మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రం ఏంటనే సస్పెన్స్ ఇంతవరకు వీడలేదు. గుంటూరు కారం చిత్రంతో త్రివిక్రమ్ కి గట్టి దెబ్బే తగిలింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రం ఏంటనే సస్పెన్స్ ఇంతవరకు వీడలేదు. గుంటూరు కారం చిత్రంతో త్రివిక్రమ్ కి గట్టి దెబ్బే తగిలింది. సంక్రాంతికి సంచలనాలు సృష్టిస్తుంది అనుకున్న గుంటూరు కారం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పైపై హంగులు వర్కౌట్ కాలేదు.
ఎప్పటిలాగే త్రివిక్రమ్ కొడుకు సెంటిమెంట్ తో విసుగు పుట్టించారని కామెంట్స్ వినిపించాయి. దీనితో త్రివిక్రమ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. అందరూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. దీనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్ దళపతి విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
డివివి దానయ్య ఈ కాంబినేషన్ ని సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే దానయ్య.. విజయ్, త్రివిక్రమ్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేశారట. ఈ మేరకు తమిళ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్.. విజయ్ తో చేయబోయే చిత్ర బ్యాక్ డ్రాప్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ స్టోరీని త్రివిక్రమ్.. విజయ్ కి వినిపించారట.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతవరకు కంప్లీట్ పొలిటికల్ మూవీ చేయలేదు. గతంలో కొన్ని చిత్రాలు వచ్చినప్పటికీ అందులో పాలిటిక్స్ ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్ విజయ్ కోసం పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించేందుకు దానయ్య సన్నాహకాలు చేస్తున్నట్లు టాక్. విజయ్ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. విజయ్ తమిళనాట పొలిటికల్ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
