ఆ కంటెస్టెంట్ వస్తే, బిగ్ బాస్ 8 అట్టర్ ప్లాపే, ఆమెను తేవద్దు బాబోయ్ అంటున్న ప్రేక్షకులు!
బిగ్ బాస్ తెలుగు 8 ఆశించిన స్థాయిలో లేదు. దానికి తోడు వైల్డ్ కార్డు ఎంట్రీస్ లిస్ట్ లో వినిపిస్తున్న పేర్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
నాలుగు వారాలు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి టీఆర్పీ వచ్చింది. 14 మంది కంటెస్టెంట్స్ లో చెప్పుకోదగ్గ సెలెబ్స్ లేరు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్ మాత్రమే కొంచెం పేరున్న సెలెబ్స్. ఈ క్రమంలో ఆడియన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
బిగ్ బాస్ తెలుగు 8లో కన్నడ డామినేషన్
ప్రతి సీజన్లో ఒకరిద్దరు ఇతర భాషలు, పరిశ్రమలకు చెందిన సెలబ్స్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తారు. ఈసారి దాదాపు యాభై శాతం ఉన్నారు. ఆదిత్య ఓం తెలుగు సినిమాలతో పాప్యులర్ అయినప్పటికీ, తెలుగువాడు కాదు. మన భాషపై పట్టు అంతంత మాత్రమే.
ఇక యష్మి గౌడ, ప్రేరణ, నిఖిల్, పృథ్విరాజ్ కన్నడ నటులు. వీరందరూ స్టార్ మాలో ప్రసారమైన పలు సీరియల్స్ లో నటించిన నటులు. ప్రస్తుతం హౌస్లో వీరిదే డామినేషన్. ఒకటిగా ఆడినా ఆడకున్నా.. ఈ నలుగురు కంటెస్టెంట్స్ మధ్య అవగాహన ఉంది. కొన్నేళ్లుగా తెలుగు సీరియల్స్ లో కన్నడ నటులు డామినేషన్ విపరీతంగా పెరిగింది.
హీరో, హీరోయిన్స్ తో పాటు విలన్, సపోర్టింగ్ రోల్స్ కి కూడా కన్నడ నటులనే ఎంపిక చేస్తున్నారు. తెలుగు సీరియల్ నటులకు అన్యాయం జరుగుతుంది. ఈసారి బిగ్ బాస్ షోలో కూడా వారికే పెద్దపీట వేయడం విశేషం.
పేలవంగా బిగ్ బాస్ తెలుగు 8
బిగ్ బాస్ తెలుగు 8 పట్ల ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కంటెంట్ ఇచ్చే, ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్స్ లేకపోవడం ఒక కారణం. అలాగే టాస్క్, గేమ్స్ ఏమంత రంజుగా లేవు. క్లాన్స్ పేరుతో ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించి టాస్క్స్ పెడుతున్నారు. ఆ టీమ్ వాళ్ళు ఇటు... ఈ టీమ్ వాళ్ళు అటు మారుతున్నారు. ఒక్కరికి కూడా తమ టీమ్ పట్ల సీరియస్ నెస్ ఉండటం లేదు.
తమని తాము నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అందుకే కంటెస్టెంట్స్ లో కసి లేదు. సీజన్ 7లో గెలిచిన కంటెస్టెంట్ ముందు ఓడిన వాళ్ళు రేసులో వెనకుండిపోయేవారు. దాంతో నెక్స్ట్ టాస్క్ లో అయినా గెలవాలని శక్తి మొత్తం ధారపోసి గేమ్ ఆడేవారు. ఆ స్పిరిట్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లో లేదు. అందుకు కారణం బిగ్ బాస్ పెడుతున్న టాస్క్స్, ఆడిస్తున్న విధానం కూడాను.
బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్
ప్రేక్షకులు షోని ఆదరించడం లేదని మేకర్స్ కి అర్థమైంది. వీకెండ్ లో ఓ మోస్తరు టీఆర్పీ రాబడుతున్న బిగ్ బాస్ తెలుగు 8, వీక్ డేస్ లో నిరాశపరుస్తుంది. యావరేజ్ 4 టీఆర్పీ తెచ్చుకుంటుందట. వీకెండ్స్ లో 6-7 వరకు ఉంటుందట. రానున్న రెండు నెలలైనా క్యాష్ చేసుకోవాలని భావించిన మేకర్స్ భారీ ఎత్తున వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తున్నారట.
అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపుతున్నారట. హరితేజ, ముక్కు అవినాష్, మెహబూబ్, గంగవ్వ, యాంకర్ రవి, శోభా శెట్టి, రోహిణితో పాటు మొత్తం 10 మంది వస్తున్నారట. వీరందరూ గత సీజన్స్ లో పాప్యులర్ అయిన కంటెస్టెంట్స్. కంటెంట్ ఇవ్వడంలో దిట్టలు. మంచి ఎంటర్టైనర్స్ కూడాను.
సీజన్ 7లో మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి 5 మందిని మాత్రమే పంపారు. కానీ సీజన్ 8లో ఏకంగా పది మంది హౌస్లోకి వెళుతున్నారట. అవినాష్, హరితేజ, రోహిణి, యాంకర్ రవి, మెహబూబ్ వంటి పేర్లు ప్రేక్షకులకు కిక్ ఇస్తున్నాయి. అవినాష్ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేశాడు. తోటి కంటెస్టెంట్స్ ని అతడు ఇమిటేట్ చేస్తుంటే, నవ్వులు పూయాల్సిందే.
బిగ్ బాస్ హౌస్లోకి ఆమె వద్దు బాబోయ్
వైల్డ్ కార్డు ఎంట్రీ లిస్ట్ లో ఉన్న కొందరు మాజీ కంటెస్టెంట్స్ పేర్లు మాత్రం భయపెడుతున్నాయి. శోభా శెట్టి మరలా రావాలని ఆడియన్స్ కోరుకోవడం లేదు. ఆమె సీజన్ 7 మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. శోభ శెట్టి పై అత్యంత నెగిటివిటీ నడిచింది. ఆమె కెరీర్ పై కూడా బిగ్ బాస్ షో ప్రభావం పడింది. హౌస్ నుండి బయటకు వచ్చాక శోభ శెట్టి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది.
కాగా గంగవ్వను అసలు వద్దంటున్నారు. గంగవ్వ హౌస్లోకి వస్తే ఆట స్వరూపమే మారిపోతుంది. ప్రతి ఒక్కరు ఆమెపై సింపతీ చూపుతూ పూర్తి స్థాయిలో గేమ్ ఆడలేరు. గంగవ్వను ఎవరూ నామినేట్ చేయలేరు. ప్రేక్షకుల్లో ఆమె పట్ల పెద్ద మొత్తంలో సింపతీ ఉంటుంది. ఆమెను నామినేట్ చేసినా, వ్యతిరేకంగా మాట్లాడినా... నెగిటివ్ అవుతామని కంటెస్టెంట్స్ భావిస్తారు.
అలాగే ఫిజికల్ టాస్క్ లలో గంగవ్వకు మినహాయింపు ఇవ్వాల్సి వస్తుంది. గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే... ఇప్పటి కంటే షో ఇంకా దిగజారిపోతుంది. అసలుకే మోసం వస్తుంది. కాబట్టి గంగవ్వను మాత్రం షోకి తేవద్దని సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి