున్నానని చెబుతాడు. అది విని స్వప్న షాకౌతుంది.  సరిగ్గా అప్పుడే రాజ్, బాల్కనీకి వచ్చేస్తాడు.  కింద నుంచి కావ్య ఈ మాటలు వినేస్తుంది. ‘నాకు పెళ్లి కానప్పుడే నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఇప్పుడ ప్రపోజ్ చేస్తే ఎలా ఒప్పుకుంటాను? నా మీద కోపంతో నా కాపురం చెడ గొట్టడానికి వచ్చావా?’ అని స్వప్న నిలదీస్తుంది. నీకు, రాహుల్ కి గొడవలు అవుతున్నాయని తెలిసి వచ్చానని, నన్ను పెళ్లి చేసుకుంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని మాట ఇస్తాడు. పైన ఉన్న రాహుల్ రాజ్ తో ఓ విషయం చెబుతానని పిలిచి, బాల్కనీలో నిలపెట్టి, ఏమీ చెప్పకుండానే వెళ్లిపోతాడు. రాజ్ కూడా వెళ్లిపోబోతూ...కింద స్వప్న,అరుణ్ లను చూసేస్తాడు. ఈ టైమ్ లో స్వప్న ఎవరో అబ్బాయితో మాట్లాడుతోందని రాజ్ అనుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఫ్రెండ్ సహాయం కోసం వచ్చాడేమో , తప్పుగా అనుకోకూడదు అని రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక, స్వప్న తనకు పెళ్లైందని, మెడలో తాళి ఉందని గట్టిగా తిట్టడంతో అరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Brahma Mudi Serial Today 18th November:Swapna Meets Arun ram

ఇక, కావ్య, స్వప్నను పక్కకు తీసుకువెళుతుంది. ‘ఏంటక్కా ఇది ఒకటి తర్వాత ఒకటి సమస్య నెత్తిన వేసుకుంటే నీకు బాగా అలవాటైపోయినట్టుంది’ అని కావ్య స్వప్నను ప్రశ్నిస్తుంది. తనకు అలాంటి సరదాగా నాకేం లేవని స్వప్న అనగా మరి అరుణ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, అది కూడా ఇంత రాత్రి సమయంలో అని కావ్య ప్రశ్నిస్తుంది. పెళ్లి తర్వాత ఇలా అర్థరాత్రి ఫ్రెండ్స్ ని కలిస్తే ఏమనుకుంటారో తెలుసా అని కావ్య అడగగా, అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టే, కలిశానని చెబుతుంది. ఏంటి ఆ పరిస్థితి అని కావ్య అడగగా, అరుణ్ విషయం మొత్తం చెప్పేస్తుంది. అరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడని అసలు విషయం చెబుతుంది. అంతేకాకుండా, అరుణ్ కి వార్నింగ్ ఇచ్చానని వాడు నా జోలికి రాడు అని చెబుతాడు. కానీ, కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఇంకో తప్పు చేస్తే ఊరుకోను అని అంటుుంది. దీంతో, స్వప్న తాను తప్పు  చేయలేదు అని, ఆ అరుణ్ కి తాను అసలు ఫోన్ కూడా చేయలేదని, వాడు ఇప్పుడు సడెన్ గా ఎందుకు వచ్చాడో తెలీదు అని చెబుతుంది. వాడు మళ్లీ వస్తే, నాకు చెప్పు అని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు కనకం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె భర్త దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతాడు. చాలా సేపు ఆలోచించి అప్పూ గురించి చెప్పాలని కనకం నిర్ణయించుకుంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక, కమింగ్ అప్ లో రాజ్ తో వాళ్ల నానమ్మ మాట్లాడాలని పిలుస్తుంది. అరుణ్ ఫోటోని రాజ్ కి చూపిస్తుంది. స్వప్నతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి అని చెబుతుంది. రాజ్ షాకౌతాడు. ఇదే ఫోటో తీసుకువెళ్లి, కావ్యను కూడా అడుగుతాడు. కావ్య అతని పేరు అరుణ్ అని, తన అక్క కాలేజ్ ఫ్రెండ్ అని చెబుతుంది. మరి, సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం..


 

Follow Us:
Download App:
  • android
  • ios