Asianet News TeluguAsianet News Telugu

RRR – TSRTC:ఆర్టీసీ కోసం ‘ఆర్ఆర్‌ఆర్’ని వాడేసిన సజ్జనార్..వీడియో !

మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ‘పుష్ప’ సినిమా డైలాగ్స్‌ను ఓ రేంజ్‌లో వాడిన సజ్జనారు.. నిన్న రాధేశ్యామ్‌ను ఉపయోగించుకున్నారు. ఇక ఇప్పుడు.. ‘ఆర్ఆర్ఆర్’ వంతు వచ్చింది.

 

Tsrtc MD Sajjanar Uses RRR Movie Song for Publicity to RTC Video Goes Viral on Social Media
Author
Hyderabad, First Published Mar 16, 2022, 8:00 AM IST | Last Updated Mar 16, 2022, 8:00 AM IST

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ నియమితులైనప్పటి నుంచి సంస్థను గాడిన పెట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బస్సులపై ప్రకటనలు తొలగించాలని, పెళ్లి వేడుకలకు బస్సు చార్జీల్లో రాయితీలతో పాటు, వివాహ జంటకు బహుమతులివ్వడం లాంటి నిర్ణయాలతో ప్రజలను ఆర్టీసీకి దగ్గర చేసారు. అలాగే అనేక నిర్ణయాలతో ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సజ్జనార్.. అందులో వచ్చే ఫిర్యాదులపై కూడా తక్షణమే స్పందిస్తూ చర్యలు తీసుకుంటుంటారు.

ఆదే సమయంలో ఆర్టీసీని ప్రయాణికులకు చేరువ చేసే క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా సజ్జనార్ వదలడం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రకాల మీమ్స్‌ను క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మోస్ట్ క్రేజీ ఫిల్మ్ ఆఫ్ ది ఇయిర్ గా చెప్పబడుతున్న‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైటిల్ అర్థాన్నే మార్చేసి.. ఆర్టీసికి  పబ్లిసిటీ ఇచ్చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రాష్ట్ర రోడ్డు రవాణా’ అంటూ సరికొత్త అర్థాన్ని చెప్పారు.  ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాటను కూడా ఆయన ఆర్టీసీకి పబ్లిసిటీ కోసం వాడేశారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ జెండా పట్టుకుని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాట పాడుతారు. సాధారణంగా ఈ పాటలో జెండాపై ‘వందేమాతరం’ అని ఉంటుంది. కానీ సజ్జనార్ చేసిన ట్వీట్‌లో ఆ ‘వందేమాతరం’ స్థానంలో టీఎస్ఆర్టీసీ లోగో, బస్సు గుర్తులు ఉన్నాయి. రెపరెపలాడుతున్న ఆ జెండాపై ఆర్టీసీ లోగో, బస్సు తళుక్కుమన్నాయి. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు ఆ ట్వీట్‌ను చూసి.. బాస్ అంటే మామూలుగా ఉండదు మరి అని కామెంట్స్ చేస్తున్నారు. సజ్జనార్ క్రియేటివిటీపై, ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

 యావత్ సినీ లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది. రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా RRR మార్చి 25న పలు భాషల్లో ఘనంగా రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న చెక్కిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన రాజమౌళి అండ్ టీమ్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios