టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా 'దొరసాని' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

తెలంగాణాలో 80వ దశకంలో జరిగిన ఓ నిజజీవిత ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవీఆర్ మహేంద్ర డైరెక్ట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి సోషల్ మీడియాలో నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా హీరోగా నటిస్తోన్న ఆనంద్ దేవరకొండని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు.

టీజర్ లో అతడి లుక్స్, నటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోగా అతడి హావభావాలు బాగాలేవని కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ అయితే ఆనంద్ దేవరకొండ అల్లు శిరీష్ అంటూ అల్లు హీరోలను మధ్యలోకి తీసుకొచ్చారు. టీజర్ కే రెస్పాన్స్ ఇలా ఉందంటే.. ఇక సినిమాకి ఎలా ఉంటుందో చూడాలి!