టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం అత్తారింటికి దారేది. త్రివిక్రమ్ టేకింగ్ కు తగ్గట్టుగా పవన్ నటించిన విధానం సినిమా విజయానికి అసలు కారణం. అయితే ఆ సినిమాను శింబు కోలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. సుందర్ సి దర్శకత్వంలో  2.0 నిర్మాణసంస్థ లైకా *వందా రాజాదా వ‌రువేన్* గా తెరకెక్కించింది.

అయితే సినిమాలో కీలకమైన ఎపిసోడ్ నే దర్శకుడు పేలవంగా తెరకెక్కించాడు. పైగా శింబు నటనపై సెటర్లు పడుతున్నాయి. అత్తారింటికి దారేది సినిమాలో క్లయిమాక్స్ రైల్వే స్టేషన్ సీన్ లో శింబు రమ్యకృష్ణ ల మధ్య సాగిన ఎమోషనల్ సీన్ ను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. శింబు ఓవరాక్షన్ కామెడీగా ఉందని మీమ్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. 

గతంలో పవన్ కళ్యాణ్ స్టైల్ లోనే దబాంగ్ రీమేక్ ను గబ్బర్ సింగ్ స్టైల్ లో వదిలి హిట్టందుకున్న శింబు ఇప్పుడు మాత్రం అత్తారింటికి దారేది సినిమాతో మాత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. గత వారం రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ కూడా మొదటి రోజు నుంచే తగ్గడంతో బయ్యర్స్ పరిస్థితి డేంజర్ జోన్ లో పడినట్లు టాక్.