మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి చిత్రంలోనూ క్లాసికల్ టచ్ కనిపిస్తుంది. ఆయన సతీమణి సౌజన్య శ్రీనివాస్ కూడా క్లాసికల్ డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి చిత్రంలోనూ క్లాసికల్ టచ్ కనిపిస్తుంది. ఆయన సతీమణి సౌజన్య శ్రీనివాస్ కూడా క్లాసికల్ డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఇటీవల సౌజన్య శ్రీనివాస్ కూడా సినిమాల పరంగా యాక్టివ్ అవుతున్నారు. 

సౌజన్య శ్రీనివాస్ వివిధ వేదికలపై డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సొంతంగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ ప్రారంభించారు. ఆ బ్యానర్ నిర్మాణ బాధ్యతలని సౌజన్య శ్రీనివాస్ చూసుకుంటున్నారు. సితార ఎంటెర్టైనమెంట్స్ తో కలసి సౌజన్య చివరగా ధనుష్ 'సార్' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. 

ఇక త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి సౌజన్య మాట్లాడుతూ.. ఆయనతో మా కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. తరచుగా ఇంటికి వస్తుంటారు. త్రివిక్రమ్ గారు, పవన్ గారు ఇద్దరూ పురాణాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. 

త్రివిక్రమ్.. పవన్ కి వివిధ రకాల పుస్తకాలు ఇస్తుంటారు. మా బ్రాహ్మణుల భోజనం అంటే పవన్ కి చాలా ఇష్టం. ఇంటికి వచ్చినప్పుడు నేను వండిన వంటలని తప్పకుండా భోంచేసే వెళతారు అని సౌజన్య తెలిపారు. తాను క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చినప్పుడు.. మాసోదరి అద్భుతంగా చేసింది అని ప్రశంసించారు అని సౌజన్య గుర్తు చేసుకున్నారు.