Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్ చేతుల మీదుగా రీమేక్ చిత్రం ప్రారంభం, కథేంటి

 త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ నివ్వడం తో చిత్రం ప్రారంభ మయింది. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు)స్క్రిప్టు ను చిత్ర దర్శకుడు కి అందించారు. సిద్దు జొన్నలగడ్డ  హీరో  గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

Trivikram Srinivas launched Kappela remake jsp
Author
Hyderabad, First Published Jul 7, 2021, 4:00 PM IST

మలయాళంలో విజయవంతమైన ‘కప్పేల’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు ప్రారంభం అయ్యింది. వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న నూతన చిత్రం ( ప్రొడక్షన్ నంబర్ 9 ) ఈ రోజు సంస్థ కార్యాలయంలో ఉదయం 9.09 నిమిషాలకు పూజా కార్యక్రమాల తో ప్రారంభమైంది.

ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ నివ్వడం తో చిత్రం ప్రారంభ మయింది. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు)స్క్రిప్టు ను చిత్ర దర్శకుడు కి అందించారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం. శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది.

‘ప్రేమ’ లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి. రమేష్. నేడు పూజా కార్యక్రమాలు తో ప్రారంభమైన ఈ చిత్రం ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతరపాత్రల్లో నటీ నటులు ఎవరన్నది త్వరలో ప్రకటించటం జరుగుతుంది.

చిత్రం గ్రామీణ నేపథ్యంతో సున్నితమైన, భావోద్వేగమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. ప్రేమ పేరుతో మోసగించబడే యువతకు కనువిప్పు కలిగించేలా ఈ చిత్రం రూపొందింది. అన్నా బెన్, శ్రీనాథ్ భసీ, రోషన్ మ్యాథ్యూ లాంటి యువ నటుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మహ్మద్ ముస్తాఫా తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమై మంచి విజయాన్ని, ప్రశంసలను అందుకొన్నారు. ఈ చిత్రం గురించి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ లాంటి సోషల్ మీడియాలో ప్రస్తావించడం ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.

చిత్రం కథేమిటంటే...గ్రామీణ ప్రాంత యువతి జెస్సీ (అన్నా బెన్) విష్ణు అనే ఆటో డ్రైవర్‌తో ప్రేమలో పడుతుంది? ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉండటంతో విష్ణుతో కలిసి జెస్సీ ఊరి నుంచి లేచిపోతుంది. అలా పట్నం చేరిన జెస్సీకి విష్ణు నిజ స్వరూపం తెలుస్తుంది? ఆ క్రమంలో విష్ణు నుంచి తప్పించుకోవాలని చూసే క్రమంలో ఆమెను విష్ణు (రోహన్ మ్యాథ్యూ) కాపాడుతాడు. విష్ణు ఎవరు? జెస్సీని ఎందుకు కాపాడారు అనే ప్రశ్నలకు సమాధానమే కపేలా సినిమా కథ.

సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: స్వీకార్ అగస్తి
మాటలు: గణేష్ కుమార్ రావూరి
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి 

Follow Us:
Download App:
  • android
  • ios