లారెన్స్ మూవీ ఆడిషన్స్ కి వెళ్ళా, డైరెక్టర్ ఎంత నీచంగా బిహేవ్ చేశాడంటే..బయటపెట్టిన యువ నటి
చిత్ర పరిశ్రమలో తవ్వేకొద్దీ కాస్టింగ్ కౌచ్ వేధింపులు బయటపడుతూనే ఉన్నాయి. ఈ తరం నటీమణులు తమకు జరిగిన వేధింపులని ధైర్యంగా బయటపెట్టేస్తున్నారు.తాజాగా తమిళ యువ నటి తనకి ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది.

చిత్ర పరిశ్రమలో తవ్వేకొద్దీ కాస్టింగ్ కౌచ్ వేధింపులు బయటపడుతూనే ఉన్నాయి. ఈ తరం నటీమణులు తమకు జరిగిన వేధింపులని ధైర్యంగా బయటపెట్టేస్తున్నారు. అవకాశాల పేరుతో నటీమణులని వేధింపులకు గురిచేయడం.. అంగీకరించకుంటే వారిపై కక్ష్య సాధించడం జరుగుతూనే ఉంది. మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా తమిళ యువ నటి తనకి ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన విజె దీపిక.. బుల్లితెర నటిగా, హోస్ట్ గా రాణిస్తోంది. ఈ యువ నటికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హోమ్లీ లుక్స్ తో దీపికా ఆకట్టుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది.
దీపికా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాఘవ లారెన్స్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తుంటే వెళ్ళా. అది చెల్లి పాత్ర కోసం చేస్తున్న ఆడిషన్స్. ఆ మూవీలో దాదాపుగా నన్నే ఫైనల్ చేశారు. కానీ డైరెక్టర్ వద్దే ఎంతో బాధించే సంఘటన జరిగింది. ఆ డైరెక్టర్ నన్ను లోబరుచుకోవాలని ప్రయత్నించాడు.
ఈ చిత్రంలో ముద్దు సన్నివేశం ఉంది. రిహార్సల్స్ లాగా ఇక్కడ ఒకసారి చేసి చూపించి అని అసభ్యంగా మాట్లాడాడు. నువ్వు ముద్దు పెట్టి చూపించాల్సిందే లేకుంటే ఛాన్స్ ఉండదు అని బెదిరించాడు. డైరెక్టర్ అలా మాట్లాడేసరికి ఏంచేయాలో అర్థం కాలేదు. షాక్ అయ్యాను. అలాంటివి నా వల్ల కావని వచ్చేశాను అని తెలిపింది. దర్శకుడు నన్ను మాన్యుపులేట్ చేయడం కోసం ప్రవర్తించిన విధానం ఎంతో బాధగా అనిపించింది అని విజె దీపికా తెలిపింది. నేను అక్కడ ముద్దు పెట్టడానికి అంగీకరించి ఉంటే.. నన్ను పూర్తిగా లైంగికంగా వాడుకోవాలని ఆ దర్శకుడు వ్యూహం పన్నాడు. ఇలా అవకాశాల పేరుతో బలవంతంగా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని విజె దీపికా ప్రశ్నించింది.