Asianet News TeluguAsianet News Telugu

వాళ్లకు అనసూయ మాస్ వార్నింగ్... నేను దిగనంత వరకే అంటూ రెచ్చిపోయిన ఫైర్ బ్రాండ్!

అనసూయ వాళ్లకు మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఏదైనా నేను దిగనంత వరకే అంటూ బాలయ్యను గుర్తు చేసింది. ఇంతకీ అనసూయ సవాల్ విసిరింది ఎవరికో తెలుసా?
 

anasuya bharadwaj mass warning to kiraak boys video goes viral
Author
First Published Aug 24, 2024, 7:33 PM IST | Last Updated Aug 24, 2024, 7:33 PM IST

దాదాపు దశాబ్దం పాటు బుల్లితెరను ఏలింది అనసూయ. జబర్దస్త్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గ్లామరస్ యాంకర్ ఇమేజ్ తో కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. ఈ విషయంలో ఆమె ట్రెండ్ సెట్టర్. గతంలో తెలుగు యాంకర్స్ ఎవరూ మోతాదుకు మించి గ్లామర్ షో చేసింది లేదు. అనసూయ పొట్టి బట్టలపై పెద్ద చర్చే నడిచింది. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే బుల్లితెర షోలో అసభ్యకరమైన బట్టలు ధరించడం ఏమిటంటూ... అనసూయను చాలా మంది విమర్శించారు. 

అయితే ఆ విమర్శలను అనసూయ లెక్క చేసింది లేదు. నా బట్టలు నా ఇష్టం. నాకు సౌకర్యంగా అనిపిస్తే చాలు. ఎలాంటి బట్టలైనా ధరిస్తాను, అని అనసూయ కౌంటర్లు విసిరింది. పలుమార్లు అనసూయ డ్రెస్సింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. నా వృత్తిలో భాగమంటూ అనసూయ సమర్థించుకుంది. యాంకర్ గా వచ్చిన ఫేమ్ ఆమెకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తెచ్చిపెట్టింది. లీడ్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమెకు దక్కుతున్నాయి. నటిగా సెటిల్ అయ్యాక, జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. 

2022లో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. ఏడాదికి పైగా అనసూయను బుల్లితెర ప్రేక్షకులు మిస్ అయ్యారు. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్-ఖిలాడీ గర్ల్స్ షోలో అనసూయ అమ్మాయిల ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ఇక అబ్బాయిల ప్రతినిధిగా శేఖర్ మాస్టర్ ఉన్నారు. ఈ షోలో సైతం తన మార్క్ చూపించింది అనసూయ. గ్లామరస్ అవతార్ లో మెస్మరైజ్ చేస్తుంది. 

కాగా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో గ్రాండ్ ఫినాలే ఆగస్టు 25న ప్రసారం కానుంది. బుల్లితెర సెలెబ్స్ అమ్మాయిలు, అబ్బాయిలుగా విడిపోయి పోటీపడుతున్నారు. విన్నర్ ఎవరో రేపు తేలనుంది. దీని కోసం స్పెషల్ ప్రోమో విడుదల చేసింది స్టార్ మా. ఖిలాడీ గర్ల్స్-కిరాక్ బాయ్స్ ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ప్రోమో చివర్లో వచ్చిన అనసూయ హీరో బాలయ్య డైలాగ్ చెప్పి గూస్ బంప్స్ రేపింది. ''చెప్పండి ఆ కిరాక్ బాయ్స్ కి. సెంటరైనా స్టేట్ అయినా.. పొజిషన్ అయినా అపోజిషన్ అయినా... పవర్ అయినా పొగరైనా.. నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్'' అంటూ డైలాగ్ అదరగొట్టింది. కిరాక్ బాయ్స్-ఖిలాడీ గర్ల్స్ ప్రోమో వైరల్ అవుతుంది.. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios