Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్ మాట చెల్లుతుందా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు పని చేయనున్నారనే విషయంపై ఓ ఆసక్తికర న్యూస్ హల్చల్ చేస్తోంది. 

trivikram to work with devi sri prasad?
Author
Hyderabad, First Published Jan 2, 2019, 3:21 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు పని చేయనున్నారనే విషయంపై ఓ ఆసక్తికర న్యూస్ హల్చల్ చేస్తోంది.

గత కొంతకాలంగా త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ ల మధ్య బంధం సరిగ్గా ఉండడం లేదని టాక్. ఆ కారణంగానే త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమాకి అనిరుధ్ ని తీసుకొచ్చాడు. త్రివిక్రమ్ మాట కాదనలేక పవన్ కూడా అనిరుద్ కి ఓటేశాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో చేసిన 'అరవింద సమేత'కి కూడా అనిరుధ్ ని తీసుకోవాలనుకున్నాడు.

కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. దేవిశ్రీప్రసాద్ ని తీసుకోవాలనేది ఎన్టీఆర్ ప్లాన్. కానీ దానికి త్రివిక్రమ్ రెడీగా లేకపోవడంతో మధ్యలో తమన్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకి అనిరుధ్ పేరుని సూచించాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడు. కానీ ఈసారి త్రివిక్రమ్ మాట చెల్లెలా కనిపించడం లేదు. ఎందుకంటే బన్నీ, అల్లు అర్జున్ మంచి స్నేహితులు.

పైగా త్రివిక్రమ్-బన్నీ-దేవిశ్రీప్రసాద్ లది హిట్ కాంబినేషన్. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ రిస్క్ తీసుకునే ఛాన్స్ కనిపించడం లేదు. కాబట్టి ఈసారి త్రివిక్రమ్ కి దేవిశ్రీప్రసాద్ తో పని చేయక తప్పేలా లేదు. ఇటీవల 'వినయ విధేయ రామ' సినిమా ఆడియో వేదికపై కలుసుకున్న త్రివిక్రమ్-దేవిలు బాగానే మాట్లాడుకున్నారు. మరి ఆ రిలేషన్ ఎంతవరకు నిజమో బన్నీ సినిమాతో తేలిపోతుంది!

Follow Us:
Download App:
  • android
  • ios