12:42 PM (IST) Nov 17

తేజ, అవినాష్ లలో ఒకరు అవుట్

11వ వారానికి గాను నామినేషన్స్ లో ఉన్న గౌతమ్, యష్మి, పృథ్వి, విష్ణుప్రియ సేవ్ అయ్యారు. టేస్టీ తేజ, అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని నాగార్జున తెలిపారు. అయితే నబీల్ వద్ద అవిక్షన్ షీల్డ్ ఉంది. అది వాడి ఒకరిని సేవ్ చేయవచ్చని నాగార్జున చెప్పారు. 

YouTube video player

12:18 PM (IST) Nov 17

కప్పు కొట్టుకునిరా నిఖిల్ కి అమర్ దీప్ అల్టిమేటం

బిగ్ బాస్ వేదికపైకి సెలెబ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. నిఖిల్ కోసం సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ వచ్చారు. నీ మైండ్ లో ఏమనిపిస్తే దాని ఆధారంగా నామినేట్ చేయమని సలహా ఇచ్చాడు. నిఖిల్ నువ్వు ఖచ్చితంగా కప్ కొట్టుకుని రావాలని అమర్ దీప్ అల్టిమేటం జారీ చేశాడు. 

12:14 PM (IST) Nov 17

యష్మి మందు కొడుతుందా!

బిగ్ బాస్ వేదికపైకి సెలెబ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. మాజీ కంటెస్టెంట్ శ్రీసత్య సైతం వచ్చారు. ఆమె యష్మికి సంబంధించిన టాప్ సీక్రెట్ బయటపెట్టింది. సాయంత్రం ఆరు అయ్యాక యష్మి మందు కొడుతుందట. నీది ఏం బ్రాండ్ అమ్మా అని నాగార్జున యష్మిని నేరుగా అడిగాడు. యష్మి గట్టిగా నవ్వేసింది. 

YouTube video player

11:26 AM (IST) Nov 17

టాప్‌ 5లో ఎంటర్‌ టైనర్లకి మొండిచేయి ?

బిగ్‌ బాస్‌ లో ఈ వారం ఫ్యామిలీ వీక్ మాత్రమే కాదు, ఫ్యామిలీతోపాటు సెలబ్రిటీ వీక్‌లానూ ప్లాన్‌ చేశారు బిగ్‌బాస్‌. శనివారం ఎపిసోడ్‌ కంటెస్టెంట్లకి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. వాళ్లు టాప్‌ 5 రేటింగ్‌ ఇచ్చారు. ఇందులో ఆద్యంతం ఎంటర్‌టైన్‌ చేస్తున్న కమెడియన్లకి మొండిచేయి చూపించారు. టాప్‌ 5లో వారు ఉండరనే సందేశాలను పంపించారు. ఎక్కువగా గౌతమ్‌, నిఖిల్‌, పృథ్వీరాజ్‌, నబీల్‌, ప్రేరణలకు టాప్‌ 5 రేటింగ్‌ ఇచ్చారు. విష్ణు ప్రియకి, యష్మిలకు కూడా అనుకున్నంత స్థాయిలో టాప్‌ 5 రేటింగ్‌ దక్కలేదు. దీంతోపాటు రోహిణి, అవినాష్‌, టేస్టీ తేజలకు ఒక్కోక్కరు మాత్రమే సెలక్ట్ చేశారు. మెజారిటీగా వీరికి టాప్‌ 5 స్థానం దక్కకపోవడం విచారకరం. 

08:32 AM (IST) Nov 17

టాప్‌ 5లో యష్మికి చుక్కెదురు?

మొన్నటి వరకు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ గా ఉన్న యష్మి టాప్‌ 5లో చోటు సంపాదించలేకపోయింది. శనివారం ఎపిసోడ్‌లో సెలబ్రిటీ, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాళ్లు టాప్‌ 5 రేటింగ్‌ ఇచ్చారు. ఇందులో యష్మిక కేవలం ఒకేసారిమాత్రమే టాప్‌ 5 రేటింగ్‌లో ఉంది. మిగిలిన అన్నిసార్లు ఆమెని టాప్‌ 5గా పరిగణించలేదు. ఇది ఆమెకి పెద్ద షాక్‌. అంతేకాదు ఈ వారమో, వచ్చే వారమో ఆమె ఎలిమినేట్‌ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. 

07:06 AM (IST) Nov 17

ఆ ముగ్గురిలో ఒకరు ఔట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పదకొండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సారి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ హౌజ్‌ని వీడబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గౌతమ్‌, పృథ్వీరాజ్‌ సేవ్‌ అయ్యారు. ఇక నామినేషన్‌లో టేస్టీ తేజ, యష్మి, విష్ణు ప్రియా, అవినాష్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. తేజ కి బాగానేఓటింగ్‌ ఉందట. యష్మిగానీ, విష్ణు ప్రియా గానీ ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే అవినాష్‌ పేరు కూడా వినిపిస్తుంది. ఎవరు హౌజ్‌ని వీడుతారనేది కాసేపట్లో తేలనుంది.