మాజీ కేంద్ర మంత్రి, చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. సుష్మా మరణంతో ఆమె అభిమానులు, బిజెపి కార్యకర్తలు శోకంలో మునిగిపోయారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖకు భాద్యతలు వహించిన మహిళ సుష్మా స్వరాజే. సోషల్ మీడియాలో సుష్మా చాలా యాక్టివ్. 

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియాని ఆమె ఉపయోగించుకునేవారు. విదేశాల్లో ఉండే భారతీయములకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి చర్యలు చేపట్టేవారు. తాజాగా ప్రముఖ టివి నటుడు నరన్వీర్ బోరా సుష్మా స్వరాజ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. ఆమె చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నాడు. 

ఈ ఏడాది జనవరిలో కరన్వీర్ రష్యా పర్యటనకు వెళ్ళాడు. ఆ సమయంలో కరన్వీర్ పాస్ పోర్టు కాస్త డ్యామేజ్ అయింది. దీనితో కరన్వీర్ ని రష్యా అధికారులు ఎయిర్ పోర్ట్ లోనే ఆపేశారు. దీనితో కరన్వీర్ ట్విటర్ లో సుష్మా స్వరాజ్ ని సాయం చేయాలని కోరాడు. ఆమె వెంటనే స్పందించిన రష్యాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా తాత్కాలిక  పాస్ పోర్ట్ అతడికి అందేలా చేశారు. దీనితో కరన్వీర్ సోషల్ మీడియా ద్వారా సుష్మాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సమయంలో సుష్మా స్వరాజ్ సరదాగా ఓ మాట అన్నారు. మీరు అంగారకుడిపై చుక్కుకున్నా అక్కడికి ఇండియన్ ఎంబసీ చేరుకుంటుంది అని సుష్మా సరదాగా వ్యాఖ్యానించారు.  

కరన్వీర్ తాజాగా ట్విటర్ లో స్పందిస్తూ సుష్మా స్వరాజ్ మరణ వార్త విని షాకయ్యానని తెలిపాడు. ఆమె దేశం కోసం అంకితభావంతో పనిచేశారు. భారతీయులు ఏ దేశంలో ఉన్నా పరాయి అధీనంలో ఉన్న భావనని కలిగించకుండా విదేశాంగ శాఖకు భాద్యతలు నిర్వహించారని కరన్వీర్ సుష్మాపై స్వరాజ్ పై ప్రశంసలు కురిపించారు.