బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. వీరిలో టాప్ 5 ఎవరో తేల్చాలని వేదిక మీదకు వచ్చిన మాజీ కంటెస్టెంట్ శివాజీని నాగార్జున అడిగారు. నెంబర్ వన్ ప్లేస్ శివాజీ విష్ణుప్రియకు ఇవ్వడం విశేషం. దానికి ఆమె ఆశ్చర్యానికి గురైంది. నువ్వు గెలవాలిరా అని శివాజీ ఎంకరేజ్ చేశాడు.
Bigg Boss Telugu 8 live Updates|Day 76: ఊహించని ఎలిమినేషన్!

ఓటింగ్ లో వెనకబడిన విష్ణప్రియ ఎలిమినేట్ అవుతుంది అంటూ సోషల్ మీడియా బజ్. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే అది పెద్ద సంచలనమే అవుతుంది.
శివాజీ దృష్టిలో నెంబర్ వన్ ఎవరంటే?
రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా నీకు
బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేసేందుకు సెలెబ్స్, మాజీ కంటెస్టెంట్స్ వేదిక మీదకు వచ్చారు. వారిలో శివాజీ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో గౌతమ్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. యష్మి నిన్ను పట్టించుకోవడం లేదు. నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా, అంటూ గౌతమ్ ని శివాజీ ఆట పట్టించాడు.
బిగ్ బాస్ వేదికపైకి సెలబ్రెటీలు
బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేసేందుకు సెలెబ్స్, మాజీ కంటెస్టెంట్స్ వేదిక మీదకు వచ్చారు. వీరిలో ప్రియ, విష్ణుప్రియ చెల్లులు పావని, యాంకర్ రవి, శివాజీ వచ్చారు.

యష్మి, పృథ్విలలో ఒకరు అవుట్!
మొదటిసారి కన్నడ బ్యాచ్ కి షాక్ తగిలిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా మారిన ఓటింగ్ నేపథ్యంలో పృథ్వి, యష్మిలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. ఓటింగ్ లో విష్ణుప్రియ వెనుకబడింది. ఆమె ఎలిమినేట్ కావచ్చని కథనాలు వెలువడ్డాయి. విష్ణుప్రియ ఎలిమినేట్ కాని పక్షంలో అవినాష్ ఇంటిని వీడే అవకాశం ఉందన్నారు.
డేంజర్ జోన్లో ఉన్న విష్ణుప్రియ, అవినాష్ పుంజుకున్నారట. రెండో స్థానంలో ఉన్న యష్మి డేంజర్ జోన్లోకి వచ్చిందట. ఆమె చివరి స్థానంలో ఉందట. ఇక ఐదో స్థానంలో పృథ్విరాజ్ ఉన్నాడట. కాబట్టి ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. కన్నడ టీమ్ నుండి ఒకరు హౌస్ నుండి బయటకు వెళ్లనున్నారట.
ఊహించని ఎలిమినేషన్!
నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. గౌతమ్, యష్మి, టేస్టీ తేజ, అవినాష్, పృథ్వి, విష్ణుప్రియ ఈ వారానికి నామినేట్ అయ్యారు. ఓటింగ్ లో వెనకబడిన విష్ణప్రియ ఎలిమినేట్ అవుతుంది అంటూ సోషల్ మీడియా బజ్. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే అది పెద్ద సంచలనమే అవుతుంది.