మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సినిమా అనంతరం త్రివిక్రమ్ ఎవరితో వర్క్ చేస్తాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ గత మూడేళ్లలో సెట్ చేసుకున్న హీరోల లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. 

వెంకటేష్ తో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చి మెగాస్టార్ తో కూడా ఒక ప్రాజెక్ట్ కూడా లాక్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక మహేష్ బాబుతో కూడా వర్క్ చేసే అవకాశం ఉందని టాక్ రాగా అరవింద సమేత టైమ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ ఇయర్ ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలనీ త్రివిక్రమ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మరో వార్త వచ్చింది. 

రీసెంట్ గా వచ్చిన రూమర్స్ లో అయితే ఎక్కువగా మాటల మాంత్రికుడు మెగాస్టార్ చిరంజీవితో వచ్చే ఏడాది ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉందని కథనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు బన్నీ సినిమా అయిపోతే త్రివిక్రమ్ కి ఎక్కువగా అందుబాటులో ఉండేది తారక్ అనే తెలుస్తోంది. 

వెంకటేష్ - మెగాస్టార్ అయితే మరో దర్శకులతో బిజీ కానున్నారు. ఇక RRR ఫైనల్ షెడ్యూల్ కి దాదాపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే తారక్ ఎండ్ కార్డ్ పెట్టనున్నాడట. దీంతో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కథను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.