సినీ సెలబ్రిటీస్‌ వరుసగా మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో రానా, కాజల్‌, నితిన్‌, నిఖిల్‌, నిహారిక, మహేష్‌ ఇలా చాలా మంది సెలబ్రిటీలు మ్యారేజ్‌లు చేసుకున్నారు. అందులో భాగంగా తాజాగా హిందీ టీవీ నటుడు కృష్ణశెట్టి కూడా ఓ ఇంటి వాడయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు, డెంటిస్ట్ అయిన ప్రగ్యాని ఆయన మంగుళూరులో కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహమాడాడు. ఈ వేడుకలో కరణ్‌ కుంద్రా, పౌలొమి దాస్‌ వంటి వారు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే కృష్ణ శెట్టి మ్యారేజ్‌ అయిన వెంటనే హనీమూన్‌ చెక్కేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భార్యతో కలిసి కూర్గ్ కి హనీమూన్‌ వెళ్లాడు. ఈ సందర్భంగా కృష్ణ శెట్టి స్పందిస్తూ, `నాకు పెళ్లైందన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. చేతులకు, కాళ్లకి మెహందీ, కాలికి వేళ్లకి రింగు చూశాక అవును, నేను నిజంగానే మ్యారేజ్‌ చేసుకున్నా అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఇది కలలగానే ఉంది. ఇదంతా ఈజీగా ఏం జరగలేదు. నా సోదరి ద్వారా ప్రగ్యాని కలిశాను. చూడగానే ఒకరినొకం నచ్చేశాం. 

ప్రగ్యా తల్లిదండ్రులు మాత్రం నాతో పెళ్లంటే సందిగ్దం వ్యక్తం చేశారు. ఎందుకంటే నటుడిగా జీవితం ఎప్పుడెలా ఉంటుందోనని భయపడ్డారు. ఆమెను ఓ ఇంటనీర్‌కి గానీ, డాక్టర్‌కి గానీ ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ మేమందరం ఓసారి సమావేశమైనప్పుడు మా మధ్య ఉన్న ప్రేమని చూసి వారు కూడా ఒప్పుకున్నారు. అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం` అని కృష్ణ శెట్టి తెలిపారు. కృష్ణ శెట్టి `దిల్‌ హై తో హై`, `టైమ్‌ మేషిన్‌`, `రుద్ర కే రక్షక్‌` వంటి టీవీ సీరియల్స్ లో నటించాడు.