Published : Oct 25 2024, 06:38 AM IST Bigg Boss Telugu 8 live Updates|Day 54: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్
సారాంశం
ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, మెహబూబ్, పృథ్విరాజ్, నయని పావని నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం నయని పావని, మెహబూబ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నారట.
భార్య ప్రియతో నాగ మణికంఠకు గొడవలకు కారణం అదే!
తాజాగా నాగ మణికంఠ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. భార్య ప్రియతో గొడవలకు కారణాలు చెప్పాడు. మీ భార్యతో మనస్పర్థలు విడాకుల వరకు వెళ్లిందట కదా? అసలు గొడవేంటి? ఎందుకు తలెత్తింది? అని యాంకర్ అడిగాడు.
విడాకులు తీసుకునేంత పెద్ద గొడవలేమీ మాకు లేవు. పెళ్లయ్యాక నేను ప్రియతో పాటు అమెరికా వెళ్ళాను. డిపెండెంట్ వీసా మీద నేను అక్కడ ఉండేవాడిని. మూడు నెలల్లో వీసా వస్తుందని అనుకున్నాము. ఏడాదిన్నర గడిచినా వీసా లేదు. దానికి తోడు నాకు సంపాదన లేదు. వీసా ఎప్పుడు వస్తుందని ప్రియ తరచుగా అడిగేది. కాలం గడిచే కొద్దీ ఆమెలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది.
నువ్వు తిరిగి ఇండియా వెళ్ళిపోయి అక్కడ కెరీర్ చూసుకో అంది. ఇప్పుడా అని నేను అన్నాను. అప్పుడు పాపతో పాటు నేను ఇండియాకు వచ్చేశాను. తర్వాత నాకు వీసా వచ్చింది. తిరిగి అమెరికా వెళ్లాలనుకున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నా భార్య చాలా మంచిది. తనకు సహనం ఎక్కువ. చాలా మెచ్యూరిటీగా ఉంటుంది. నన్ను మూడేళ్లు భరించింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు... అని నాగ మణికంఠ చెప్పుకొచ్చాడు.
కంటెస్టెంట్స్ లో ఎవరు తెలివైనవారు?
కంటెస్టెంట్స్ తెలివితేటలకు పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. మీలో ఎవరు తెలివైనవారు టాస్క్ లో తికమక పెట్టే ప్రశ్నలతో ఇరుకున పెట్టాడు. ఈ టాస్క్ ఒకింత ఫన్నీగా సాగింది.

పృథ్వికి సేవలు చేస్తున్న విష్ణుప్రియ, వీడియో వైరల్
కంటెస్టెంట్ పృథ్విరాజ్ పట్ల ఎనలేని ప్రేమ చూపిస్తుంది విష్ణుప్రియ. అర్ధరాత్రి పృథ్విరాజ్ కి సేవలు చేస్తుంది ఆమె. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Scroll to load tweet…
ఆ ఇద్దరిలో ఒకరు అవుట్
మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుంది. ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, మెహబూబ్, పృథ్విరాజ్, నయని పావని నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం నయని పావని, మెహబూబ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నారట. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట.