కరోనా ఎఫెక్ట్ సినీ రంగం మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాదాపు రెండు నెలలుగా లాక్‌ డౌన్‌ కొనసాగుతుండటంతో షూటింగ్ లు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో చిన్న చిన్న టెక్నీషియన్స్‌, నటీనటులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి డబ్బులు వస్తే తప్ప జీవనం కొనసాగించలేని పరిస్థితిలో ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే ఓ నటికి ఎదురైంది. పలు హిందీ సీరియల్స్‌లో నటిస్తున్న నటి సోనాల్‌ వెంగర్లేకర్‌ లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

గత నెల రోజులుగా తన దగ్గర ఉన్న డబ్బులతో నెట్టుకు వచ్చిన సోనాల్‌ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. డబ్బు అయిపోవటంతో పూట గడవని పరిస్థితి ఏర్పడింది. దీంతో గతంలో తనకు డబ్బు బాఖీ ఉన్న ఓ నిర్మాతకు ఫోన్ చేసిందట సోనాల్. చాలా కాలంగా తనకు రావాల్సిన రెమ్యూనరేషన్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఆ నిర్మాత తన నెంబర్‌ను బ్లాక్ చేశాడట. దీంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో తీవ్ర మనోవేదనకు గురైంది సోనాల్‌.

అయితే పరిస్థితి అర్ధం చేసుకున్న సోనాల్ మేకప్‌ మేన్‌ తనకు డబ్బు సాయం  చేసేశాడట. తన భార్య గర్భవతి అయినా తన డెలివరీ సమయానికి తిరిగి ఇస్తే చాలంటూ 15 వేల రూపాయలు ఆమెకు ఇచ్చాడట. దీంతో ఆమె కన్నీటి పర్యంతమైంది.  ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న సోనాల్, డబ్బు ఉన్న వాడు ముఖం చాటేస్తే డబ్బు లేని వాడు సాయం చేస్తున్నాడు అంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@pankajgupt09 ♥️

A post shared by Sonal Vengurlekar (@sonal_1206) on May 13, 2020 at 1:10am PDT