Published : Sep 21 2024, 06:34 AM IST| Updated : Sep 21 2024, 06:37 AM IST Bigg Boss Telugu 8 live Updates|Day 20: వైల్డ్ కార్డు ఎంట్రీలో వారిద్దరు పక్కా!
సారాంశం
సీజన్ 1లో పాల్గొన్న హరి తేజ, సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ రావడం పక్కా అంటున్నారు.
ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు, బయటకు పంపేసిన నాగార్జున
వాళ్లకు స్టార్ మా షాక్, బిగ్ బాస్ వీడియోలపై కాపీ స్ట్రైక్స్!
బిగ్ బాస్ షో వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై స్టార్ మా ఛానల్ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది. కాపీ రైట్ స్ట్రైక్స్ వేస్తున్నారట. దీనిపై కొందరు నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వీడియోలను ఎడిట్ చేసి కంటెస్టెంట్స్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దానికి అడ్డు కట్ట వేసినట్లు అవుతుందని అంటున్నారు. అదే సమయంలో అసలు నీ బిగ్ బాస్ షోని ప్రమోట్ చేస్తుంది మేమే. కాపీ రైట్ స్ట్రైక్స్ వేయడం వలన స్టార్ మా కే నష్టం అంటున్నారు ఇంకొందరు.
Scroll to load tweet…
డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
మూడో వారం బిగ్ బాస్ తెలుగు 8 షో నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గత వారం బాటమ్‌లో ఉన్న ఇద్దరు ఈ సారి కూడా కిందనే ఉన్నారు. కానీ అనూహ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించిన వ్యక్తి కూడా తక్కువ ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది. కింద అభయ్ ఉండగా, ఆ తర్వాత కిర్రాక్ సీత, పృథ్వీ రాజ్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేషన్ అనేది సస్పెన్స్ గా మారింది.
నాగ మణికంఠ సింపతీ గేమ్ కి వైఫ్ బ్రేక్!
వైల్డ్ కార్డు ఎంట్రీలో వారిద్దరు పక్కా!