రాజమౌళి దర్శకుడిగా, వ్యక్తిగతంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా జక్కన్న తన పని చేసుకుపోతుంటారు. అయితే తాజాగా రాజమౌళి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

రాజమౌళి దర్శకుడిగా, వ్యక్తిగతంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా జక్కన్న తన పని చేసుకుపోతుంటారు. అయితే తాజాగా రాజమౌళి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రాజమౌళి మంచి ఉద్దేశంతో ఆ ట్వీట్ చేసినప్పటికీ అది మరోలా టర్న్ అయింది. దీనితో రాజమౌళిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇంతకీ రాజమౌళి చేసిన ట్వీట్ ఏంటంటే.. దేవికారాణి బాహుబలి చిత్రం కోసం పనిచేశారు. చాలా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆమె అద్భుతంగా పనిచేశారు. ఆమె డెడికేషన్ పోల్చలేనిది. కానీ దురదృష్టవశాత్తు ఆమె బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 

దయచేసి ఆమెకు ఆర్థికంగా సాయం చేయండి అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. రాజమౌళి చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీతో కలసి పనిచేసిన ఆమె కోసం ఎంత సాయం చేసారు మీరు అంటూ జక్కన్నని ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి తన ట్వీట్ లో తన ఎంత సాయం చేశాను అని ప్రస్తావించలేదు. అసలు సాయం చేశారా లేదా అని నెటిజన్లు రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు. 

కోట్లు వెచ్చించి బాహుబలి చిత్రం తెరకెక్కించారు. ఆ చిత్రం వేలకోట్ల వసూళ్లు రాబట్టింది. దర్శకుడిగా మీరు కూడా కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు. అలాంటి మీరు మరొకరిని సాయం చేయమని కోరడం ఆశ్చర్యంగా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. మీరు మీ చిత్ర సభ్యులు సాయం చేస్తే సరిపోతుంది. మమ్మల్ని అడగాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు. 

ఆమె కోసం తాను ఏం చేసానో చెప్పకుండా ఇలా సోషల్ మీడియా వేదికగా రాజమౌళి లాంటి వ్యక్తి సాయం కోరడం వింతగా ఉంది అని అంటున్నారు. రాజమౌళి కూడా ఎంతోకొంత సాయం చేసి ఉంటారని, ఆ విషయాన్ని ఆయన ట్వీట్ లో మెన్షన్ చేసి ఉంటే పరిస్థితి కాస్త బావుండేది అని కొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళిపై తీవ్రంగా ఎటాక్ జరుగుతోంది.

సినిమాల విషయానికి వస్తే జక్కన్న ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కోవిడ్ కారణంగా ఆ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. 

Scroll to load tweet…