ప్రముఖ టీవీ నటి అస్మిత వివాహం చేసుకొంది. కొరియోగ్రాఫర్ సుధీర్ తో ఆమె వివాహం జరిగింది. చాలా కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతంలో అస్మిత ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

అయితే ఇటీవల ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. శనివారం రోజుల వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టీవీ నటులు, యాంకర్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు వ్యక్తులు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను. వీడియోలను పలువురు నటీమణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అస్మిత కెరీర్ విషయానికొస్తే.. 'పద్మవ్యూహం', 'మేఘసందేశం', 'మనసు మమత' ఇలా చాలా సీరియళ్లలో నటిస్తోంది. గతంలో ఒకట్రెండు సినిమాల్లో కూడా నటించింది.