గ్లామర్ ఒలికిస్తా అని రివర్స్ లో అడుగుతోందట!

trivikram rejects heroine's proposal
Highlights

టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయిలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.. వారిలో ఈషా రెబ్బ 

టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయిలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.. వారిలో ఈషా రెబ్బ కూడా ఒకరు. 'అమీ తుమీ', 'అ!' వంటి చిత్రాల్లో అమ్మడి పాత్ర బాగా పండడంతో అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ఓ పాత్ర కోసం ఈషాను ఎంపిక చేసుకున్నారు.

ఇప్పటివరకు ట్రెడిషనల్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈషాకు ఈ సినిమాలో కూడా అటువంటి పాత్రే దక్కిందట. త్రివిక్రమ్ ఆమెను హోమ్లీ లుక్ తో చూపించబోతున్నాడు. అయితే ఈషా మాత్రం రివర్స్ లో గ్లామర్ ఒలకబోస్తా అని అడుగుతోందట. ఈ మధ్యకాలంలో తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలో కూడా తన పాత్రకు గ్లామర్ టచ్ యాడ్ చేయమని అడుగుతోందట. 

హీరోయిన్ ఎక్స్ పోజ్ చేస్తానని అడుగుతున్నా.. త్రివిక్రమ్ మాత్రం దానికి అంగీకరించడం లేదని సమాచారం. స్క్రిప్ట్ మొత్తం లాక్ చేయడంతో ఇప్పుడు మార్పులు చేసే ఛాన్స్ లేదని తెగేసి చెప్పేశాడట. మరి ఈషా కోరికను ఏ సినిమా తీరుస్తుందో చూడాలి!

loader